'విశాఖ' నేతల యూటర్న్.. వైసీపీలో హాట్ డిస్కర్షన్ ..!
కానీ, పార్టీలో ఉన్న మరో చర్చ ప్రకారం.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను విశాఖ ఎంపీగా తీసుకురా వాలని భావిస్తున్నారు.;
బొత్స ఝాన్సీ.. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సత్యనారాయణ సతీమణి. గత 2024 ఎన్నికల్లో విశాఖ పట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి.. ఓడిపోయారు. గతంలో ఒకసారి విజయనగరం నుంచి విజ యం దక్కించుకున్న ఆమె.. గత ఎన్నికల్లోనూ అదే టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ, వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణను తప్పించి.. ఆ స్థానంలో ఆమెకు అవకాశం ఇచ్చింది. ఎంవీవీ కి అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించింది.
అయితే.. ఇద్దరు నాయకులు కూడా ఓడిపోయారు. ఇక, ఇప్పుడు ఎంవీవీ తిరిగి.. విశాఖకు రావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆయనకు మార్గం రెడీ అయింది. కానీ.. బొత్స ఝాన్సీ మాత్రం.. తాను వచ్చే ఎన్నికల్లో విజయనగరం నుంచి పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు. ఈ విషయమే ఇప్పుడు వైసీ పీలో హాట్ టాపిక్ అయింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఝాన్సీకి విశాఖ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. అందు కే.. ఇక్కడ ఇంచార్జ్‌ను కూడా నియమించలేదు.
కానీ, పార్టీలో ఉన్న మరో చర్చ ప్రకారం.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను విశాఖ ఎంపీగా తీసుకురా వాలని భావిస్తున్నారు. కాపు సామాజికవర్గం బలంగా ఉన్న నేపథ్యంలో ఆయనను ఇక్కడ నుంచి పోటీకి నిలబెట్టాలని చూస్తున్నారు. కానీ.. ఆయన మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. అంటే.. అటు ఎంవీవీ వచ్చేందుకు రెడీ అంటుంటే పార్టీ వద్దని చెబుతోంది. ఇక, ప్రస్తుతం బొత్స సత్య నారాయణ సతీమణి లేదా.. గుడివాడ అమర్నాథ్‌కు ఇవ్వాలని బావిస్తోంది.
కానీ.. ఈ ఇద్దరు నాయకులు కూడా.. రెడీగా లేరు. దీంతో బొత్స యూటర్న్ తీసుకుని.. విజయనగరంలో పా ర్టీ ఆదేశించకపోయినా.. ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది కార్తీక వనసమారాధన పేరుతో కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీంతో ఇప్పుడు విశాఖకు ఎవరిని పంపించాలన్న విషయంపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు.. విశాఖ విషయాన్ని బొత్స సత్యనారాయణకే వదిలేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఆయన మౌనంగా ఉన్నారు. మొత్తంగా విశాఖ విషయంలో వైసీపీ తర్జన భర్జన పడుతుండడం గమనార్హం.