పుట్టా విషయంలో టీడీపీ అంతర్మధనం...కిం కర్త్యవ్యం ?
ఇక బాబు ఈ నేపధ్యంలోనే హాట్ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. రాజకీయ నేపధ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారని టికెట్ ఇచ్చి అవకాశం కల్పించామని బాబు చెప్పారని అంటున్నారు.;
తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద రాజకీయ కుదుపుగా ఏలూరు ఎంపీ టీడీపీ యువ నేత పుట్టా మహేష్ వ్యవహారం తయారైంది అని అంటున్నారు. హైదరాబాద్ లో జరిగిన వీకెండ్ పార్టీకి పుట్టా అటెండ్ కావడం ఆ సమయంలో డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపణలు రావడం ఇవన్నీ కూడా టీడీపీకి అతి పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో పుట్టాకి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ ద్వారా షోకాజ్ నోటీసులు అయితే ఇప్పించారు. కానీ ఏమి చేయాలి అన్నది మాత్రం టీడీపీలో అంతర్మథనం సాగుతోంది అని అంటున్నారు.
పార్టీని ఇబ్బందులో నెడుతున్నారు:
పార్టీని ఇబ్బందులో నేతలు కొంతమంది నెడుతున్నారు అని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టా మహేష్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు అని ప్రచారం సాగుతోంది. బాబు తిరుపతి జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఇంచార్జి మంత్రితో మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు అని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా విషయం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక బాబు ఈ నేపధ్యంలోనే హాట్ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. రాజకీయ నేపధ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారని టికెట్ ఇచ్చి అవకాశం కల్పించామని బాబు చెప్పారని అంటున్నారు. కానీ అవకాశాన్ని ఈ విధంగా తీసుకోవడమేంటి అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు అంటున్నారు. అసలు అలాంటి పార్టీలకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని బాబు ప్రశ్నించారు అని అంటున్నారు. పార్టీని ఇబ్బందుల పాలు చేసే నేతలను మోయలా అని బాబు ప్రశ్నించారు అని అంటున్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపైన గతంలో కఠిన చర్యలు తీసుకున్నామని బాబు చెప్పుకొచ్చారు అంటున్నారు. క్రమశిక్షణతో పాటు విలువలు పాటించకుండా ఎవరు రాజకీయం చేసినా తప్పే అని బాబు అన్నట్లుగా చెబుతున్నారు.
యాక్షన్ ఉంటుందా :
బాబు చేసిన వ్యాఖ్యలు చూస్తూంటే పుట్టా మహేష్ ఎపిసోడ్ లో టీడీపీ కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే ఈ ఇష్యూని ఆధారంగా చేసుకుని వైసీపీ రచ్చ చేస్తోంది. నో యాక్షన్ అంటూ జగన్ తాజాగా చంద్రబాబు మీద సెటైర్లు వేశారు. దాంతో పాటు ప్రజలలో కూడా ఈ అంశాలు చర్చకు వస్తే అది ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. అందుకే ఈ ఎపిసోడ్ కి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు.
తర్జన భర్జన :
అయితే పుట్టా మహేష్ కేవలం ఎంపీ మాత్రమే కాదు, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత. బిగ్ బిజినెస్ షాట్. అలాగే సీనియర్ మోస్ట్ నేత యనమల రామక్రిష్ణుడికి అల్లుడు, ఇక మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్న పుట్టా సుధాకర్ ఆయనకు తండ్రి. ఇలా బలమైన రాజకీయ సామాజిక నేపధ్యంతో పాటు ఆర్థిక నేపధ్యం కూడా ఉంది. దాంతో షోకాజ్ నోటీసుతో సరిపెట్టి వదిలేస్తారా లేక ఇంకా కఠిన చర్యలకు వెళ్తారా అంటే దీని మీదనే తర్జన భర్జన పడుతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీకి ఇపుడు ఈ విషయాలు అన్నీ కొంత కలవరం కలిగిస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.