• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Chittoor >  వైసీపీలో రోజాకు సెగ...

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

| చిత్తూరు జిల్లాపై పట్టు పెంచుకునేందుకు మాజీ మంత్రి రోజా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం వైసీపీలో చర్చకు దారితీసింది. అయితే ఆమెకు పార్టీలోని కొందరు నేతల నుంచే వ్యతిరేకత ఎదురవుతోందని, అంతర్గతంగా అడ్డంకులు సృష్టిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనూ సొంత నేతలు తనను అణచివేస్తున్నారని రోజా ఆరోపించడం గమనార్హం.

By - Garuda Media
Update: 2026-11-19 12:30 GMT

ముందు లీడ‌ర్‌గా.. త‌ర్వాత స్టేట్ లీడ‌ర్‌గా ఎద‌గాల‌న్న ఆశ ఖ‌చ్చితంగా అంద‌రికీ ఉంటుంది. ఈ విష‌యంలో మంత్రి ప‌ద‌వులు కీల‌కంగా మార‌తాయి. ఇలా ఆలోచించిన మాజీ మంత్రి వైసీపీ నాయ‌కురాలు రోజా కూడా మంత్రి అయ్యారు. రాష్ట్ర‌ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో కూట‌మి హ‌వా నేప‌థ్యంలో ఆమె ప‌రాజ‌యం పాలయ్యారు. మ‌ళ్లీ రియాల్టీ షోలు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అడ‌పా ద‌డ‌పా రాజ‌కీయాలు చేస్తూ.. వ‌చ్చిన ప్ర‌తిసారీ వేడెక్కిస్తున్నారు.

నగరిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మాజీ మంత్రి ఆర్‌కే రోజా వ్యవహారం, అలాగే ఆమె సొంత పార్టీ కార్యకర్త పై ప్రవర్తించిన తీరుపై ఇటీవల తీవ్ర వివాదం చెలరేగింది. చిత్తూరు జిల్లా విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి గెలిచినా, అధికారులు ఉద్దేశపూర్వకంగా టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని ఆరోపిస్తూ రోజా కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళన సమయంలో కారులో కూర్చు ని నినాదాలు చేశారు. ఈ వ్య‌వ‌హారం పెనుదుమారం రేపింది.

ఆ స‌మ‌యంలో రోజా క‌న్నీరు కూడా పెట్టుకున్నారు. ఈ స‌మ‌యంలో రోజాకు వెనుక సీట్లో ఉన్న వ్యక్తిగత సిబ్బంది నీళ్ల బాటిల్ అందిం చారు. ఆ నీళ్లు పొరపాటున తనపై పడటంతో సహనం కోల్పోయిన రోజా, ఆ వాటర్ బాటిల్‌తోనే అతడిపై దాడికి ప్రయత్నించడం, కొట్టడం వీడియోల్లో వైరల్ అయింది. అనంత‌రం పోలీసులు ఎస్కార్టుగా ఉండి.. ఆమెను ఇంటి వ‌ద్ద దిగ‌బెట్టి వ‌చ్చారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. వైసీపీలోనే ఓ వ‌ర్గం నాయ‌కులు రోజాను వ్య‌తిరేకిస్తున్న విష‌యం తాజాగ వెలుగు చూసింది. పైగా.. వారంతా అంత‌ర్గ‌తంగా ఆమెకు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పార‌ని అంటున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. రోజా.. చిత్తూరు జిల్లాపైప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో కీల‌క నేత‌గా ఉన్న కొంద‌రు ఓ నాయ‌కుడు మైన‌స్ కావ‌డం, వారి చుట్టూ కేసుల ముసురుకున్న క్ర‌మంలో రోజా ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయాల‌ని భావిస్తున్నారని పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమెత‌న హ‌వాను పెంచు కునే ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, పార్టీలో ఆమెను వ్య‌తిరేకించే వ‌ర్గాలు పెరుగుతున్నాయి. దీంతో రోజా హ‌వాకు వ్య‌తిరేకంగా పార్టీలోనే కొంద‌రు కీల‌క నేత‌లు అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని.. త‌న‌ను రాజ‌కీయంగా సొంత నేత‌లే ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని రోజా అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వ్యాఖ్యానించిన‌ట్టు గుప్పుమంది.

కాగా.. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా.. రోజా ఇలానే త‌న‌ను అణిచి వేస్తున్నారంటూ సొంత నేత‌ల పై విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్పుడు ఆమె వ్యూహం చూస్తే.. ఏకంగా జిల్లాపై ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తు న్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

Tags:    
  • rkroja 
  • ysrcp 
  • chittoorpolitics 
  • andhrapradeshpolitics 

Similar News

‘‘అయ్యా మీ రూ.1000 తీసుకోండి’’.. బ్యాలెట్ బాక్స్‌లో నోట్లు, లేఖ వేసిన ఓటరు!

2026-11-17 10:02 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

అప్పుడు వైనాట్ కుప్పం...ఇపుడు వై నాట్ పులివెందుల !

2026-10-28 06:42 GMT

న‌గ‌రిలో రోజా రాజ‌కీయం చేసేనా .. ?

2026-10-27 23:30 GMT

టీటీడీ శ్రీ మహాలక్ష్మి దీప పూజ.. కుప్పంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహణ

2026-10-20 12:01 GMT

నగరి టీడీపీ చేతుల్లోకి.. ఫైట్ కు రెడీ అయిన రోజా.. ఏం జరుగనుంది?

2026-10-19 15:44 GMT

చెవిరెడ్డి ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే.. !

2026-09-19 18:30 GMT

భాను వ‌ర్సెస్ రోజా.. న‌గ‌రి రాజ‌కీయాలు మారుతున్నాయ్‌..!

2026-09-19 11:24 GMT

త‌ప్పుకొన్న చోట త‌లెత్తుకుని.. పుంగ‌నూరు టీడీపీ ప‌వ‌ర్‌ఫుల్‌..?

2026-09-14 08:30 GMT

భ‌ర‌త్ ఆవేశం.. వైసీపీ ముందే చేతులు ఎత్తేస్తోందా..?

2026-09-12 11:30 GMT

తమిళనాడు అసెంబ్లీని కుదిపేసిన ‘కుప్పం ఎయిర్ పోర్టు’ - ఏం జరిగిందంటే...?

2026-08-13 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS