• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  Hyderabad >  హైడ్రా రంగనాథ్ మీద నాగ్...

హైడ్రా రంగనాథ్ మీద నాగ్ పొగడ్తల వర్షం...మ్యాటర్ ఇదే !

| ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సమయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనకు వివరాలు ప్రశాంతంగా చెప్పి ఒప్పించారని నాగార్జున వెల్లడించారు. తుమ్మిడికుంట చెరువు పునరుద్ధరణపై సంతోషం వ్యక్తం చేస్తూ, హైదరాబాద్‌లోని 2,000 చెరువులను పునరుద్ధరించాలని కోరారు. ఇకపై అక్కడ సినిమాలు షూట్ చేస్తానన్నారు.

By - Satya P
Update: 2026-11-12 02:22 GMT

హైడ్రా కమిషనర్ రంగనాధ్ అంటే అందరికీ తెలిసిందే. కబ్జాలు చేసిన వారికి సింహ స్వప్నంగా మెలిగారు. చెరువులు గుంటలు ఆక్రమించుకున్న చోట రాత్రికి రాత్రే కూల్చేశారు. దురాక్రమదారులకు సింహస్వప్నంగా నిలిచారు. ఈ క్రమంలో హైదరాబాద్ మాదాపూర్‌లోని సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు ఇప్పటికి రెండేళ్ళ క్రిందట కూల్చివేశారు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా అధికారులు ఆనాడు పేర్కొన్నారు. అలా చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో సుమారు 1.12 ఎకరాలు బఫర్ జోన్‌లో మరో 2 ఎకరాల మేర అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆనాడు ఈ విషయం మీద నాగార్జున హైకోర్టు దాకా వెళ్ళారు. ఒక సమయంలో హైడ్రా వర్సెస్ నాగార్జున అన్నట్లుగా కధ సాగింది.

రంగనాధ్ గ్రేట్ అంటూ :

కట్ చేస్తే ఇపుడు అదే హైడ్రా రంగనాధ్ గ్రేట్ అంటూ హీరో నాగార్జున పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఆక్రమణలను తొలగించి తుమ్మిడి కుంట చెరువును సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో హైడ్రా పునరుద్ధరించింది. ఇక ఈ చెరువు ప్రారంభోత్సవ కారక్రమానికి ప్రత్యేకంగా నాగార్జునకు ఆహ్వానం కాంగ్రెస్ ప్రభుత్వ నుంచి అందడం విశేషం. అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన పునరుద్ధరించిన తుమ్మిడి కుంట చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగార్జునను ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జునకు ప్రభుత్వం తరఫున సన్మానం జరిగింది. ఇక నాగార్జున మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలకు మద్దతు తెలపడం ఇక్కడ విశేషం. అంతే కాదు ప్రత్యేకించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు.

అలా కన్విన్స్ చేశారు :

తాను ఎన్ కన్వెషన్ విషయంలో రంగనాధ్ ని కలిశాను అని ఆయన చాలా కూల్ గా ఆ సమయంలో తనకు ఎన్నో వివరించారు అని నాగార్జున చెప్పారు. దాంతో తాను ఏ ఆలోచనతో అక్కడికి వెళ్లానో అవన్నీ ఆగిపోయాయి అన్నారు. రంగనాధ్ కి ఎంతో ఓపిక ఉందని అన్నారు. ఆయన చెప్పగానే సిటీ కోసం మనది ఇది కదా చేయాలి అని భావించి సహాయం చేశాం అని నాగార్జున అన్నారు. అలా ప్రభుత్వం చేపట్టే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చాను అని అన్నారు.

ఎంత బ్యూటీఫుల్ గా ఉందో :

తనకు తుమ్మిడికుంట చెరువు అంతా తెలుసు అని ఎంత బ్యూటీఫుల్ గా చేశారు అని ప్రశంసించారు. హైదరాబాద్ లో ఎన్నో చెరువులు ఉన్నాయని వాటిలో చెత్తా చెదారం అందులో వేయడాన్ని చూసి ఎంతో బాధపడే వాడిని అని నాగార్జున అన్నారు. విదేశాలకు తాను వెళ్ళినపుడు అక్కడ లేక్స్ చూసి హైదరాబాద్ లో ఎపుడు ఇలా అవుతుందని అనుకునేవాడిని అని నాగార్జున అన్నారు. ఈ తుమ్మిడి కుంట చూసినపుడు ఇపుడు ఇది ఉంది కదా అని ఆనందం వేస్తోంది అని నాగార్జున అన్నారు. ఇక తుమ్మిడికుంట చెరువు ప్రాంతంలో తన సినిమా షూటింగులు చేస్తాను అన్నారు.

రేవంత్ గారూ చేయండి :

ఇక హైదరాబాద్ లో రెండు వేల చెరువులు ఉన్నాయి వాటిని కూడా ఇలాగే అభివృద్ధి చేయాలని నాగార్జున కోరారు. అదే కనుక జరిగితే హైదరాబాద్ 42 టీఎంసీ నీరు ఈజీగా వస్తుంది అని నాగార్జున చెప్పారు. మొత్తానికి నాగార్జున తన స్పీచ్ తో అలరించారు. నాగార్జున మాట్లాడుతున్నప్పుడు జనాల నుంచి కూడా మంచి స్పందన లభించింది.

లేక్స్ అండ్ రాక్స్ సిటీ :

హైదరాబాద్ ని లేక్స్ అండ్ రాక్స్ సిటీగా చెబుతారు. అలాంటి నగరంలో ఎన్నో చెరువులు ఆక్రమణకు గురి అయ్యాయని రేవంత్ రెడ్డి చెప్పారు. మినీ ట్యాంక్ బండ్ సైజిలో ఉన్న చెరువులు కబ్జా కోరలలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయని అన్నారు. 1372 చెరువులు ఉంటే అందులో సగానికి పైగా ఆక్రమించేశారని రేవంత్ అన్నారు. చెరువులు కబ్జా చేస్తే అవి మన జీవితాలను కబ్జా చేస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. వర్షం నీరు రోడ్ల పైకి ఎందుకు వస్తుందో అంతా ఆలోచించాలి. అందుకే తమ ప్రభుత్వం ఎన్నో చెరువులను అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. హైదరాబాద్ సిటీని కాపాడుకునే బాధ్యత ప్రజలదే అని ఆయన చెప్పారు. నాగార్జున ప్రభుత్వానికి సహకరించారు అభివృద్ధిలో భాగం అయ్యారు కాబట్టి ఆయనకు సన్మానం చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు.


Tags:    
  • nagarjuna 
  • nconvention 
  • hydraa 
  • ranganath 
  • thummidikuntalake 
  • revanthreddy 

Similar News

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

‘‘అండాలు ఇస్తే రూ. 50 వేలు’’ హైదరాబాద్ లో దారుణం, తండ్రి చికిత్స కోసం వచ్చి ఇరుక్కుపోయిన యువతి

2026-11-15 20:24 GMT

నాగార్జునకు భారీ లబ్ది...ఈటల సంచలన వ్యాఖ్యలు!

2026-11-14 16:43 GMT

కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు

2026-11-14 10:44 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో బిగ్ ట్విస్ట్.. రేవంత్ హింట్

2026-11-14 03:20 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

హైదరాబాద్‌లో 'వర్క్ ఫ్రమ్ పార్క్'.. ఐటీ ఉద్యోగులకు నిజంగా ఎంతవరకు ఉపయోగం?

2026-11-08 06:32 GMT

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

2026-11-07 02:27 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

Copyright @2026

Powered by Blink CMS