• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  అమెరికా కాంగ్రెస్‌లోకి...

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

| ఈ ఎన్నికల్లో పియా దండియాకు 51.9 శాతం ఓట్లు లభించగా, కేసీ ఆస్కర్ 48.1 శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు.

By - Tupaki Desk
Update: 2026-11-04 08:52 GMT

అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన మరో మహిళ చరిత్ర సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి పియా దండియా.. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి అమెరికా ప్రతినిధుల సభ (US House of Representatives)లో అడుగుపెట్టనున్నారు. నవంబర్ 3న జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి కేసీ ఆస్కర్‌పై ఆమె గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో పియా దండియాకు 51.9 శాతం ఓట్లు లభించగా, కేసీ ఆస్కర్ 48.1 శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఈ విజయంతో ఫ్లోరిడా నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి ప్రతినిధిగా పియా గుర్తింపు పొందారు. అలాగే ప్ర‌మీలా జయపాల్ తర్వాత అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన రెండో భారతీయ సంతతి మహిళగా నిలిచారు.

పామ్ బీచ్ కౌంటీలో భారతీయ వలసదారుల కుటుంబంలో జన్మించి పెరిగిన పియా.. తొలుత ఉపాధ్యాయురాలిగా తన కెరీర్ ప్రారంభించారు. అనంతరం న్యూయార్క్‌లోని హార్లెమ్ ప్రాంతంలో హైస్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. వైట్ హౌస్ ఫెలోగా అమెరికా విద్యాశాఖలో సేవలందించడంతో పాటు యాపిల్ సంస్థలోనూ పనిచేశారు.

తన ఎన్నికల ప్రచారంలో విద్య, వైద్య సదుపాయాలు, పెరుగుతున్న జీవన వ్యయం, ఉపాధి అవకాశాలను ప్రధాన అంశాలుగా ప్రస్తావించారు. కొత్తగా పునర్విభజించిన ఫ్లోరిడా 22వ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 2027 జనవరిలో కొత్త కాంగ్రెస్ సమావేశమైనప్పుడు ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇదిలా ఉంటే.. 2026 అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. డెమొక్రాట్లు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ మెజారిటీ సాధించారు. దీంతో ట్రంప్ ప్రభుత్వానికి మిగిలిన రెండేళ్ల పాలనలో చట్టాల ఆమోదం, కీలక నియామకాల విషయంలో ప్రతిపక్షం నుంచి మరింత రాజకీయ సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.

Tags:    
  • piadandiya 
  • indianamerican 
  • usmidtermelections 
  • floridaelection 
  • ushouse 

Similar News

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

ఫుడ్ బ్యాంక్ వివాదం.. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ద్వేషానికి మరో అస్త్రం

2026-10-25 08:30 GMT

F-1 వీసా రిజెక్ట్ అయితే 300 రోజులు ఆగాలా?

2026-10-25 04:52 GMT

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో ఫోన్ మాట్లాడిన కాసేపటికే విషాదం!

2026-10-23 14:17 GMT

ట్రంప్ అండతో రామస్వామి దూకుడు.. ఓహియో ఎన్నికల్లో వ్యక్తిగత దాడులే కీలకమవుతున్నాయా?

2026-10-23 05:17 GMT

Copyright @2026

Powered by Blink CMS