వైసీపీకి అమరావతి రిటర్న్ గిఫ్ట్ నా ?

మావిగాన్ అని వైసీపీ తాజాగా ఒక విధానం చెబుతోంది. అంతకు ముందు అధికారంలో ఉన్నపుడు మూడు రాజధానుల స్లోగన్ వినిపించింది.

Update: 2026-06-28 04:11 GMT

అధికారంలో ఉన్నపుడు అయిదేళ్ల పాటు అమరావతి రాజధాని విషయంలో పెద్దగా వైసీపీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ రాజధాని క్రెడిట్ చంద్రబాబుకు టీడీపీకి వెళ్ళిపోతుందని సంకుచితంగా ఆలోచించింది. అయితే ప్రజలు కాలం చరిత్రను తక్కువ అంచనా వేసి వైసీపీ ఈ రకంగా ఆలోచించింది అని అంటారు. ఎవరు మంచి చేసినా వారి ఖాతాలో ఆ వాటాను వేయడం చరిత్ర చేసే పని. ఇక ప్రభుత్వాలు వస్తూంటాయి. పోతూంటాయి. కానీ అభివృద్ధి నిరంతరం సాగాలి. పైపెచ్చు ఏపీ ప్రజలకు రాజధాని ఒక సెంటిమెంట్ గా ఉన్నది అని తెలిసి కూడా వైసీపీ తన విలువైన కాలంలో రాజకీయంగానే అమరావతిని చూసింది అని విమర్శలు ఉన్నాయి.

ఇబ్బందులు ఉన్నాయి :

అయితే అమరావతి రాజధానిలో రైతులకు ఇబ్బందులు లేవని కాదు, అలాగే ఇతర సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. కానీ వాటి మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా అని ప్రత్యర్ధులు వేసే ప్రశ్నలకు ఆ పార్టీ వద్ద జవాబు ఏమి ఉంది అన్నదే ప్రశ్న. మరో వైపు చూస్తే అమరావతిలో రెండో విడతలో భూములు ఇవ్వమని కొంతమంది రైతులు అంటున్నట్లుగా వార్తలు ఉన్నాయి. వారిలో కొందరు వైసీపీ ఆఫీసుకు వచ్చి అధినేత జగన్ కి వినతి చేసుకున్నారని కూడా అంటున్నారు. దాని మీద అమరావతి పరిరక్షణ కమిటీని వైసీపీ ఏర్పాటు చేసింది. ఆ బృందంలోని మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎమ్మెల్సీలు వీరంతా అమరావతికి వెళ్లాలని చేసిన ప్రయత్నమే తాజాగా వివాదానికి కారణం అయింది అని అంటున్నారు.

గో బ్యాక్ వైసీపీ అంటూ :

ఇదిలా ఉంటే అమరావతిలో భూములను పరిశీలించేందుకు వెళ్ళిన వైసీపీ నేతలను గో బ్యాక్ వైసీపీ అంటూ కూటమి సానుభూతిపరులు రైతులు అడ్డగించిన సందర్భాన్ని అంతా చూశారు. ఇక వైసీపీ వాహనాల మీద కూడా రాళ్ళ దాడి జరిగింది. దాంతో ఒక్కసారిగా తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇలా రెండు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట వంటివి జరగడం దాని మీద వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి విమర్శలు కూటమి ప్రభుత్వం మీద చేయడం వంటివి చకచకా జరిగిపోయాయి.

వైసీపీ స్టాండ్ ఏమిటి :

ఇదిలా ఉంటే అమరావతి రాజధాని విషయంలో తన స్టాండ్ ని మార్చుకుంటూ వస్తున్న వైసీపీ ఇంకా అదే వైఖరిని కొనసాగిస్తూ ఇపుడు అమరావతిలో పర్యటించే నైతిక హక్కు లేదని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీ రాజధాని మీద తన వైఖరి చెప్పాల్సిందే అంటున్నారు. మావిగాన్ అని వైసీపీ తాజాగా ఒక విధానం చెబుతోంది. అంతకు ముందు అధికారంలో ఉన్నపుడు మూడు రాజధానుల స్లోగన్ వినిపించింది. దాంతో ఇపుడు అమరావతిలో ఎందుకు అడుగు పెడుతున్నారని కూటమి నేతలు అంటున్నారు. ఒక విధంగా వైసీపీకి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అని అంటున్నారు.

రాజధాని విషయంలో స్పష్టత :

అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఇప్పటికైనా తన స్టాండ్ చెప్పిన మీదట అక్కడ పర్యటిస్తే వేరేగా ఉంటుందని అంటున్న వారూ ఉన్నారు. అయితే రాజధాని నిర్మాణాలలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ విమర్శిస్తోంది. అది డిఫరెంట్ స్టోరీ. వాటి మీద పోరాటం చేయవచ్చు. రైతులు భూములు ఇవ్వమని అంటే వారి పక్షాన కూడా నిలబడి సంఘీభావం చెప్పవచ్చు. కానీ అమరావతి రాజధాని విషయంలో స్పష్టత లేకుండా వైసీపీ ఈ రకంగా పర్యటనలు చేస్తే కూటమి నుంచి ఇదే రకమైన ప్రతిఘటన ఎదురవుతుందని అంటున్నారు. మరి అమరావతిలో వైసీపీ గో బ్యాక్ నినాదాలు ఏమి చెబుతున్నాయన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News