• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Telangana >  Hyderabad >  హైడ్రా రంగనాథ్ నెక్ట్స్...

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

| చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల తర్వాత హైడ్రా దృష్టి హైదరాబాద్‌లోని అక్రమ వాటర్ ట్యాంకర్ మాఫియాపై పడినట్లు కనిపిస్తోంది. అనుమతులు లేకుండా లోతైన బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్న వ్యాపారులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. అయితే అక్రమ బోర్లను అరికడుతూనే ప్రజలకు తాగునీటి కొరత రాకుండా చూడటం హైడ్రాకు సవాల్‌గా మారింది.

By - A.N.Kumar
Update: 2026-11-05 06:52 GMT

ముందు చెరువులు.. కుంటలు.. ఆ తర్వాత నాలాలు.. ప్రభుత్వ భూముల సంరక్షణ.. ఇప్పుడు హైడ్రా టార్గెట్ మారిందా? హైదరాబాద్ లో వేళ్లూనుకొని ప్రజల నుంచి పీల్చి పిప్పి చేస్తున్న ఓ మాఫియాపై హైడ్రా కన్నుపడిందా? ఈ మేరకు వారిలోనూ అలజడి మొదలు కావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్ అయినట్టేగానే కనిపిస్తోంది.

హైడ్రా ఇప్పుడు తన ఫుల్ ఫోకస్ ను హైదరాబాద్ లోని నీటి ట్యాంకర్ల మాఫియాపై పెట్టింది. భూగర్భ జలాలను దోపిడీ చేస్తూ.. అక్రమ వాటర్ ట్యాంకర్ మాఫియా వసూలు చేస్తున్న అడ్డగోలు దందాపై దృష్టిసారించింది. హైదరాబాద్ పరిధిలో అనుమతులు లేకుండా వేస్తున్న లోతైన బోర్లు.. వాటి ద్వారా సాగుతున్న అపరిమిత నీటి వ్యాపారంపై నిఘా పెట్టేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగం సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉందంటే.. వివిధ కంపెనీలు, విద్యాసంస్థలు నీటి కొరతతో సెలవులు ఇస్తూ విద్యార్థులు, ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్ రామ్ గూడ వంటి ఐటీ కారిడార్లలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో స్థానిక బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో అక్కడ ఉన్న వేలాది అపార్ట్ మెంట్లు, పీజీలు, హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలు పూర్తిగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడే పరిస్థితి దాపురించింది.

ఈ తీవ్రమైన అత్యవసర అవసరాన్నే ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వ్యాపారులు, నగర శివారు ప్రాంతాలలో ఎటువంటి అనుమతులు లేకుండా వందల అడుగుల లోతుకు బోర్లు వేసి వ్యాపార ప్రయోజనాల కోసం భూగర్భ జాలలను తోడేస్తున్నారు. ఇటీవల అక్రమ బోర్లను హైడ్రా సీజ్ చేయడం.. వెంటనే వాటర్ ట్యాంకర్ల సమ్మెతో నిమిషాల వ్యవధిలోనే సరఫరా నిలిచిపోయి హైదరాబాద్ లో అల్లకల్లోలమైంది. హైదరాబాద్ నీటి వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఈ పరిణామం కళ్లకు కట్టింది.

అక్రమంగా నీటిని వెలికి తీస్తున్న బోర్లను ఒక్కసారిగా సీజ్ చేస్తే మున్సిపల్ నీటి సదుపాయం లేని శివారు ప్రాంతాలలో తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుతం హైడ్రా ఆచితూచి పక్కా ప్లాన్ తో సాగుతోంది. అక్రమ మార్గాలను మూసివేస్తూనే సాధారణ పౌరులకు తాగునీటి కొరత రాకుండా ప్రత్యామ్మాయ సరఫరా మార్గాలను సుగమం చేయడం హైడ్రా ముందున్న అసలైన సవాల్.

Tags:    
  • hydra 
  • hyderabad 
  • watermafia 
  • watertanker 
  • ranganaath 

Similar News

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

మాకంటే మాకే.. గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ సీట్లపై క‌ర్చీఫ్‌లు!

2026-11-01 12:16 GMT

హైదరాబాద్ హోటళ్లలో డేంజర్ ఫుడ్.. 14 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్!

2026-11-01 06:58 GMT

ఒక్క వానకే హైదరాబాద్ చెరువుల కళకళ.. హైడ్రా శ్రమకు దక్కిన సార్థకత..

2026-10-30 17:11 GMT

హైదరాబాద్‌లో అప్పుడే నీటి ట్యాంకర్లకు భారీ డిమాండ్.. వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉండబోతోంది?

2026-10-26 04:32 GMT

ఎల్ నినో ఎఫెక్ట్....రేవంత్ సర్కార్ కు జనసేన దిశా నిర్దేశం !

2026-10-25 14:42 GMT

కాలం కలిసి వస్తే 2028లో నేనే సీఎం.. ఓపెన్ అయిపోయిన మహేష్ కుమార్ గౌడ్

2026-10-23 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS