సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో యూఎస్ నుంచి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు తీర్పును సవాల్ చేశాడు. దీంతో ఏళ్లకు ఏళ్లుగా సుప్రీంలో ఈ కేసు విచారణ సాగుతోంది.;
దాదాపు 24 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఉదంతానికి సంబంధించి ఈ మధ్యనే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. నాలుగు వారాల్లో నాంపల్లి కోర్టులో లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో.. అమెరికా నుంచి నాంపల్లి కోర్టు ఎదుట లొంగి పోయిన సిద్దార్జ్ రెడ్డి తీరు ఇప్పుడు మళ్లీ.. పాత గురుతుల్లోకి వెళ్లిపోయింది. ప్రేమికులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్ వైనం అప్పటి ఉమ్మడి ఏపీలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక సినీ నటి తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించి.. అందులో ఆమె కన్నుమూస్తే.. ఆమె ప్రియుడు మాత్రం బతికిపోయాడు.
పరిమిత మీడియా మాత్రమే అందుబాటులో ఉన్న వేళ.. ప్రతి ఒక్కరి నోట ఈ కేసు గురించిన విషయాలే మాట్లాడుకునే పరిస్థితి. అప్పట్లో తెలుగు సినీ నటి ప్రత్యూష.. సిద్ధార్థ్ రెడ్డిలు ఇద్దరు ప్రేమించుకోవటం.. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగటం.. ఆ తర్వాత ఇద్దరినీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో ప్రత్యూష ప్రాణాలు కోల్పోతే.. సిద్ధార్థ్ రెడ్డి మాత్రం చికిత్స నిమిత్తంగా కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదైంది. అంతేకాదు..నటి ప్రత్యూష మరణంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమై.. పలు షాకింగ్ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
వీటన్నింటి మధ్య ప్రత్యూష కుటుంబ సభ్యులు.. మరి ముఖ్యంగా ఆమె తల్లి ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని.. హత్య జరిగి ఉండొచ్చంటూ ఆరోపించారు. అక్కడితో ఆగని ఆమె అలుపెరగని న్యాయ పోరాటాన్నిప్రారంభించారు. కేసును కోర్టులో కంటిన్యూ చేస్తూ.. నిజం బయటకు రావాలంటూ పట్టుదలతో ప్రయత్నంచారు. పోలీసుల దుర్యాప్తు అనంతరం సిద్ధార్థ్ రెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా అభియోగాలు నమోదు చేయటంతో.. కేసు ట్రయల్ కోర్టు విచారణకు వచ్చింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సిద్ధార్థ్ రెడ్డిపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి. ట్రయల్ కోర్టు విచారణలో సిద్దార్థ్ రెడ్డిని కోషిగా నమోదైతే.. ట్రయల్ కోర్టు విచారణలోఆయన్ను దోషిగా నిర్ధారిస్తూ.. ఐదేళ్లు జైలు విధించారు.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు తీర్పును సవాల్ చేశాడు. దీంతో ఏళ్లకు ఏళ్లుగా సుప్రీంలో ఈ కేసు విచారణ సాగుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు సైతం తన తీర్పులో హైకోర్టు తీర్పును సమర్థించటంతో పాటు..సిద్ధార్థ్ రెడ్డిని తమ తీర్పు వెలువడిన నెలలోపు లొంగిపోవాలని ఆదేశించింది. తుది తీర్పులో భాగంగా అతడికి స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన అతను నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.
దాదాపు పాతికేళ్లు (సరిగ్గా చెప్పాలంటే 24 ఏళ్ల) సాగిన ఈ కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ కేసులో న్యాయపరమైన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గతంలో ఎంత కాలమైతే జైలు శిక్ష అనుభించారో.. దాన్ని మినహాయిస్తూ.. తాజాగా సుప్రీంకోర్టు పేర్కొన్నట్లుగా నాటి హైకోర్టు విధించిన ఐదేళ్ల జైలుశిక్ష లో నుంచి మినహాయించి.. మిగిలిన కాలం జైలు జీవితాన్ని గడపాల్సి ఉంటుందని చెబుతున్నారు.