• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Andhra Pradesh >  Chittoor >  ఓటువేయలేదుగా.. నా డబ్బులు...

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

| చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ 32వ వార్డు నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రెడ్డి గారు ఈ వినూత్న ఘట్టానికి కథానాయకుడు.

By - A.N.Kumar
Update: 2026-11-04 11:17 GMT

ఎన్నికలు అంటేనే మహా ప్రహాసనం.. అందులో గెలుపోటములు సహజం.. ప్రచారం చేయడం.. హామీలివ్వడం.. మైకుల మోతలు.. అబ్బో అదో పే..ద్ద ప్రాసెస్.. ఇక పోలింగ్ ముందు రాత్రి జరిగే ‘లక్ష్మీ కటాక్షం’ గారడీలు ఇంకో ఎత్తు. సాధారణంగా ఓట్లు వేయించుకోవడానికి నాయకులు ప్రజల కాళ్ల వేళ్లా పడి డబ్బులు పంచుతుంటారు. కానీ ఏపీలోని ఓ నేత మాత్రం రివర్స్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. గెలుపు కోసం ఉన్నదంతా ఊడ్చి పెట్టిన వారు ఓడిపోతే పరిస్థితి ఏంటి? తట్టుకోలేక ఇప్పుడు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రివర్స్ వసూళ్లు మొదలుపెట్టారు.. ‘ఓడిపోయాను సామీ.. ఇచ్చేసిన నా డబ్బులు నాకిచ్చేయండి’ అంటూ ఓటర్ల ఇళ్ల ముందు రివర్స్ వసూళ్లు మొదలుపెట్టాడు.ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది.

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ 32వ వార్డు నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రెడ్డి గారు ఈ వినూత్న ఘట్టానికి కథానాయకుడు. ఎన్నికల ప్రచారంలో మనోడు ఏకంగా రూ.10 లక్షలు అప్పుు తీసుకువచ్చి ఒక్కో ఓటుకు రూపాయి తక్కువ కాకుండా రూ.1000 చొప్పున బ్రహ్మాండంగా పంచేశాడు. ఇక ధీమాగా కొండంత ఆశతో గెలుస్తానని ఆశల పల్లకీలో ఊరేగాడు. తీరా కౌంటింగ్ రోజు ట్రైన్ రివర్స్ అయ్యింది. బ్యాలెట్లు తెరిచిచూస్తే ఓటర్లు ఈయన గారికి గట్టి షాక్ ఇచ్చారు.

డబ్బులు తీసుకున్న వారిలో ఏకంగా 400 మంది తనకు ఓటు వేయలేదని తేలడంతో ప్రసాద్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిపోయింది పాపం.. సాధారణ నాయకులైతే అయ్యో మన దురదృష్టం అని మూలన కూర్చొని ఏడుస్తారు. కానీ మన రెడ్డిగారు సాధారణ నాయకుడు కాదాయే.. వెంటనే ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ‘నేను అప్పు తెచ్చి మీ మొహాన వెయ్యి రూపాయలు పెట్టా.. కానీ మీరు నాకు ఓటు వేయకుండా నన్ను ముంచేశారు. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయండి.. లేకపోతే రోజూ మీ ఇళ్ల ముందు వచ్చి ధర్నాకు కూర్చుంటా’ అంటూ ఓటర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో వార్డులోని జనాలకు ఇప్పుడు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.. ఓటుకు డబ్బులు పంచడం నేరం అని విన్నాం కానీ.. ఆ డబ్బులకు కూడా రీఫండ్ పాలసీ ఉంటుందని ఇప్పుడే చూస్తున్నామని ఊర్లో జనాలు సెటైర్లు వేస్తున్నారు..

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి షాపింగ్ యాప్స్ లో ఉండే 10రోజుల రిటర్న్ పాలసీని ఎన్నికల రాజకీయంలోకి తీసుకొచ్చిన ప్రసాద్ రెడ్డి క్రియేటివిటీకి మనమంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..



ఓటమితో షాక్.. ఓటుకు ఇచ్చిన డబ్బులు వెనక్కివ్వాలంటూ అభ్యర్థి డిమాండ్ ఎన్నికల్లో ఓటమి పాలైన పలమనేరు 32వ వార్డు వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రెడ్డి వినూత్నంగా స్పందించారు. అప్పు చేసి ఓటుకు ₹1,000 చొప్పున పంపిణీ చేశానని, 400 మంది ఓటు వేయలేదని ఆరోపించారు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఇళ్ల వద్దకు వచ్చి కూర్చుంటానని వీడియోలో హెచ్చరించారు. #Palamaneru #YCP #MunicipalElections #TeluguNews #Tupaki Follow👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 4, 2026


Tags:    
  • andhrapradesh 
  • palamaner 
  • ysrcp 
  • localelections 
  • electionnews 

Similar News

అప్పుడు వైనాట్ కుప్పం...ఇపుడు వై నాట్ పులివెందుల !

2026-10-28 06:42 GMT

న‌గ‌రిలో రోజా రాజ‌కీయం చేసేనా .. ?

2026-10-27 23:30 GMT

టీటీడీ శ్రీ మహాలక్ష్మి దీప పూజ.. కుప్పంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహణ

2026-10-20 12:01 GMT

నగరి టీడీపీ చేతుల్లోకి.. ఫైట్ కు రెడీ అయిన రోజా.. ఏం జరుగనుంది?

2026-10-19 15:44 GMT

చెవిరెడ్డి ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే.. !

2026-09-19 18:30 GMT

భాను వ‌ర్సెస్ రోజా.. న‌గ‌రి రాజ‌కీయాలు మారుతున్నాయ్‌..!

2026-09-19 11:24 GMT

త‌ప్పుకొన్న చోట త‌లెత్తుకుని.. పుంగ‌నూరు టీడీపీ ప‌వ‌ర్‌ఫుల్‌..?

2026-09-14 08:30 GMT

భ‌ర‌త్ ఆవేశం.. వైసీపీ ముందే చేతులు ఎత్తేస్తోందా..?

2026-09-12 11:30 GMT

తమిళనాడు అసెంబ్లీని కుదిపేసిన ‘కుప్పం ఎయిర్ పోర్టు’ - ఏం జరిగిందంటే...?

2026-08-13 10:30 GMT

ఫేస్ బుక్ ఫ్రెండ్ తో రిలేషన్.. నిద్రమాత్రలిచ్చి భర్తను లేపేసింది!

2026-08-13 09:30 GMT

పొలిటిక‌ల్ గతాలు.. మంచివేనా.. ?

2026-07-01 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS