• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  బిగ్ అప్టేట్ : రాప్తాడు...

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

| అరాచకానికి పరాకాష్ఠగా నిలిచిన రాప్తాడు ఘటన సమాజాన్ని నిశ్చేష్టం చేసింది.

By - A.N.Kumar
Update: 2026-11-03 09:35 GMT

అరాచకానికి పరాకాష్ఠగా నిలిచిన రాప్తాడు ఘటన సమాజాన్ని నిశ్చేష్టం చేసింది. పచ్చటి భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న ఓ పదో తరగతి పసిపాపపై రంపంతో అంతటి అమానుషానికి ఒడిగట్టడం ప్రతి గుండెను పిండివేసింది. తాజాగా రాప్తాడు నిందితుడి కుడి కాలును వైద్యులు పూర్తిగా తొలగించారు. అయితే రక్తమోడిన ఆ చిన్నారి ఆక్రందనలకు, ఆమె కుటుంబం అనుభవిస్తున్న నరకానికి న్యాయస్థానంలో నిందితుడికి పడే కఠిన శిక్ష మాత్రమే ఉపశమనం ఇవ్వగలదు.

తీవ్ర కలకలం రేపిన అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన 21 ఏళ్ల నిందితుడు హేమంత్‌కు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కీలక శస్త్రచికిత్స నిర్వహించారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా దెబ్బతిన్న అతడి కుడి కాలుకు రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోవడంతో మోకాలి పైభాగం వరకు తొలగించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడికి అత్యవసర ఆపరేషన్ నిర్వహించినట్లు అనంతపురం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపినా వినకుండా సీఐపై ఎదురుదాడికి దిగడంతో పోలీసులు హేమంత్ కాళ్లపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హేమంత్ కుడి కాలి రక్తనాళాలు చిధ్రమై కణజాలం పూర్తిగా దెబ్బతిన్నదని.. ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు వ్యాపించకుండా ఉండేందుకు మోకాలి పైవరకు కాలును తొలగించాల్సి వచ్చిందని వివరించారు. అలాగే అతడి ఎడమ కాలికి కూడా గాయాలవ్వడంతో రక్తనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం నిందితుడిని ఏఎంసీకి తరలించి చికిత్స అందిస్తున్నామని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

పదో తరగతి విద్యార్థినిపై జరిగిన ఈ క్రూరమైన దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. పసిపాపపై రంపంతో దాడికి తెగబడటం పట్ల ప్రజలు, మహిళా సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వైద్యుల శస్త్రచికిత్స వల్ల నిందితుడి కాలు తొలగించినప్పటికీ ఇది చట్టపరమైన శిక్ష కాదని.. న్యాయస్థానం ద్వారా అతడికి కఠినమైన శిక్ష అమలైనప్పుడే బాధితురాలికి పరిపూర్ణ న్యాయం జరుగుతుందని బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

Tags:    
  • rapthaduincident 
  • anantapur 
  • gopikacase 
  • andhrapradesh 
  • crimenews 

Similar News

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

హనీట్రాప్ లో ఏసీపీ.. ఇన్ స్పెక్టర్ ఎలా పడ్డారబ్బా?

2026-10-22 08:02 GMT

Apple Mass Warning.. ఐఫోన్లు కొట్టేశారా.. మామూలుగా ఉండదు!

2026-10-22 05:25 GMT

డబ్బుల కోసం దాచేసి .. దొరికిపోతానని !

2026-10-13 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS