బ‌న‌క‌చ‌ర్ల - పోల‌వ‌రంపై రేవంత్ రెడ్డి నిజ‌మే చెప్పారు.. త‌ప్పేంటి..?

అప్పుడు కూడా ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌లేదు. ఇక్క‌డ కావాల్సింది.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య వివాద‌ర‌హిత విధానాల ను కొన‌సాగించ‌డం.. జ‌ల వివాదాల కార‌ణంగా.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య అగ్గి రాజుకోకుండా చూసుకోవ‌డ‌మే.;

Update: 2026-01-06 00:30 GMT

బ‌న‌క‌చ‌ర్ల- పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కొన్ని కీల‌క విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ ప్రాజెక్టును తాను చెప్పిన త‌ర్వాతే.. సీఎం చంద్ర‌బాబు వెన‌క్కి తీసుకున్నార‌ని.. అందుకే బ‌న‌క‌చ‌ర్ల విష‌యాన్ని ప‌క్క‌న పెట్టార‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో తామిద్దరం ఏకాంతంగా కూడా చ‌ర్చించుకున్నామ‌న్నారు. దీనివ‌ల్ల ఇరు రాష్ట్రాల జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు బాధ్య‌త వ‌హిస్తున్నామ‌ని కూడా ఉన్నారు.

అయితే.. ఇది మ‌హాప‌రాధం అయిన‌ట్టుగా కొన్ని వ‌ర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఏకాంత చ‌ర్చ‌ల నుంచి జ‌ల వివాదాల వ‌ర‌కు.. ఇరువురు ముఖ్య‌మంత్రులు మాట్లాడుకోవ‌డాన్ని కూడా త‌ప్పుబ‌ట్టారు. అయితే.. వాస్త‌వం.. ఏంటి? రేవంత్ రెడ్డి చెప్పింది త‌ప్పా? లేక‌.. ఏకాంతంగా మాట్లాడుకోవ‌డం అభ్యంత‌ర‌మా? అనేది ప్ర‌శ్న‌. గ‌తంలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు. అప్ప‌ట్లో ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌లేదు. ఇరువురు నేత‌లు.. ఒక‌రి ఇంటికి మ‌రొక‌రు వెళ్లారు.

అప్పుడు కూడా ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌లేదు. ఇక్క‌డ కావాల్సింది.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య వివాద‌ర‌హిత విధానాలను కొన‌సాగించ‌డం.. జ‌ల వివాదాల కార‌ణంగా.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య అగ్గి రాజుకోకుండా చూసుకోవ‌డ‌మే. ఇదే విష‌యంలో రేవంత్ రెడ్డి, చంద్ర‌బాబులు చొర‌వ తీసుకున్నారు. అస‌లు వాస్త‌వానికి బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.. జ‌గ‌నే. అప్ప‌ట్లో రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల పేరుతో ఈ ప‌థ‌కాన్ని ఆయ‌న ప్రారంభించాల‌ని చూశారు. కానీ, కేసీఆర్ వ‌ద్ద‌న్నారు. దీంతో అప్ప‌ట్లో ఆపేశారు.

ఆ త‌ర్వాత వ‌చ్చిన చంద్ర‌బాబు.. ఈ ప‌థ‌కానికి పేరు మార్చారు.. బ‌న‌క‌చ‌ర్ల‌-పోల‌వ‌రం పేరుతో నిర్మించాల ని మ‌రింత ఆయ‌క‌ట్టుకు నీరివ్వాల‌ని భావించారు. అయితే.. దీనిపైనా తెలంగాణ నుంచి అభ్యంత‌రం వ‌చ్చింది. దీంతో చంద్ర‌బాబు వెన‌క్కి త‌గ్గిన మాట వాస్త‌వ‌మే. అయితే.. పోల‌వ‌రం-మ‌ల్ల‌న్న సాగ‌ర్ వ‌ర‌కు నీటిని తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఇరు రాష్ట్రాల మ‌ధ్య వివాదాలు ఉండ‌కూడ‌ద‌ని.. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు భేటీ అయ్యారు. దీనిని కూడా త‌ప్పుగా చూపించ‌డం ఎందుక‌న్నది ప్ర‌శ్న‌. ఇరు రాష్ట్రాల‌మ‌ధ్య సుహృద్భావ వాతావ‌ర‌ణం ఉండ‌డాన్ని ఇష్టం లేక ఇలా చేస్తున్నార‌ని అనుకోవాలా..!.

Tags:    

Similar News