• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Telangana >  Hyderabad >  రేవంత్ గెలవడని కేటీఆర్...

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

| తెలంగాణ రాజకీయాల్లో అధికారం చేతులు మారకుండానే కొండంత ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ పని అయిపోయిందని.. రేవంత్ మళ్లీ గెలవడని డిసైడ్ చేసేశాడు.

By - Tupaki Desk
Update: 2026-11-04 13:10 GMT

తెలంగాణ రాజకీయాల్లో అధికారం చేతులు మారకుండానే కొండంత ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ పని అయిపోయిందని.. రేవంత్ మళ్లీ గెలవడని డిసైడ్ చేసేశాడు. ఆ ధీమాతోనే ఏకంగా రేవంత్ అమ్మే భూములను కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల లేమీతో కొట్టుమిట్టాడుతోంది. పథకాలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం నుంచి నీటి ఎత్తిపోతలు చేయక కేసీఆర్ ను విలన్ గా చూపించిన సీఎం రేవంత్ రాజకీయంగా సక్సెస్ అయినా.. తెలంగాణలోని ప్రాజెక్టులను ఎండబెట్టి కరువు తీసుకొచ్చారని ప్రచారాన్ని బీఆర్ఎస్ భారీ ఎత్తున చేసి సక్సెస్ అయ్యింది. సాగు, తాగునీటి కొరతతో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పై తెలంగాణ ప్రజానీకం.. ముఖ్యంగా రైతుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోందని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.

ఇలాంటి సమయంలో పుండుమీద కారం చల్లినట్టు కేటీఆర్ చేస్తున్న హెచ్చరికలు కాంగ్రెస్ తో కలిసి సాగే పారిశ్రామికవేత్తల్లోనూ భయాన్ని నింపుతున్నాయి. అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందటి మియాపూర్ 550 ఎకరాలు సుప్రీంకోర్టులో గెలిచి రేవంత్ సర్కార్ కు కొండంత ఆర్థికబలాన్ని ఇచ్చాయి. ఆ భూములు అమ్మేసి తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి చేద్దామని రేవంత్ ప్లాన్లు చేస్తున్నాడు.

కానీ కొట్లాడింది బీఆర్ఎస్ అని.. మియాపూర్ భూములు అమ్మితే ఊరుకునేది లేదని.. కొన్న  పారిశ్రామికవేత్తల నుంచి రికవరీ చేస్తామంటూ కేటీఆర్ చేసిన హెచ్చరిక కలకలం రేపుతోంది. దీంతో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తెలంగాణలో ఈ భూములు కొనేందుకు ఉత్సాహంగా ఉన్న పారిశ్రామికవేత్తల ముందరికాళ్లకు బంధం వేసేలా కేటీఆర్ కామెంట్స్ కాకరేపుతున్నాయి..

తాజాగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ మియాపూర్ భూములను పంచిపెట్టేశారు. మియాపూర్ లోని మొత్తం 550 ఎకరాల్లో 200 ఎకరాలు పేదల ఇళ్లకు, 100 ఎకరాలు అమరవీరులకు, మరో 100 ఎకరాలు ఉద్యమకారులకు కేటాయించండి.. మిగిలిన భూమిలో పాఠశాలలు, కాలేజీలు కడితే మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం’ అని రేవంత్ కు అల్టిమేటం జారీ చేశారు.

అంతేకాదు.. ఏడాదిలోపే కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని.. తమ ప్రభుత్వం వచ్చాక అమ్మిన ఈ భూములను కొన్న పారిశ్రామికవేత్తల నుంచి రికవరీ చేస్తామనడంతో ఈ వివాదం చెలరేగింది. మరి కేటీఆర్ వార్నింగ్ తో రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? అమ్మి సొమ్ము చేస్తుందా? ఈ మియాపూర్ భూములను ఏం చేయనుందన్నది హాట్ టాపిక్ గా మారింది.

Tags:    
  • ktr 
  • revanthreddy 
  • miyapurlands 
  • brs 
  • congress 
  • telanganapolitics 

Similar News

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

మాకంటే మాకే.. గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ సీట్లపై క‌ర్చీఫ్‌లు!

2026-11-01 12:16 GMT

హైదరాబాద్ హోటళ్లలో డేంజర్ ఫుడ్.. 14 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్!

2026-11-01 06:58 GMT

ఒక్క వానకే హైదరాబాద్ చెరువుల కళకళ.. హైడ్రా శ్రమకు దక్కిన సార్థకత..

2026-10-30 17:11 GMT

హైదరాబాద్‌లో అప్పుడే నీటి ట్యాంకర్లకు భారీ డిమాండ్.. వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉండబోతోంది?

2026-10-26 04:32 GMT

ఎల్ నినో ఎఫెక్ట్....రేవంత్ సర్కార్ కు జనసేన దిశా నిర్దేశం !

2026-10-25 14:42 GMT

కాలం కలిసి వస్తే 2028లో నేనే సీఎం.. ఓపెన్ అయిపోయిన మహేష్ కుమార్ గౌడ్

2026-10-23 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS