• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  Hyderabad >  ఫోన్ ట్యాపింగ్ కేసులో...

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో బిగ్ ట్విస్ట్.. రేవంత్ హింట్

| తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో త్వరలో ఊహించని మలుపులు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ.. మీడియా మిత్రులు సిద్ధంగా ఉండాలని సూచించారు. మియాపూర్ భూముల వేలం, కవిత నివాసం వద్ద డ్రోన్ ఘటనపైనా స్పందించారు. సీఎం వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

By - A.N.Kumar
Update: 2026-11-14 03:20 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదో పెద్ద బిగ్ బాంబ్ పేల్చేందుకు రెడీ అయ్యారు. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో బిగ్ ట్విస్ట్ ఉండబోతుందంటూ రాజకీయాల్లో హీట్ పెంచారు. మియాపూర్ భూముల వివాదం నుంచి రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ వరకు.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ వేదికగా మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడుతూ ఈ కేసు విచారణలో త్వరలోనే ఊహించని మలుపులు తిరుగుతుందని.. మీడియా మిత్రులు రెడీగా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హింట్ ఇచ్చారు.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల ప్రస్తావన రాగా తన ఫోన్‌ను ఎవరు ట్యాప్ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. తాను మాట్లాడే ప్రతి అంశం బహిరంగంగానే ఉంటుందని.. రహస్యంగా దాచుకోవాల్సిన విషయాలు ఏమీ లేవని సీఎం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దర్యాప్తులో రాబోయే రోజుల్లో ఎలాంటి ఆధారాలు వెలుగులోకి వస్తాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.

మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న హెచ్చరికలపై ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. గతంలో ల్యాంకో హిల్స్.. పద్మాలయ స్టూడియో భూముల విషయంలోనూ ఆ పార్టీ నేతలు ఇదే తరహాలో ఆందోళనలు చేశారని.. కానీ అధికారంలోకి వచ్చాక ఆ అంశాలను ఎందుకు పక్కన పెట్టారని ఆయన ప్రశ్నించారు. వేలం అడ్డుకుంటామనే ప్రకటనల వెనుక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద డ్రోన్ ఎగిరిన ఘటనపై స్పందిస్తూ ఆ వ్యవహారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని.. అది వారి కుటుంబ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినదై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గడ్డం పెంచడంపై మీడియా అడిగిన ప్రశ్నకు అది ఆయన వ్యక్తిగత విషయమని పేర్కొంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరగనున్న తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని సీఎం స్పష్టం చేశారు. కేవలం 'ఖేలో ఇండియా' క్రీడా పోటీలకు ఆహ్వానించేందుకే ప్రధానిని కలుస్తున్నట్లు వివరించారు. ఇటీవల నిర్వహించిన భారత్ సమిట్‌కు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానించకపోవడంపై స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సు కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ఆహ్వానించినా వారు హాజరు కాలేదని గుర్తుచేశారు.

మరి సీఎం చెప్పిన ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగనుంది? బీఆర్ఎస్ నేతలు ఎవరైనా టార్గెట్ అవుతరా? అరెస్టులు ఏమైనా ఉంటాయా? అన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.

Tags:    
  • revanthreddy 
  • telangana 
  • phonetappingcase 
  • telanganapolitics 
  • brs 

Similar News

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

‘‘అండాలు ఇస్తే రూ. 50 వేలు’’ హైదరాబాద్ లో దారుణం, తండ్రి చికిత్స కోసం వచ్చి ఇరుక్కుపోయిన యువతి

2026-11-15 20:24 GMT

నాగార్జునకు భారీ లబ్ది...ఈటల సంచలన వ్యాఖ్యలు!

2026-11-14 16:43 GMT

కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు

2026-11-14 10:44 GMT

హైడ్రా రంగనాథ్ మీద నాగ్ పొగడ్తల వర్షం...మ్యాటర్ ఇదే !

2026-11-12 02:22 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

హైదరాబాద్‌లో 'వర్క్ ఫ్రమ్ పార్క్'.. ఐటీ ఉద్యోగులకు నిజంగా ఎంతవరకు ఉపయోగం?

2026-11-08 06:32 GMT

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

2026-11-07 02:27 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

Copyright @2026

Powered by Blink CMS