• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  భార్య మృతదేహాన్ని...

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

| అమెరికాలో నేపాల్‌కు చెందిన నర్సు మమతా కఫ్లే భట్ హత్య కేసులో ఆమె భర్త నరేశ్ భట్‌ను వర్జీనియా కోర్టు దోషిగా నిర్ధారించింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు చోట్ల పడేసినట్లు అంగీకరించిన నరేశ్, హత్య మాత్రం చేయలేదని వాదించాడు. మమత మృతదేహం ఇంకా లభించలేదు. వచ్చే ఏడాది మార్చి 12న శిక్ష ఖరారు కానుంది.

By - Tupaki Desk
Update: 2026-11-11 11:24 GMT

అమెరికాలో నివసిస్తున్న నేపాల్‌కు చెందిన నర్సు మమతా కఫ్లే భట్ హత్య కేసులో ఆమె భర్త నరేశ్ భట్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేశ్‌ను అమెరికాలోని వర్జీనియా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో అత్యంత కలవరపరిచే విషయం ఏమిటంటే.. భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేసినట్లు అతనే అంగీకరించినా, ఆమెను తాను చంపలేదని చివరి వరకు వాదించాడు.

2024 జూలైలో మమత కనిపించకుండా పోయింది. ఆమె ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా విధులకు రాకపోవడంతో సహోద్యోగులు ఆందోళన చెందారు. పోలీసుల విచారణలో దంపతులు నివసిస్తున్న ఇంట్లో రక్తపు మరకలు సహా పలు ఆధారాలు లభించాయి.

తాజాగా విచారణ సందర్భంగా నరేశ్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఇంట్లో తన భార్య చనిపోయి ఉండటాన్ని గమనించానని, భయంతో పోలీసులకు సమాచారం ఇవ్వలేదని చెప్పాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా చేసి చెత్త సంచుల్లో వేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు అంగీకరించాడు. అయితే మమత ఆత్మహత్య చేసుకుందని, తాను హత్య చేయలేదని వాదించాడు.

మరోవైపు నరేశే ఆమెను హత్య చేసి ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించాడని ప్రాసిక్యూషన్ వాదించింది. చివరకు నవంబర్ 10, 2026న జ్యూరీ అతడిని ఫస్ట్ డిగ్రీ హత్యతో పాటు మృతదేహాన్ని దాచడం, అవమానించడం వంటి అభియోగాల్లో దోషిగా తేల్చింది.

అయితే ఇంతవరకు మమత మృతదేహం లభించలేదు. ఈ దంపతుల చిన్నారి కూతురు తల్లిదండ్రులిద్దరికీ దూరమైంది. నరేశ్‌కు వచ్చే ఏడాది మార్చి 12న శిక్ష ఖరారు చేయనున్నారు.

Police came to check on a 28-year-old nurse who hadn't shown up for work. Her husband opened the door holding their baby. By then, prosecutors say, she had been dead for three days and her body had been cut apart and thrown out with the trash. Calmly, he told the officer: "She destroyed that phone, and then she left." She was going to New York or Texas, according to him. He wanted to know if he'd have to file a complaint. And there was something else: she had "mental issues." Two years later, on the witness stand, he finally said it out loud: "I had a saw, I used the saw." Naresh Bhatt says he found his wife Mamta dead in their bedroom, panicked and cut her apart. In his version she took her own life. He denies killing her. July 2024, Manassas Park, Virginia. Mamta Kafle Bhatt was a nurse from Nepal and a new mother. Prosecutors say she was killed at home on or about July 30. The next afternoon, cameras at a Walmart filmed her husband buying carpet cleaner, cleaning supplies and body wash. He didn't want to report her missing, and only did it three days after the police visit. On August 22 he was arrested for concealing a dead body while she was still, officially, a missing person. That December came the first-degree murder charge. Her remains have never been found. Investigators say blood on a power saw likely matches her DNA. For two years he said he had no idea what happened to her. Now he admits to the saw and the trash bags, and insists the one thing he didn't do is kill her. The jury could get the case this week. In the video below is the police bodycam from August 2. He holds the baby the whole time. She wouldn't see a psychiatrist, he says, because in her words, "I'm a registered nurse." When the officer asks him to call if she comes back, he answers: "Until Sunday, I don't think so." Then the clip cuts to the courtroom. Three days, one saw, two years of "she left." A panicked husband, or a man who waited two years for a better story?

— One Click Mind (@oneclickmind) November 10, 2026
Tags:    
  • mamatakafle 
  • nareshbhatt 
  • nepalinurse 

Similar News

విదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై విమర్శలు.. అసలు సమస్య ఎక్కడుంది?

2026-11-09 16:30 GMT

అమెరికాలో 22 ఏళ్ల తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి

2026-11-08 13:35 GMT

గచ్చిబౌలి హోటల్‌లో అమెరికా వ్యాపారవేత్త మృతి

2026-11-07 04:00 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

Copyright @2026

Powered by Blink CMS