• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  Hyderabad >  ‘‘అండాలు ఇస్తే రూ. 50...

‘‘అండాలు ఇస్తే రూ. 50 వేలు’’ హైదరాబాద్ లో దారుణం, తండ్రి చికిత్స కోసం వచ్చి ఇరుక్కుపోయిన యువతి

| తండ్రి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం డబ్బు సమకూర్చాలనుకున్న కోల్‌కతాకు చెందిన 25 ఏళ్ల యువతి హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ ముఠా వలలో చిక్కుకుంది. రూ.50 వేలు ఇస్తామంటూ ఆశ చూపి, బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ రాకెట్‌లో దేశవ్యాప్తంగా 43 మందికి పైగా మహిళలు బాధితులుగా ఉన్నట్లు గుర్తించారు. పలు ఫర్టిలిటీ కేంద్రాలు, ఆసుపత్రులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By - Tupaki Political Desk
Update: 2026-11-15 20:24 GMT

మనుషుల నిస్సహాయత, పేదరికాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు సాగిస్తున్న దందాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో చెప్పడానికి హైదరాబాద్‌లో తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఒక నిదర్శనం. కన్నతండ్రి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక యువతి తన ఆరోగ్యాన్ని, భవిష్యత్తును పణంగా పెట్టిన వైనం కన్నీరు పెట్టిస్తుంది. మానవత్వాన్ని మంటగలుపుతున్న ఈ ఘటన వెనుక ఒక పక్కా ప్లాన్ జరుగుతున్న నేరం ఒళ్లు గగుర్పాటునకు గురిచేస్తోంది. హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన 25 ఏళ్ల యువతి కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆమె తల్లి రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, నలుగురు తోబుట్టువులు చదువుకుంటున్నారు. ఈ తరుణంలో ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయన ప్రాణాలను నిలబెట్టాలంటే అత్యవసరంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తేల్చి చెప్పారు.

వైద్య ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబం ఇప్పటికే సుమారు రూ. 3.5 లక్షలు అప్పు చేసింది. ఆ తర్వాత కూడా వైద్యం కోసం డబ్బు సరిపోకపోగా, అప్పులు ఇచ్చిన స్థానిక వడ్డీ వ్యాపారులు ఇంటికి వచ్చి తీవ్రస్థాయిలో వేధించడం మొదలుపెట్టారు. రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడితో ఆ కుటుంబానికి ఏం చేయాలో పాలుపోని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ కష్టాల నుంచి ఎలాగైనా బయటపడాలని ఆలోచిస్తున్న సమయంలో హైదరాబాద్‌లో అండాలు దానం చేస్తే రూ. 50 వేలు ఇస్తామంటూ కొందరు వ్యక్తులు ఆ యువతిని సంప్రదించారు. కన్న తండ్రి వైద్యం కోసం ఎలాగైనా డబ్బు సమకూర్చాలన్న ఆశతో ఆ యువతి ఆ మాటలు నమ్మి హైదరాబాద్‌కు పయణమైంది.

అయితే, అండాల విక్రయం చట్టవిరుద్ధమనే విషయం తనకు అసలు తెలియదని, తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా కుటుంబాన్ని గట్టెక్కించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. హైదరాబాద్‌కు చేరుకున్న ఆ యువతిని కొన్ని హాస్టళ్లు, విల్లాల్లో ఉంచి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ అండాల సేకరణ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తన ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌లను కూడా ఏజెంట్లు స్వాధీనం చేసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

బట్టబయలైన భారీ రాకెట్

హైదరాబాద్ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ అండాల సేకరణ దందా పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది. నిరుపేద మహిళల ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని నడుపుతున్న ఈ నెట్‌వర్క్‌పై పోలీసులు నిఘా పెట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న పలు ఫర్టిలిటీ కేంద్రాలు, ఆసుపత్రులపై కూడా అధికారులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. ఈ దందాలో కేవలం కోల్‌కతా యువతే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 43 మందికి పైగా మహిళలు బాధితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన మరో యువతి భర్త ప్రమాదంలో మంచానికే పరిమితం కావడం, కుటుంబ బాధ్యతలు తనపై ఉండటంతో ఉపాధి కోసం వచ్చి ఈ ఊబిలో చిక్కుకున్నట్లు వాపోయింది.

కన్నీటి మధ్యే గడిచిన పండుగలు

ప్రస్తుతం రెస్క్యూ హోమ్స్‌లో ఆశ్రయం పొందుతున్న ఈ బాధితులు తమ కుటుంబాలను తలచుకుని రోజూ కన్నీరుమున్నీరవుతున్నారు. దీపావళి పండుగను సైతం తాము కన్నీళ్ల మధ్యే గడపాల్సి వచ్చిందని, కనీసం ఛఠ్ పూజ నాటికైనా తమను ఇళ్లకు పంపాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. అయితే కేసు దర్యాప్తు కొనసాగుతుండటం, నిందితులు పూర్తిగా పట్టుబడాల్సి ఉండటంతో వారికి రక్షణ కల్పించే ఉద్దేశంతో అధికారులు వెంటనే సొంతూళ్లకు పంపేందుకు నిరాకరిస్తున్నారు. నిరుపేద మహిళల అమాయకత్వాన్ని, వారి కుటుంబాల ఆపత్కర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ దందా సమాజంలో నెలకొన్న ఆర్థిక అసమానతలకు, మానవతా విలువలు మరుగునపడుతున్న తీరుకు అద్దం పడుతోంది.

Tags:    
  • hyderabad 
  • eggd onation 
  • eggretrieval 
  • illegalracket 
  • womenexploitation 

Similar News

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

నాగార్జునకు భారీ లబ్ది...ఈటల సంచలన వ్యాఖ్యలు!

2026-11-14 16:43 GMT

కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు

2026-11-14 10:44 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో బిగ్ ట్విస్ట్.. రేవంత్ హింట్

2026-11-14 03:20 GMT

హైడ్రా రంగనాథ్ మీద నాగ్ పొగడ్తల వర్షం...మ్యాటర్ ఇదే !

2026-11-12 02:22 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

హైదరాబాద్‌లో 'వర్క్ ఫ్రమ్ పార్క్'.. ఐటీ ఉద్యోగులకు నిజంగా ఎంతవరకు ఉపయోగం?

2026-11-08 06:32 GMT

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

2026-11-07 02:27 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

Copyright @2026

Powered by Blink CMS