• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Chittoor >  ‘‘అయ్యా మీ రూ.1000...

‘‘అయ్యా మీ రూ.1000 తీసుకోండి’’.. బ్యాలెట్ బాక్స్‌లో నోట్లు, లేఖ వేసిన ఓటరు!

| చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్‌లోని మురం గ్రామానికి చెందిన ఓ ఓటరు తనకు అభ్యర్థులు ఇచ్చిన రూ.1000ను తిరిగి బ్యాలెట్ బాక్సులో వేశాడు. ‘‘డబ్బు తీసుకుని ఓటు వేయను.. మీరే తీసుకోండి’’ అంటూ లేఖ కూడా పెట్టాడు. ఈ ఘటనపై కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందనలు తెలపడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By - Tupaki Political Desk
Update: 2026-11-17 10:02 GMT

నోటు ఇవ్వనిదే ఓటు వేయరన్న భావన ఎక్కువగా ఉన్న సమయంలో ఒక అనూహ్య సంఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చనీయాంశంగా మారింది. ‘‘అయ్యా మీరు ఇచ్చిన వెయ్యి మీరే తీసుకుండి. డబ్బులు తీసుకుని ఓటువేసే వారం కాదు సుమీ’’ అంటూ ఒక ఓటరు రాసిన లేఖ వైరల్ అవుతోంది. తన లేఖతోపాటు రెండు రూ.500 నోట్లను కలిపి బ్యాలెట్ బాక్సులో వేసిన సదరు ఓటరు ఆదర్శనీయుడు అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు.

రాష్ట్రంలో ఈ నెల 5న స్థానిక ఎన్నికలు జరగ్గా, 7న ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయితే కౌంటింగ్ ముగిసిన తొమ్మిది రోజుల తర్వాత ఈ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ పరిధిలోని మురం గ్రామంలో ఒక ఓటరు తన హక్కును వినియోగించుకుంటూనే, అభ్యర్థులు తనకు ఇచ్చిన వెయ్యి రూపాయలను రెండు ఐదు వందల నోట్ల రూపంలో, ఒక చీటితో సహా బ్యాలెట్ బాక్స్‌లో వేశాడు.

ఆ ఓటరు రాసిన లేఖలో “అయ్యా.. మీరిచ్చిన డబ్బు రూ.1000 మీరే తీసుకోండి. నేను డబ్బు తీసుకుని ఓటు వేయను. ధన్యవాదాలు..” అని రాసి ఉంది. పలమనేరు డిగ్రీ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ విషయాన్ని సిబ్బంది గుర్తించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల తొలుత గోప్యంగా ఉంచారు. అయితే ఈ వినూత్న సంఘటనకు సంబంధించిన సమాచారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్‌కు చేరింది.

ఓటరు చైతన్యంపై ఆకర్షితులైన కలెక్టర్ సుమిత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. డబ్బులు తీసుకుని ఓటేస్తే భవిష్యత్తులో ఐదేళ్లపాటు ప్రశ్నించే హక్కును కోల్పోతామని ఈ ఓటరు నిరూపించాడని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుత కాలంలో ఎన్నికల్లో డబ్బు లేకపోతే నెగ్గుకు రావడం కష్టమనే అభిప్రాయం బలంగా ఉంది. పల్లెల్లో చాలా మంది ఓటర్లు నోటు తీసుకోకుండా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. డబ్బులు తీసుకోకపోతే ఆ పార్టీ వారి వద్ద చెడ్డవాళ్లమౌతామనే భావన కొందరు, అభ్యర్థి ఇచ్చిన డబ్బులను మధ్యలో ఉండే వ్యక్తులు ఎగనామం పెడతారనే ఆలోచనతో మరికొందరు పోలింగ్ సమయంలో డబ్బు తీసుకుంటున్నారు. మరికొందరైతే డబ్బులిస్తే కానీ ఓటు వేయమని మొండికేస్తున్నారని కూడా చెబుతున్నారు.

అయితే డబ్బులు తీసుకునేందుకు ఇష్టపడని వారు మాత్రం మొహమాటమో మరే కారణంగా తలవంచాల్సివస్తే, ఆత్మగౌరవం చంపుకోకుండా డబ్బులను దేవుడి గుడిలో హుండీల్లో వేయడం, అనాథ, వృద్ధాశ్రమాలకు దానం చేయడం చేస్తుంటారు. కానీ, ఏకంగా బ్యాలెట్ బాక్స్‌లోనే నోట్లను, లేఖను వేసిన ఇలాంటి సంఘటనలు మాత్రం బహు అరుదుగా జరుగుతుంటాయి. ఈ ఘటన ఓటర్లలో రావాల్సిన మార్పుకు, నిజమైన ప్రజాస్వామ్య విలువలకు అద్దం పడుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    
  • chittoor 
  • andhrapradesh 
  • cashforvotes 
  • voterawareness 

Similar News

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

అప్పుడు వైనాట్ కుప్పం...ఇపుడు వై నాట్ పులివెందుల !

2026-10-28 06:42 GMT

న‌గ‌రిలో రోజా రాజ‌కీయం చేసేనా .. ?

2026-10-27 23:30 GMT

టీటీడీ శ్రీ మహాలక్ష్మి దీప పూజ.. కుప్పంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహణ

2026-10-20 12:01 GMT

నగరి టీడీపీ చేతుల్లోకి.. ఫైట్ కు రెడీ అయిన రోజా.. ఏం జరుగనుంది?

2026-10-19 15:44 GMT

చెవిరెడ్డి ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే.. !

2026-09-19 18:30 GMT

భాను వ‌ర్సెస్ రోజా.. న‌గ‌రి రాజ‌కీయాలు మారుతున్నాయ్‌..!

2026-09-19 11:24 GMT

త‌ప్పుకొన్న చోట త‌లెత్తుకుని.. పుంగ‌నూరు టీడీపీ ప‌వ‌ర్‌ఫుల్‌..?

2026-09-14 08:30 GMT

భ‌ర‌త్ ఆవేశం.. వైసీపీ ముందే చేతులు ఎత్తేస్తోందా..?

2026-09-12 11:30 GMT

తమిళనాడు అసెంబ్లీని కుదిపేసిన ‘కుప్పం ఎయిర్ పోర్టు’ - ఏం జరిగిందంటే...?

2026-08-13 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS