• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  Hyderabad >  డిసెంబర్ నుంచే డేంజర్...

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

| ఎల్‌నినో ప్రభావంతో డిసెంబర్ నుంచే హైదరాబాద్‌లో నీటి కష్టాలు మొదలయ్యే ప్రమాదం ఉందని జలమండలి అంచనా వేస్తోంది. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు 10 శాతానికి పడిపోవచ్చని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

By - A.N.Kumar
Update: 2026-11-11 10:36 GMT

అప్పట్లో 2002 సంవత్సరం.. ఇప్పటికీ ఆ కరువు కరాళనృత్యం అందరి మదిలో ఉంది. తెలుగునాట తీవ్రమైన కరువొచ్చింది.. నీళ్ల కోసం బిందెలు సైకిళ్లకు కట్టుకొని పొలాల వద్దకు వెళ్లి మిగిలిన కాసిన్ని నీటిని తెచ్చుకొని జనాలు తమ అవసరాలు తీర్చుకున్న పరిస్థితి. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బిందెలు మోస్తూ వెళుతున్న దృశ్యాలే.... రైతులు అయితే పిట్టల్లా రాలారు. కరెంట్ లేక, తాగునీటి సౌకర్యం లేక జనాలు హరిగోస పడ్డారు. అంతటి తీవ్రమైన కరువు ఇప్పుడు ఎల్ నినోతో మరోసారి రాబోతోంది. ఈసారి హైదరాబాద్ మహానగారానికి అది పొంచి ఉంది. డిసెంబర్ నుంచే ఆ డేంజర్ బెల్స్ మోగనున్నాయి..

హైదరాబాద్ ప్రజల గొంతులో ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడింది. వేసవి దాహార్తి గురించి మనం ప్రతీ ఏడాదీ వింటూనే ఉంటాం.. కానీ ఈసారి వేసవి రావాల్సిన అవసరం కూడా లేదేమో అనిపిస్తోంది. చలికాలం ముగిసేలోపే అంటే సరిగ్గా డిసెంబర్ నెల నుంచే హైదరాబాద్‌కు 'కన్నీటి' కష్టాలు మొదలు కానున్నాయనే వార్త తెలంగాణ ప్రజలను.. ముఖ్యంగా నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ఒకప్పుడు నిండుగా ప్రవహించే చెరువులు.. కుంటలతో కళకళలాడిన హైదరాబాద్ తాగునీటి వనరులు ఇప్పుడు బొట్టు నీటికి కూడా అల్లాడే పరిస్థితి దాపురిస్తోంది. హైదరాబాద్‌కు ప్రధానంగా తాగునీటిని అందించే సింగూరు.. మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు మునుపెన్నడూ లేనంతగా క్షీణించి పోతున్నాయి. డిసెంబర్ నాటికి ఈ రిజర్వాయర్లలో నీటి మట్టం కేవలం 10 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందన్న జలమండలి అంచనాలు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.

ఈ నీటి సంక్షోభం ప్రభావం ప్రధానంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ సిటీలో భాగమైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, నార్సింగి, కోకాపేట వంటి ఐటీ హబ్‌లపై దారుణంగా పడనుంది. శేరిలింగంపల్లిలో ఏకంగా 80 శాతం.. జూబ్లీహిల్స్‌లో 50 శాతం వరకు నీటి సరఫరా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజుకు సుమారు 10 కోట్ల గ్యాలన్ల నీటి లోటు ఏర్పడితే.. ఉదయాన్నే లేచి కుళాయి తిప్పితే చుక్క నీరు రాకపోతే.. పిల్లలను స్కూళ్లకు.. ఉద్యోగాలకు పంపే కుటుంబాల పరిస్థితి ఎంత నరకప్రాయంగా మారుతుందో ఊహించుకోవడానికే భయమేస్తోంది.

రూ.కోట్లు వెచ్చించి కొనుక్కున్న ప్లాట్లు.. 40 అంతస్తుల విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నా.. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు లేకపోతే ఆ అభివృద్ధికి అర్థమేముంది? వందల అడుగులు తవ్వినా భూగర్భ జలాలు ఊరని పరిస్థితి నెలకొంటుంది.. రోజువారీ అవసరాల కోసం ట్యాంకర్ల వెంట బకెట్లతో పరుగులు తీయాల్సిన దుస్థితి వస్తే సామాన్య.. మధ్యతరగతి కుటుంబాల బతుకులు మరింత భారమవుతాయి.

కనీస అవసరమైన మంచి నీరు కూడా ఖరీదైన వ్యాపారంగా మారిపోకముందే.. ప్రభుత్వం, జలమండలి అధికారులు తక్షణమే స్పందించాలి. ప్రత్యామ్నాయ గోదావరి జలాల తరలింపు వేగవంతం చేసి.. లీకేజీలను అరికట్టి నగర దాహార్తిని తీర్చకపోతే.. నగరంలో వికాసం కాదు.. వినాశనమే మిగులుతుంది. ఎందుకంటే ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా.. ఎన్ని ఆకాశహర్మ్యాలు నిర్మించినా చివరకు మనిషికి కావాల్సింది గుక్కెడు మంచినీళ్లే..

Tags:    
  • hyderabadwatercrisis 
  • elnino 
  • hyderabad 
  • telangana 
  • watershortage 

Similar News

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

‘‘అండాలు ఇస్తే రూ. 50 వేలు’’ హైదరాబాద్ లో దారుణం, తండ్రి చికిత్స కోసం వచ్చి ఇరుక్కుపోయిన యువతి

2026-11-15 20:24 GMT

నాగార్జునకు భారీ లబ్ది...ఈటల సంచలన వ్యాఖ్యలు!

2026-11-14 16:43 GMT

కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు

2026-11-14 10:44 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో బిగ్ ట్విస్ట్.. రేవంత్ హింట్

2026-11-14 03:20 GMT

హైడ్రా రంగనాథ్ మీద నాగ్ పొగడ్తల వర్షం...మ్యాటర్ ఇదే !

2026-11-12 02:22 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

హైదరాబాద్‌లో 'వర్క్ ఫ్రమ్ పార్క్'.. ఐటీ ఉద్యోగులకు నిజంగా ఎంతవరకు ఉపయోగం?

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS