ఈటెలకు బంపర్ చాన్స్...బీజేపీ వ్యూహం అదే ?

ఇక తెలుగు రాష్ట్రాలలో చూస్తే బీజేపీ రాజకీయ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నది తెలంగాణా. అక్కడ కష్టపడితే బీజేపీ అధికారంలోకి వస్తుంది అని భావిస్తున్నారు.

Update: 2026-06-28 04:09 GMT

కేంద్ర మంత్రి వర్గం రేపో మాపో విస్తరిస్తారు అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఎపుడు అన్నది కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మాత్రమే తెలుసు. అలాగే ఎవరు ఇన్ ఎవరు అవుట్ అన్నది కూడా ఇప్పటికే పక్కాగా లెక్కలతో సహా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఈసారి పెద్ద ఎత్తున కొత్త ముఖాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అదే విధంగా పలువురికి ఉద్వాసన తప్పదని అంటున్నారు. అందులో మొదటి పేరు అయితే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని అని జోరుగా ప్రచారం ఢిల్లీ వర్గాలలో సాగుతోంది.

కొత్త రైల్వే మంత్రిగా :

ఇక కేంద్రంలో కొత్త రైల్వే మంత్రిగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ప్రస్తురం పనిచేస్తున్న మనోజ్ సిన్హా ను కొత్త రైల్వే మంత్రిని చేస్తారు అని ప్రచారంలో ఉంది. ఈ శాఖను ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ చూస్తున్నారు. ఆయన చేతిలోనే ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కూడా ఉంది. దాంతో కొత్త రైల్వే మంత్రి అవసరం పడుతోంది. పైగా మనోజ్ సిన్హా గతంలో మోడీ ప్రభుత్వంలోనే రైల్వే శాఖ సహాయమంత్రిగా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. యూపీకి చెందిన ఈయన కీలక నయకుడిగా సమర్ధుడిగా ఉన్నారు.

ఆర్ధిక మంత్రిగా ఆయన :

అదే సమయంలో కొత్త ఆర్ధిక మంత్రిగా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేరు వినిపిస్తోంది. ఆర్ధిక నిపుణుడిగా ఆయన ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచమే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది. మరింతగా పరిస్థితులు మారుతాయని ఆర్ధిక మాంద్యం ప్రభావం కూడా ఎక్కువ కాలం ఉంటుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆర్ధిక నిపుణుడికి ఈ శాఖను కట్టబెట్టడం ద్వారా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

తెలంగాణాలో ఎవరికి :

ఇక తెలుగు రాష్ట్రాలలో చూస్తే బీజేపీ రాజకీయ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నది తెలంగాణా. అక్కడ కష్టపడితే బీజేపీ అధికారంలోకి వస్తుంది అని భావిస్తున్నారు. దాంతో బీఆర్ఎస్ ని బలహీనపరచే ఎత్తుగడలు కూడా అమలు చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ పునాదుల నుంచి ఉంటూ వచ్చిన ఈటెల రాజేందర్ కి కేంద్ర మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయంగా మంచి వ్యూహకర్త కూడా. పైగా ఆయన్ని తీసుకోవడం ద్వారా బీజేపీ తెలంగాణాలో గులాబీ శిబిరం మీదకు గురి పెట్టాలని చూస్తోంది అని అంటున్నారు. ఈటెలకు అధికారం ఇస్తే ఆయన ఆ చొరవతో బీఆర్ఎస్ నుంచి మరింతమందిని బీజేపీ వైపు తిప్పుతారు అన్న లెక్కలు కూడా ఉన్నాయని అంటున్నారు.

వీరంతా ఆశావహులే :

అయితే తెలంగాణా బీజేపీలో అనేక మంది ఆశావహులు కనిపిస్తున్నారు. వారిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకరు. రెండు సార్లు ఒకే సీటు నుంచి గెలిచి వచ్చిన ఆయన మంది ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. దాంతో ఆయన పేరు కూడా నలుగుతోంది. అలాగే మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ కూడా కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారు. ప్రత్యేకించి ఆమె రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన వారు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ ని ఇరకాటంలో పెట్టాలీ అంటే కనుక లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న డీకే అరుణ బెస్ట్ చాయిస్ అని అంటున్నారు. ఇక బీసీ నేత రాజ్యసభ ఎంపీ అయిన లక్షణ్ కూడా రేసులో ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక తెలంగాణా నుంచి కొత్త ముఖాలు ఈసారి కేంద్ర కేబినెట్ లో కనిపించవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News