రాష్ట్ర జంతువుగా ఒంగోలు గిత్త

ఒంగోలు గిత్తలు అంటే రాజసానికి పౌరుషానికి ప్రతీకలుగా ఉంటాయి. ఒంగోలు గిత్త గురించి తెలుగు ప్రజలు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు కూడా అవసరం లేదు.

Update: 2026-06-28 04:15 GMT

ప్రతీ రాష్ట్రానికి రాష్ట్ర గీతం అలాగే సొంత చిహ్నాలు ఉంటాయి. అలాగే రాష్ట్ర జంతువుగా ఫలానా వాటిని గుర్తించి ప్రకటిస్తారు. విభజన ఏపీలో రాష్ట్ర జంతువు ఏది అన్నది ప్రత్యేకంగా లేదు. కానీ తాజాగా చూస్తే ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన ఒకటి కూటమి ముందుకు వచ్చింది. అదే ఒంగోలు గిత్తను రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని. ఆ ప్రతిపాదన కూడా ఏకంగా యువ మంత్రి నారా లోకేష్ వద్దకే వచ్చింది. కల్లూరు సురేష్ అనే వ్యక్తి మంత్రి లోకేష్ వద్దకు వినతి కోసం వచ్చినపుడు ఈ ప్రతిపాదన చేశారు. దానికి లోకేష్ కూడా సానుకూలంగా స్పందించడం విశేషం.

పౌరుషానికి ప్రతీక :

ఒంగోలు గిత్తలు అంటే రాజసానికి పౌరుషానికి ప్రతీకలుగా ఉంటాయి. ఒంగోలు గిత్త గురించి తెలుగు ప్రజలు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు కూడా అవసరం లేదు. చాలా సినిమా పాటలు కూడా ఒంగోలు గిత్త గురించి దాని పౌరుషం గురించి వచ్చి ఉన్నాయి. ఇక వ్యవసాయానికి పెద్ద దిక్కుగా ఒంగోలు గిత్తలు ఉంటూ వచ్చేవి. రైతులకు ఇవి ఎంతో ఆలంబనగా పొలాలలో ఉండేవి. అయితే ఇపుడు మారిన కాలంతో పాటు వాటి ప్రాధాన్యత తగ్గుతోంది. పైగా వాటి గురించి తెలుసుకోవడం ప్రాముఖ్యతను కూడా ఇవ్వడం తగ్గిపోతోంది. ఈ నేపధ్యంలో లోకేష్ ముందు ఈ ప్రతిపాదన వచ్చింది.

కూటమి ప్రభుత్వం వైఖరి :

ఇక తన వద్దకు వచ్చిన ఈ ప్రతిపాదన మీద మంత్రి నారా లోకేష్ అయితే స్పందించారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిజంగా కూటమి ప్రభుత్వం ఒంగోలు గిత్తను రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తే మంచి గుర్తింపు వాటితో పాటు రాష్ట్రానికీ వస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నాయి . వీటి శారీరక సామర్థ్యం చాలా ఎక్కువ. మామూలు ఎద్దులు వేరు ఇవి వేరు అని చెబుతారు. ఇక ఇవి ఏకంగా పదకొండు వందల కిలోలకు పైగా బరువు పెరిగి ఉంటాయి. వీటికి బలమైన కాళ్ళతో పాటు చిన్న కొమ్ములు అలాగే పెద్ద మూపురం ఉంటాయి. ఇక ఇవి ఎండాకాలం తో పాటు శీతాకాలాన్ని సైతం తట్టుకునే సత్తా కలిగి ఉంటాయి. ఇక మార్కెట్ లోనూ వీటి విలువ అధికంగా ఉంటుంది. మరి అలాంటి ఒంగోలు గిత్త సత్తా ఏమిటో చూడాల్సి ఉంది. అది రాష్ట్ర జంతువు అయితే అందరికీ ఆనందమే. ప్రత్యేకించి వ్యవసాయిక రాష్ట్రంగా ఉన్న ఆంధ్రాకి మరింత గుర్తింపు అని అంటున్నారు.

Tags:    

Similar News