• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  స్థానిక పీఠాల పై మంత్రుల...

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

| ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపారు. బనగానపల్లె సర్పంచ్‌గా ఇందిరారెడ్డి నామినేషన్ వేయగా, రాయచోటిలో హరితారెడ్డి ఎంపీపీగా ప్రమాణం చేశారు. నియోజకవర్గాల్లో పార్టీ పట్టు, స్థానిక రాజకీయాలపై నియంత్రణ కోసమే ఈ నిర్ణయాలనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

By - Tupaki Political Desk
Update: 2026-11-19 12:29 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర మంత్రులకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. క్షేత్రస్థాయిలో తమ పట్టు నిలుపుకోవాలన్న భావనతో ఉన్న నేతలు తమ కుటుంబ సభ్యులనే బరిలోకి దింపుతున్నారు. విపక్షంగా గట్టిగా ఉన్నట్లు భావించిన వద్ద క్షేత్రస్థాయి నేతలకు అవకాశం ఇచ్చి చేతులు కాల్చుకోవడం కన్నా, తమ కుటుంబ సభ్యులనే రంగంలోకి దింపి చావోరేవో తేల్చుకుంటామన్న సంకేతాలు పంపుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి తమ స్వస్థలం బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఇదే సమయంలో మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి మండలాధ్యక్షురాలిగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

రాయచోటిలో నువ్వానేనా

రాయచోటి నియోజకవర్గ రాజకీయాలు మొదటి నుంచీ అత్యంత వాడివేడిగా, నువ్వానేనా అన్నట్లుగా సాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే నియోజకవర్గంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ల ఘట్టం నుంచి పోలింగ్ వరకు ఇరువర్గాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఘర్షణ వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలోని 85 సర్పంచ్ స్థానాలు, ఎంపీటీసీ స్థానాలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో మండల పరిషత్ (ఎంపీపీ) పీఠం చేజారితే నియోజకవర్గంలో పట్టు తగ్గుతుందనే భావనతో, అలాగే గెలిచిన ఎంపీటీసీలలో వర్గ విభేదాలు తలెత్తకుండా ఏకతాటిపై ఉంచేందుకు మంత్రి మండిపల్లి తన సతీమణి హరితను రంగంలోకి దించారు. కుటుంబ సభ్యురాలే ఎంపీపీగా ఉంటే పాలనపై పూర్తి నియంత్రణ ఉండటంతో పాటు, ప్రతిపక్ష ఎత్తుగడలను సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చనే వ్యూహంతోనే ఆమెకు ఎంపీపీ పదవిని కట్టబెట్టే నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరోవైపు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ రాజకీయాల్లో 'బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ'కి ప్రత్యేకమైన చరిత్ర, రాజకీయ ప్రాధాన్యం ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రం కావడంతో పాటు, సుమారు 40 వేలకు పైగా జనాభా కలిగిన ఈ మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవిని ఎమ్మెల్యే పదవితో సమానంగా భావిస్తారు. గతంలో బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన సోదరుడు బీసీ నాగేంద్ర వంటి వారు కూడా ఈ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేసి నియోజకవర్గ రాజకీయాల్లో తమ కుటుంబ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. బనగానపల్లె పీఠం ఎవరి చేతిలో ఉంటే నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు వారి వైపే మొగ్గు చూపుతాయన్నది ఇక్కడి నానుడి.

అయితే, ప్రస్తుతం తాను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ బీసీ జనార్దన్ రెడ్డి తన సతీమణి ఇందిరారెడ్డిని స్వయంగా సర్పంచ్ బరిలో నిలపడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నాయకుల మధ్య గ్రూపు తగాదాలు రాకుండా నివారించడం, కీలకమైన మేజర్ పంచాయతీ నిధులు అభివృద్ధి పనులను నేరుగా తమ పర్యవేక్షణలో ఉంచుకోవడం ఇందులో ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. అంతేకాకుండా, ప్రత్యర్థి కాటసాని రామిరెడ్డి వర్గానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, ఏకగ్రీవం లేదా భారీ మెజారిటీతో గెలిచి బనగానపల్లెలో తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకోవాలని మంత్రి భావిస్తున్నారు. అందుకే సతీమణి ఇందిరారెడ్డి స్వయంగా రంగంలోకి దింపారని చెబుతున్నారు.

Tags:    
  • bcjanardhanreddy 
  • mandipalliramprasadreddy 
  • aplocalbodyelections 
  • tdppolitics 

Similar News

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS