ఏపీ 'అసెంబ్లీ'పై మౌనం... రీజన్ ఏంటి.. ?
కానీ.. మరోవైపు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ముగిసిపోయాయి కూడా.;
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సమయం మించిపోతోంది. ఈ నెల 25లోగా సభను కొలువు దీర్చాలి. వాస్తవానికి నవంబరు నుంచి జనవరి మధ్య కాలాన్ని శీతాకాల సమావేశాలకు కేటాయిస్తారు. ఈ నేపథ్యం లోనే డిసెంబరులోనే అసెంబ్లీ సమావేశాలకు అవకాశం ఉంటుందని.. ప్రభుత్వం నుంచి సమాచారం బయటకు వచ్చింది. దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా కసరత్తు చేశారు. కొన్నాళ్ల తర్వాత.. అంతా స్తబ్దుగా మారిపోయింది. ఎవరూ అసెంబ్లీ భేటీపై స్పందించలేదు.
కానీ.. మరోవైపు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ముగిసిపోయాయి కూడా. కానీ, ఏపీ విషయానికి వస్తే.. మాత్రం దీనిపై ఎక్కడా నాయకులు, స్పీకర్ సహా ఎవరూ స్పందించడం లేదు. దీంతో ఈ సమావేశాలు ఉంటాయా? ఉండవా? అనేది ప్రశ్న. దీనిపై అసెంబ్లీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. సమావేశాలు జరుగుతాయని అధికారులు చెబుతున్నా రు. అయితే.. ఏదో మూడు నాలుగు రోజులు నిర్వహించైనా ముగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
కానీ.. ఆదిశగా ఇప్పటి వరకు అడుగులు వేయడం లేదు. నిజానికి ఈ శీతాకాల సమావేశాల్లో.. పలు బిల్లులు ఆమోదించాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రధానంగా.. గ్రీన్ ఎనర్జీ, అమరావతిలో 44 వేల ఎకరాల భూము ల అదనపు సమీకరణ వంటి కీలక బిల్లులు ఉన్నాయి. వీటితోపాటు.. కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు, ఏపీ రాజధాని అమరావతికి శాశ్వత హోదా వంటి మరో అత్యంత ముఖ్యమైన బిల్లు కూడా ఉంది. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇక, ఇప్పటి వరకు అసెంబ్లీ ఊసు లేకపోవడం, మరోవైపు జనవరి 25లోగా శీతాకాల సమావేశాలు నిర్వహిం చాల్సి రావడంతో ఈ నెల 2వ వారంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. అప్పటికి సంక్రాంతి సెలవులు ఉంటాయి. దీంతో శీతాకాల సమావేశాలు నిర్వహించినా.. అవి కేవలం 6-8 రోజుల్లో ముగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం శీతాకాల సమావేశాల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ జరపకపోతే.. ఇదే ఫస్ట్ టైమ్ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.