'అరేయ్ బచ్చా.. మా ఫ్యామిలీని అంతం చేసేవాడు ఇంకా పుట్టలేదు'

Update: 2023-06-28 10:00 GMT
ప్రెస్ మీట్ పెట్టి ఆనం రామనారాయణ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్.. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.ఈ సందర్భంగా ఆయన  నోటి నుంచి వచ్చిన మాటలు మంటలుగా మారాయి.

ఆనంలాంటి సీనియర్ నేతను పట్టుకొని అన్నేసి మాటలు అంటారా? అన్న ఆగ్రహం వ్యక్తమైంది. మర్యాద అన్నది వీసమెత్తు లేనట్లుగా అనిల్ మాటలు ఉన్నాయన్న ఆగ్రహాం వ్యక్తమైంది.

నెల్లూరులో ఎక్కడి నుంచి ఆనం పోటీ చేసినా.. తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని.. తనతో తలపడే దమ్ము.. ధైర్యం ఉందా? అంటూ అనిల్ సంధించిన ప్రశ్నలకు కౌంటర్ సమాధానాలు ఇచ్చేలా మాట్లాడారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి.

ఈ సందర్భంగా అనిల్ కు ఆయన పలు సవాళ్లు విసిరారు. అనిల్ కు సంబంధించిన పలు అంశాల్ని ప్రశ్నల రూపంలో సంధించిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

"అనిల్ కుమార్.. నువ్వు మా నాయకుల్ని ఒరేయ్.. తురేయ్ అంటే మేం దానికి మించి మాట్లాడగలం. అరేయ్ బచ్చా.. మా కుటుంబాన్ని అంతం చేసే వాడు ఇంకా పుట్టలేదు. మీరు మమ్మల్ని ఏం చేయలేరు.

మీకులా అధికారం ఉన్నప్పుడు ఒకలా.. అధికారం లేనప్పుడు మరోలా ప్రవర్తించం" అంటూ విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి అనిల్ కు ఆనం సంధించిన ప్రశ్నాస్త్రాల్ని చూస్తే..

-   మా నాయకుడు లోకేశ్‌ అమెరికాలో చదివాడని గర్వంగా చెప్పుకుంటాం. మీ నాయకుడు జగన్‌ ఏం చదివాడో చెప్పగలవా?
-  అసలు పదోతరగతి ఒకేసారి పాసై ఉంటే సర్టిఫికెట్‌ చూపించగలవా?
-  మీ నాయకుడికి దమ్ము, ధైర్మం ఉంటే తడబడకుండా, పేపర్‌ చూడకుండా గంటపాటు మీడియాతో మాట్లాడమను.పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెప్పమను చాలు. మీ నాయకుడి చదువు, తెలివితేటలు గొప్పవని ఒప్పుకుంటాం.
-  ఉత్తుత్తి ప్రమాణాలు చేసి, మీ పాపిష్టి పనులకు దేవుళ్లను డిస్టర్బ్‌ చేయడం ఎందుకు? నేరుగా జనంలోకి రండి అక్కడే తేల్చుకుందాం.
-  మీ బాబాయ్‌, నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తో సహా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో ఆఖరికి మంత్రులతో కూడా నీకు ఎందుకు పడటంలేదు?
-  మీ బాబాయ్‌కి వచ్చిన ఇంటర్నేషనల్‌ నోటీస్‌ వ్యవహారం దాచిపెట్టానని మరో మాజీ మంత్రే చెబుతుంటే సుమోటోగా తీసుకుని అతనిపై చర్యలు ఎందుకు తీసుకోరు?
-  ఆనం కుటుంబాన్ని అంతం చేసేటంత వాడివారా నువ్వు? అరేయ్‌ బచ్చా.. మా కుటుంబాన్ని అంతం చేసేవాడు ఇంకా పుట్టలేదు.. మీరు మమ్మల్ని ఏమీచేయలేరు.
-  ఎప్పుడూ వరదలే రాని సర్వేపల్లి కాలువపై గోడలు కట్టించి ప్రజాధనం కొట్టేసిన ముద్దపప్పు అనిల్‌.

Similar News