• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  ఏపీలో రాజకీయ శూన్యత...

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

| ఏపీలో రాజకీయ శూన్యత ఉందన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. టీడీపీ, వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉండగా, జనసేన కూడా గణనీయమైన మద్దతు కలిగి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీకి ఎంతవరకు ఆదరణ లభిస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

By - Satya P
Update: 2026-11-11 06:43 GMT

రాజకీయాల్లో శూన్యత ఎప్పుడూ ఉండదు, సముద్రం ఇంకిపోదు, మహానదులు ఎండిపోవు అన్నట్లుగా రాజకీయాల్లో ఎపుడూ ఖాళీ అన్నది అసలు ఉండదు, అయితే పాత వాటిని తోసుకుంటూ కొత్తగా వచ్చే పార్టీలు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చూసే క్రమంలో అవి తగ్గిపోవడమో వెనకబడడమో బలహీన పడడమో జరుగుతుంది. మరి అంతలా బలంగా దూసుకుని వచ్చే పార్టీలు వస్తేనే తప్ప పాత వాటికి కనుమరుగు ఉండదు. కానీ ఏపీలో రాజకీయ శూన్యత ఉందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. అందుకే కొత్త పార్టీ పెట్టాను అని ఆయన చెబుతున్నారు. ఇది నిజమేనా అంటే దానికి సంబంధించిన లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది.

బలమైన ఓటు షేర్ :

ఏపీలో రెండు ప్రధాన పార్టీలుగా టీడీపీ వైసీపీ ఉన్న సంగతి విధితమే. ఈ రెండు పార్టీలకు చెరి నలభై శాతం ఓటు షేర్ ఉంది అని అంటారు. అంటే 80 శాతం రాజకీయ మైదానాన్ని ఈ పార్టీలే ఆక్రమించాయన్న మాట. ఇక ఆ మిగిలిన ఇరవై శాతంలో జనసేన పది శాతం అయినా ఓటు షేర్ తో ఉందని అంటారు. బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలు తదితర పార్టీలు అయిదు శాతం ఓటు షేర్ తీసుకున్న ఒక్క అయిదారు శాతం మాత్రమే ఖాళీ ఉంది. మరి దానినే రాజకీయ శూన్యతగా భావించాలా అన్నది ఒక చర్చగా ముందుకు వస్తోంది.

విభజించబడ్డారు :

ఇక ఏపీలో పార్టీలకు కార్యకర్తలే కాదు జనాలు కూడా విభజించబడ్డారు అని గత కొన్ని ఎన్నికల నుంచి సాగుతున్న ఓటింగ్ విధానం కానీ పరిణామాలు కానీ చెబుతున్నాయి. ఒక విధంగా తమిళనాడు తరహాలో అన్న మాట. అక్కడ డీఎంకే అన్నా డీఎంకే ఓటర్లు సెపరేట్ గా ఉంటారు. వారు ఆ పార్టీలకే ఓటు వేస్తారు. అయితే సునామీగా దూసుకొచ్చిన టీవీకే సంప్రదాయ పార్టీల ఓట్లను తాను తీసుకోవడంతో బలమైన ఆల్టర్నేషన్ గా మారింది. ముందే చెప్పినట్లు కొత్త పార్టీ తుఫాన్ గా వస్తేనే తప్ప వట వృక్షాలు గా మారి వేళ్ళూనుకుపోయిన పాత పార్టీలు కొట్టుకుపోయే పరిస్థితి ఉండదు, మరి ఆ స్థాయిలో కొత్త పార్టీగా విజయసాయి రెడ్డి పెట్టిన పీఆర్పీ ఉందా అన్నదే చర్చగా ఉంది.

ఏపీకి అవసరమా :

ఇక దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రాజకీయ ప్రయోగాలు అంతగా విజయవంతం కావడం లేదు. దానికి కారణం జనంలో ఉన్న ఒక రకమైన భావన. సర్దుకుపోయే తత్వం, కొత్త మీద కొంత కలవరం, పాతతోనే పోతే ఉండే సౌఖ్యం. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. మరీ బాగా లేదు, తెగించాల్సిందే అన్న నాడే జనాలు ఆల్టర్నేషన్ వైపు చూసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే దేశంలో కాంగ్రెస్ ఆరు దశాబ్దాల పాటు ఏలింది. ఉమ్మడి ఏపీలో కూడా మూడున్నర దశాబ్దాల పాటు పాలించింది. ఇక విభజన ఏపీ విషయానికి వస్తే జనం మూడ్ కొత్త పార్టీలు కొత్త రాజకీయం వైపు ఉందా అన్నది కీలకమైన ప్రశ్న. ఎందుకంటే విభజనతో ఏపీ దారుణంగా నష్టపోయింది అన్నది అంతా గుర్తు పెట్టుకోవాల్సి ఉంది.

మరో అర్ధ శతాబ్దం :

ఏపీ ఒక రూపునకు రావాలీ అంటే మరో అర్ధ శతాబ్దం పడుతుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. అలాంటి చోట తడవకో పార్టీని తెచ్చి నూతన ప్రయోగాలు జనాలు చేస్తారా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి చెబుతున్నది చూస్తే మరో మూడు ఎన్నికల వరకూ తామే గెలిస్తేనే ఏపీ గాడిలో పడుతుంది అని. మరో వైపు వైసీపీ చూస్తే అధికారం కోసం కాచుకుని ఉంది. ఈ రెండు పార్టీలు అధికారం అందుకుని అనుభవం గడించి ఉన్నాయి. అలాంటి చోట కొత్త ప్రయోగంగా వచ్చిన పార్టీలు ఏ మేరకు సక్సెస్ అవుతాయన్నది చూడాల్సి ఉంది. ఇక విజయసాయిరెడ్డి చెబుతున్నట్లుగా రెండు కులాలు రెండు కుటుంబాలు అన్నది కూడా బలమైన రాజకీయానికి దారి తీసినవి అన్నది చూడాలి. కులాల సమీకరణతో సాగే ఏపీ రాజకీయాలలో కుటుంబాలకు ఉన్న రాజకీయ ఇమేజ్ తో ఓటు బ్యాంకు స్థిరీకరించుకున్న క్రమంలో రెండు పార్టీలను పక్కన పెట్టాలీ అంటే జనాలు ఎలా స్పందిస్తారు అన్నది ఆలోచించాలి. ఇక రాజకీయ శూన్యత ఏపీలో ఉందా అంటే లేదు అన్నదే జవాబుగా కనిపిస్తోంది.

Tags:    
  • vijaysaireddy 
  • andhrapradesh 
  • appolitics 
  • tdp 
  • ysrcp 
  • janasena 
  • politicalvacuum 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

Copyright @2026

Powered by Blink CMS