• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  ఉదయం పోలీసులకు ఫిర్యాదు.....

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

| హైదరాబాద్ మీర్‌పేటలో కుటుంబ కలహాలు జంట హత్యలకు దారితీశాయి. భర్త వేధింపులతో నవంబర్ 4న పుట్టింటికి చేరిన నూర్ బేగం పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరింది. అదే రోజు సాయంత్రం ఆమె భర్త సిద్ధిఖీ అత్త నిరంజన్ బి, బావమరిది యూసుఫ్‌ను కత్తితో హత్య చేశాడు. యూసుఫ్ భార్య రేష్మా తీవ్రంగా గాయపడింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

By - A.N.Kumar
Update: 2026-11-07 02:27 GMT

ఒకవైపు పుట్టింటికి ఆసరాగా నిలవాలనుకున్న ఆశలు.. మరోవైపు తోడబుట్టినవారిని.. కన్నతల్లిని కాపాడుకోలేకపోయామన్న వేదన.. కాలం చేసిన గాయం కన్నా.. ఆ రాత్రి మిగిల్చిన భయం ఆ కుటుంబంలో ఎప్పటికీ మాసిపోని కాళరాత్రిగా మిగిలిపోయింది. హైదరాబాద్‌లోని మీర్‌పేటలో చోటుచేసుకున్న జంట హత్యల ఘటన కేవలం వార్త కాదు... కుటుంబ కలహాల దావానలంలో రెండు నిండు ప్రాణాలు బూడిదైన ఒక తీవ్ర హృదయ విదారక విషాదం..

షరీఫ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ సిద్ధిఖీ, నూర్ బేగంల దాంపత్యంలో మొదలైన చిన్నిచిన్న మనస్పర్థలు క్రమంగా ఒక తీవ్రమైన మానసిక వేధింపుగా మారాయి. భర్త ఆరాచకాలు శృతిమించడంతో తన ప్రాణాలకు.. పుట్టింటివారి ఉనికికి ముప్పు ఉందని గ్రహించిన నూర్ బేగం తీవ్ర మనోవేదనతో నవంబర్ 4న పుట్టింటికి చేరింది. అదే రోజు ఉదయం పోలీసులను ఆశ్రయించి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకుంది. తమను కాపాడాలంటూ ఒక మహిళ పెట్టిన ఆర్తనాదం అధికారుల దాకా వెళ్లినా ఆ అభ్యర్థన సమయం పొద్దుగూకేలోపే కాటికి పంపే కాళరాత్రిగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

పెద్దల సమక్షంలో తనకు అవమానం జరిగిందన్న అహంకారం.. కక్షగా మారిన క్షణంలో సిద్ధిఖీలో మనిషి చచ్చి మృగం నిద్రలేచింది. పక్కా పథకం ప్రకారం అదే రోజు సాయంత్రం అత్తింటిపై కత్తితో విరుచుకుపడ్డాడు. కన్నతల్లి లాంటి అత్త నిరంజన్ బి.. అండగా నిలిచిన బావమరిది మహమ్మద్ యూసుఫ్‌లపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడికక్కడే వారి శ్వాసను నిలిపివేశాడు. ఈ రాక్షసకాండలో యూసుఫ్ భార్య మహమ్మద్ రేష్మా తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి.. కత్తితో సహా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ.. పోయిన నిండు ప్రాణాలు తిరిగి వస్తాయా? అదే ఈ క్రైం కథనంలో విషాదం నింపే గాథ..

"మా ప్రాణాలకు ప్రమాదం ఉంది" అని ఒక బాధితురాలు ఆక్రోశించినప్పుడు.. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టడంలో ఎక్కడ లోపం జరిగింది? ఒకవేళ ఆ ఫిర్యాదును గంభీరంగా పరిగణించి ఉంటే ఆ రెండు ప్రాణాలు దక్కేవి కావా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సమాజాన్ని.. శాంతిభద్రతల వ్యవస్థను తీవ్రంగా తొలుస్తున్నాయి. క్షణికావేశాలు.. స్వార్థపూరిత కక్షలు ఎంతటి అపార నష్టాన్ని మిగులుస్తాయో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

ఇకనైనా ముందస్తు హెచ్చరికలను వ్యవస్థ తేలిగ్గా తీసుకోకుండా తగిన రక్షణ కల్పిస్తేనే ఇలాంటి రక్తం ఓడే ఘోర కలియుగ దారుణాలను అరికట్టగలుగుతాం.

Tags:    
  • meerpetdoublemurder 
  • hyderabadcrime 
  • policecomplaint 
  • telanganacrime 

Similar News

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

రీల్స్ పిచ్చి పరాకాష్ట.. యువకుడిని సజీవ దహనం చేసేందుకు యత్నం!

2026-11-07 02:29 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

Copyright @2026

Powered by Blink CMS