ఫిఫా వరల్డ్ కప్ వేళ మెస్సీ హత్యకు కుట్ర.. సంచలన నిజాలు వెలుగులోకి..

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసిస్తున్న అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని లక్ష్యంగా చేసుకుని భారీ ఉగ్రదాడికి కుట్ర జరిగినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2026-08-08 07:07 GMT

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసిస్తున్న అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని లక్ష్యంగా చేసుకుని భారీ ఉగ్రదాడికి కుట్ర జరిగినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిఫా ప్రపంచకప్ నేపథ్యంలో లీకైన ఓ పోలీసు డోసియర్ ఆధారంగా అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించడంతో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మెస్సీతో పాటు ఇతర ప్రముఖ ఆటగాళ్లు, రిఫరీలు, భద్రతా సిబ్బంది కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా హెచ్చరికలు.. బాంబు బెదిరింపులు

స్పానిష్ మీడియాలో వెలువడిన నివేదికల ప్రకారం.. మెస్సీపై దాడి చేసేందుకు ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రమైన బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘‘నా శరీరానికి నాలుగు బాంబులు కట్టుకుని అట్లాంటా స్టేడియానికి నడుచుకుంటూ వెళ్తా.. మెస్సీని పేల్చేస్తా’’ అంటూ అతడు పోస్ట్ చేసినట్లు పోలీసు రికార్డుల్లో నమోదైంది. ఈ పోస్ట్‌ను ఆ తర్వాత తొలగించినప్పటికీ భద్రతా సంస్థలు దానిని అత్యంత తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించాయి.

మరొక వైపు, ఒక అనుమానితుడు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఇంట్లోనే తయారు చేసిన పేలుడు పదార్థాలు , ఏఆర్-15 రకం తుపాకీతో స్టేడియానికి వచ్చి విధ్వంసం సృష్టిస్తానని సదరు వ్యక్తి హెచ్చరించినట్లు పోలీసు డోసియర్ ఆధారంగా తెలుస్తోంది.

రొనాల్డోకూ రక్షణ ముప్పు

కేవలం మెస్సీ మాత్రమే కాకుండా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కూడా భద్రతాపరమైన ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. రొనాల్డో బస చేసే హోటల్ , పరిసర ప్రాంతాల వివరాలను సేకరించేందుకు ఓ అనుమానిత వ్యక్తి యత్నించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే ఫ్రెంచ్ రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్‌కు వేలాది సంఖ్యలో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు సమాచారం.

రంగంలోకి ఎఫ్‌బీఐ

ఈ భద్రతా ముప్పుపై అమెరికా భద్రతా సంస్థలు తక్షణమే స్పందించాయి. ఎఫ్‌బీఐ, అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా ఈ బెదిరింపులపై విశ్లేషణ జరిపి, క్రీడాకారుల బస ప్రాంతాలు, స్టేడియంల వద్ద అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశాయి.

భద్రతా సంస్థలు అప్రమత్తమై దాడి కుట్రలను ముందుగానే అడ్డుకున్నప్పటికీ లీకైన పోలీసు రికార్డులపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈ కుట్ర వెనుక ఎంతటి పక్కా ప్రణాళిక ఉందనేది పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరమే తేలనుంది.

Tags:    

Similar News