• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Telangana >  Hyderabad >  రేవంత్ బయటపెట్టిన ‘ది...

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

| రాజకీయ పార్టీ నేతలు మంచి మాటకారులు అయితే ఆ ఆణిముత్యాల డైలాగులు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి.

By - A.N.Kumar
Update: 2026-11-04 13:15 GMT

రాజకీయ పార్టీ నేతలు మంచి మాటకారులు అయితే ఆ ఆణిముత్యాల డైలాగులు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘సామెతలతో’ మోత మోగించడంలో కేసీఆర్ దిట్ట.. ఆయన తర్వాత రేవంత్ కూడా తిట్ల దండకంతో గట్టిగానే తిట్టిపోస్తుంటారు. ఏపీలో ఈ కళ నేతల్లో కొంచెం తక్కువే. ఎక్కడికి వెళితే అక్కడ వారిని మెస్మరైజ్ చేసేట్లు మాట్లాడడంలోనే నాయకుడి తెలివితేటలు బయటపడుతాయి. తాజాగా సీఎం రేవంత్ కూడా రాజకీయం బాగానే వంటపట్టించుకొని కులసంఘాలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.

హైదరాబాద్ నగరం ఒకప్పుడు ‘గొల్ల కొండ’ గా ప్రసిద్ధి చెందిందనే చారిత్రక సత్యాన్ని గుర్తుచేస్తూ రేవంత్ విసిరిన ఓ డైలాగ్ పాపులర్ అయ్యింది. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు యాదవుల ఇళ్లే ప్రధాన బ్యాంక్ కాబోతున్నాయనే రేంజ్ లో మన సీఎం రేవంత్ విసిరిన చమత్కార పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లో నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ ఎనర్జిటిక్ స్పీచ్ చూసిన తర్వాత సామాన్యులకు డౌట్ కొడుతోంది.. ‘మరి మనం ఏటీఎంల చుట్టూ తిరడం దేనికి దండగ.. యాదవులు ఉండగా’ అంటూ ఆలోచన చేస్తున్నారు.

సదర్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ దానికి ఏకంగా రూ.5 కోట్లు మంజూరు చేయడం వరకూ బాగానే ఉంది కానీ ఈ వేడుక కోసం ఏకంగా కేబినెట్ భేటినే వాయిదా వేశామని సీఎం రేవంత్ చెప్పడంతో యాదవ సోదరుల పట్ల ఆయనుకున్న అపరిమిత ప్రేమ ఏంటో బయటపడింది.

ఇందులో అసలు సిసలు హైలెట్ ఏంటంటే.. ఒకవేళ రేపు పొద్దున్న దేశంలో రిజర్వ్ బ్యాంక్ సర్వర్లు డౌన్ అయి మూతపడినా లేక ఆర్థిక సంక్షోభం వచ్చి బ్యాంకులు చేతులెత్తేసినా సరే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంట.. ఎందుకంటే ప్రతీ యాదవ సోదరుడి ఇంట్లో ఎలాగూ ఒకటి రెండు కోట్ల రూపాయల వరకూ క్యాష్ సిద్ధంగా ఉంటుందంటూ రేవంత్ రెడ్డి తన మార్క్ చమత్కారంతో తేల్చిచెప్పేశారు. ఇది విన్న ఆర్థిక నిపుణులు సైతం.. ‘అబ్బో ఇలాంటి క్రైసిస్ మెనేజ్ మెంట్ ప్లాన్ మనకెందుకు తట్టలేదురా బాబోయ్ ’ అని ముక్కున వేలేసుకుంటున్నారు.

మాటలతోనే సరిపెడితే ఆయన రేవంత్ ఎందుకు అవుతాడు.. పొలిటికల్ కోటా కింద యాదవులకు వరాలు ఇచ్చేశాడు. ‘అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ, నవీన్ యాదవ్ కు ఎమ్మెల్యే, ఈశ్వరమ్మకు యాదగిరి గుట్ట బోర్డు పదవులు ఇచ్చామని లెక్కలతో సహా చెప్పిన సీఎం రేవంత్ యాదవులను కుషీ చేశారు. రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికన యాదవుల కోటా వారికి ఇస్తామని హామీ ఇచ్చారు. కులగణనలో ఇప్పటికే రేవంత్ డెమో చూపించారు.. ఇప్పుడు కుల సంఘాలకు కోటా ప్రకారం తేల్చేస్తున్నారన్న మాట..

ఓపక్క సదర్ దున్నపోతుల విన్యాసాలు.. మరోపక్క సీఎం కోట్ల కామెంట్లు సదర్ పండుగను మరింత జోష్ లో నింపాయి. భవిష్యత్తులో లోన్ కావాల్సిన వాళ్లంతా బ్యాంకుల చుట్టూ కాకుండా నేరుగా యాదవుల ఇళ్ల ముందు క్యూకట్టేలా రేవంత్ కామెంట్లు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.



RBI బంద్ అయినా యాదవులకు ఢోకా లేదు: సీఎం రేవంత్ హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకమని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి రూ.5 కోట్లు కేటాయించామన్నారు. యాదవుల్లో చాలామంది కోటీశ్వరులంటూ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. #RevanthReddy #SadarSammelan #RBI #Telangana #Hyderabad #TeluguNews #Tupaki Follow👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 4, 2026


Tags:    
  • revanthreddy 
  • yadavacommunity 
  • sadarfestival 
  • sadarutsav 
  • hyderabad 

Similar News

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

మాకంటే మాకే.. గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ సీట్లపై క‌ర్చీఫ్‌లు!

2026-11-01 12:16 GMT

హైదరాబాద్ హోటళ్లలో డేంజర్ ఫుడ్.. 14 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్!

2026-11-01 06:58 GMT

ఒక్క వానకే హైదరాబాద్ చెరువుల కళకళ.. హైడ్రా శ్రమకు దక్కిన సార్థకత..

2026-10-30 17:11 GMT

హైదరాబాద్‌లో అప్పుడే నీటి ట్యాంకర్లకు భారీ డిమాండ్.. వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉండబోతోంది?

2026-10-26 04:32 GMT

ఎల్ నినో ఎఫెక్ట్....రేవంత్ సర్కార్ కు జనసేన దిశా నిర్దేశం !

2026-10-25 14:42 GMT

కాలం కలిసి వస్తే 2028లో నేనే సీఎం.. ఓపెన్ అయిపోయిన మహేష్ కుమార్ గౌడ్

2026-10-23 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS