కేటీఆర్ మారుతున్నారోచ్.. రాజాసింగ్ తో సరదా వ్యాఖ్యలు

అందుకు భిన్నంగా తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.;

Update: 2026-03-17 06:04 GMT

అధికారం చేతిలో ఉన్నప్పుడు ముఖ్యనేతల తీరు వేరుగా ఉంటుంది. మిగిలిన పార్టీ సభ్యుల్ని పట్టించుకోవటం.. వారితో ముచ్చట్లులాంటివి పెద్దగా కనిపించవు. అదే అధికారం దూరమైనప్పుడు మాత్రం అందుకు భిన్నమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. తెలంగాణ ఏర్పాటుతోనే అధికారాన్ని సొంతం చేసుకొని.. పదేళ్లు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన బీఆర్ఎస్ ముఖ్యనేతలైన కేసీఆర్.. కేటీఆర్ లు ఎప్పుడైనా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ లాబీల్లో సరదాగా ఆటపట్టించటం.. మాట్లాడటం లాంటివి చూసింది లేదు.

అందుకు భిన్నంగా తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటి రోజు సమావేశాల అనంతరం రాజాసింగ్ లాబీల్లో బీజేపీ కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కేటీఆర్ ఆయన్ను గమనించి ఆగారు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి బీజేఎల్పీలోకి ఎలా వెళతారు? బయటకు రా.. అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

దీనికి స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలుగజేసుకొని.. మీరు కూడా లోపలికి రండి అంటూ కేటీఆర్ తో వ్యాఖ్యానించటంతో.. నేను బీజేపీ ఆఫీసులోకి వస్తే మీడియా వాళ్లు ఏదో రాస్తారంటూ నవ్వుతూ కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా చూసినప్పుడు గతంలోని కేటీఆర్ తీరునకు ఇప్పటికి వచ్చిన తేడా మీద ఆసక్తికర చర్చ జరిగింది. ఏమైనా.. నేతల తీరును పవర్ ఎంత ప్రభావితం చేస్తుందన్న దానికి ఈ ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News