• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  అమెరికాకే మోస్ట్ వాంటెడ్...

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

| ఈ క్రైమ్ థ్రిల్లర్ పరంపర 2014లో సోనీ పిక్చర్స్ పై జరిగిన ఘోరమైన సైబర్ దాడితో వెలుగులోకి వచ్చింది.

By - A.N.Kumar
Update: 2026-11-03 06:56 GMT

ఒకప్పుడు యుద్ధం అంటే సరిహద్దుల్లో తుపాకుల గర్జనలు.. క్షిపణుల విధ్వంసాలు మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ డిజిటల్ యుగంలో యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోయింది. శత్రు దేశంపై ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా కేవలం కోడింగ్ స్క్రీన్‌పై కొన్ని వేళ్ల కదలికలతో వేల కోట్ల డాలర్లను దోచుకోవచ్చు. దేశాల ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేయవచ్చు. ఈ నూతన శకపు సైబర్ యుద్ధంలో ప్రపంచాన్ని భయపెడుతున్న అతిపెద్ద పేరు ‘‘పాక్ జిన్-హ్యుక్’’

అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ వాంటెడ్ లిస్టులో అగ్రస్థానంలో ఉన్న ఈ ఉత్తర కొరియా ప్రోగ్రామర్.. ఒక సాధారణ నేరస్థుడు కాదు. సైనిక వ్యూహాలకు సాంకేతికతను ఆయుధంగా మార్చిన ఒక పక్కా సైబర్ కిలాడీ. ఉత్తర కొరియా ప్రభుత్వ మద్దతుతో నడిచే ప్రసిద్ధ 'లాజరస్ గ్రూప్' వెనుక ఉండి నడిపించిన ప్రధాన సూత్రధారులలో ఇతనొకడని అమెరికా న్యాయశాఖ ఆరోపిస్తోంది.

ఈ క్రైమ్ థ్రిల్లర్ పరంపర 2014లో సోనీ పిక్చర్స్ పై జరిగిన ఘోరమైన సైబర్ దాడితో వెలుగులోకి వచ్చింది. సంస్థ అంతర్గత ఈ-మెయిల్స్, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, విడుదల కాని చిత్రాలను హ్యాక్ చేసి బహిరంగంగా లీక్ చేయడంతో హాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

అక్కడితో ఆగని ఈ నెట్‌వర్క్ దృష్టి అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగానికి మళ్లింది. 2016లో బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన 'స్విఫ్ట్' వ్యవస్థలో భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని.. కనురెప్పపాటులో 8.1 కోట్ల డాలర్లు అంటే సుమారు ₹670 కోట్లు నగదును దారి మళ్లించారు. ఆ తర్వాత 2017లో వచ్చిన 'వాన్నాక్రై' ర్యాన్సమ్‌వేర్ దాడి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లను లాక్ చేసింది. చివరికి బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ ఆసుపత్రుల సేవలను కూడా స్తంభింపజేసి ప్రాణాల మీదకు తెచ్చింది.

కాలంతో పాటు రూపుమార్చుకున్న ఈ సైబర్ గ్యాంగ్.. డిజిటల్ కరెన్సీపై కన్నువేసింది. 2021 నాటికి 1.3 బిలియన్ డాలర్లకు పైగా డిజిటల్ అసెట్స్ దోపిడీలో పాక్ జిన్-హ్యుక్ భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలను లక్ష్యంగా చేసుకుంటూ ఈ నెట్‌వర్క్ సాగిస్తున్న అక్రమ వసూళ్లు వ్యక్తిగత విలాసాల కోసం కాదు.. అంతర్జాతీయ ఆంక్షలను తట్టుకుని ఉత్తర కొరియా తన అణ్వాయుధాలు.. బాలిస్టిక్ క్షిపణుల నిర్మాణానికి అవసరమైన విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చుకోవడానికి వినియోగిస్తోంది.

ఇంగ్లీష్, కొరియన్, మాండరిన్ భాషల్లో దిట్ట అయిన ఈ హ్యాకర్‌పై అమెరికా ఫెడరల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతడు ఉత్తర కొరియా రక్షణ వలయంలో సురక్షితంగా ఉన్నాడు. అసలు ప్రమాదం ఒక పాక్ జిన్-హ్యుక్ మాత్రమే కాదు... ఒక దేశమే వ్యవస్థాగతంగా నిర్మించుకున్న ఈ విధ్వంసకర సైబర్ నెట్‌వర్క్.. బాంబుల కంటే ముందే డిజిటల్ వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉందనడానికి ఈ ఘోర క్రైమ్ కథనమే ప్రత్యక్ష నిదర్శనం.

Tags:    
  • parkjinhyok 
  • northkorea 
  • lazarusgroup 
  • cyberattack 
  • cybercrime 

Similar News

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

హనీట్రాప్ లో ఏసీపీ.. ఇన్ స్పెక్టర్ ఎలా పడ్డారబ్బా?

2026-10-22 08:02 GMT

Apple Mass Warning.. ఐఫోన్లు కొట్టేశారా.. మామూలుగా ఉండదు!

2026-10-22 05:25 GMT

డబ్బుల కోసం దాచేసి .. దొరికిపోతానని !

2026-10-13 07:52 GMT

ఇది మరో 'పిశాచి' కథ.. తండ్రిపై ప్రేమతో నాలుగేళ్లుగా ఫ్రీజర్‌‌లోనే మృతదేహం.. ముంబైలో గగుర్పొడిచే కథ

2026-10-01 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS