ఈ టి20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ త‌ర్వాత రిటైర్ అయ్యేది అత‌డే..?

టీమ్ఇండియా టి20 కెప్టెన్ గా సూర్య‌కుమార్ కు ప‌గ్గాలు ద‌క్క‌డం అనూహ్య‌మే. 2024లో రోహిత్ రిటైర్ అయ్యాక అంద‌రూ హార్దిక పాండ్యా కెప్టెన్ అవుతాడ‌ని అనుకున్నారు.;

Update: 2026-03-07 15:30 GMT

2024 టి20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ గెలిచాక టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాళ్లు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి, మేటి ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ఒకేసారి ఈ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశారు. త‌మ జీవితంలో కీల‌క విజ‌యం సాధించిన ఆనందంలో టి20ల‌కు వీడ్కోలు ప‌లికారు. మ‌రి మ‌ళ్లీ ఇప్పుడు టి20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ వ‌చ్చింది. ఈసారి టీమ్ ఇండియాలో ఎవ‌రు గుడ్ బై కొడ‌తారు? అనే ప్ర‌శ్న వ‌స్తోంది. దీనికి స‌మాధానం.. కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ అని కూడా అంటున్నారు. అయితే, ఇది క‌చ్చితం మాత్రం కాద‌నే వారూ ఉన్నారు. సూర్య వ‌య‌సు 35 ఏళ్లు. ఇంకా అత‌డు రెండు మూడేళ్లు ఈజీగా ఆడే చాన్స్ ఉంద‌ని పేర్కొంటున్నారు. ఇప్పుడే రిటైర్ కావ‌డం అంటే.. అత‌డికి వ‌న్డే చాన్స్ లు కూడా మూసుకుపోయిన‌ట్లేన‌ని చెబుతున్నారు. టెస్టుల్లో సూర్య‌ను సూప‌ర్ ఫామ్ లో ఉన్న‌ప్పుడే తీసుకోలేదు కాబ‌ట్టి ఆ ఫార్మాట్ లో అత‌డికి ఇప్పుడు అవ‌కాశాలు లేన‌ట్లే.

ఎందుకీ చ‌ర్చ‌?

టీమ్ఇండియా టి20 కెప్టెన్ గా సూర్య‌కుమార్ కు ప‌గ్గాలు ద‌క్క‌డం అనూహ్య‌మే. 2024లో రోహిత్ రిటైర్ అయ్యాక అంద‌రూ హార్దిక పాండ్యా కెప్టెన్ అవుతాడ‌ని అనుకున్నారు. అయితే, మ‌ధ్య‌లో కుర్రాడు శుబ్ మ‌న్ గిల్ కు సార‌థ్యం ఇచ్చారు. కానీ, జింబాబ్వే ప‌ర్య‌ట‌న ముగిశాక గిల్ ను త‌ప్పించి సూర్య‌ను కెప్టెన్ చేశారు. ఇప్పుడు టెస్టు, వ‌న్డే కెప్టెన్ అయిన గిల్ టి20 జ‌ట్టులో లేడు. కాబ‌ట్టి, సూర్య‌కు వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు. మ‌రోవైపు టి20ల్లో వైస్ కెప్టెన్ అంశం కుర్చీలాట‌గా మారింది. హార్దిక్, గిల్, అక్ష‌ర్ ప‌టేల్ మ‌ధ్య ఈ పోస్ట్ న‌డిచింది. ఇక సూర్య రిటైర్మెంట్ పై చ‌ర్చ ఏమిటి? అంటే అత‌డు 35 ఏళ్లు దాటుతున్నాడ‌ని, కొన్నాళ్లుగా ఫామ్ లో లేడ‌ని. జ‌ట్టు గెలుస్తున్నందున సూర్య‌పై విమ‌ర్శ‌లు రావ‌డం లేద‌ని, అయినా ఇలా ఎంత‌కాలం కొన‌సాగిస్తార‌ని విమ‌ర్శ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

గెలిస్తేనే ఉంటాడా?

ఫామ్ కాకుండా ఫిట్ నెస్ ప్ర‌కారం చూసినా సూర్య మ‌రో రెండేళ్లు టి20ల్లో కొన‌సాగుతాడు. అటు ఐపీఎల్ లోనూ అత‌డు నిరుడు బాగానే ఆడాడు. అంత‌ర్జాతీయ మ్యాచ్ ల‌లో మాత్ర‌మే పెద్ద స్కోర్లు చేయ‌డం లేదు. ఈ ప్ర‌పంచ క‌ప్ లో మోస్త‌రు ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చాడు. ఇవ‌న్నీ ఆలోచించాక‌నే సూర్య ఫైన‌ల్ త‌ర్వాత రిటైర్ అవుతాడు అనే అంచ‌నాకు వ‌స్తున్నారు. అలా కాక‌పోయినా, జ‌ట్టు గెలిస్తే అత‌డు కొన‌సాగే చాన్సుంది. ఓట‌మి ఎదురైతే మాత్రం ఊహాగానాలు నిజం అయినా ఆశ్చ‌ర్యం లేదు.

కొస‌మెరుపుః సూర్య సార‌థ్యంలో టీమ్ఇండియా టి20 ప్ర‌పంచ క‌ప్ గెలిస్తే రెండు రికార్డులు సొంతం చేసుకుంటుంది. 20 ఏళ్ల క‌ప్ చ‌రిత్ర‌లో టైటిల్ నిల‌బెట్టుకున్న తొలి డిఫెండింగ్ చాంపియ‌న్ అవుతుంది. సొంత‌గ‌డ్డ‌పై టైటిల్ సాధించిన జ‌ట్టుగానూ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధిస్తుంది. ఈ ఆదివారం ఏం జ‌రుగుతుందో చూద్దాం.

Tags:    

Similar News