• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Health >  క్యాన్సర్ నుంచి...

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

| వచ్చే పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులకు ఏఐతో మెరుగైన చికిత్సలు అందుబాటులోకి రావచ్చని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ అంచనా వేశారు. కొత్త మందుల తయారీ, వ్యాధులను ముందుగానే గుర్తించడంలో ఏఐ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. అయితే మందుల పనితీరును నిర్ధారించేందుకు క్లినికల్ ట్రయల్స్ తప్పనిసరి.

By - A.N.Kumar
Update: 2026-11-11 12:15 GMT

ఏఐతో జాబులు పోతున్నాయి.. కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి.. అందరూ రోడ్డున పడుతున్నారు.. సూపర్ ఏఐతో ప్రపంచానికి వినాశనం అంటూ అన్నీ డేంజర్ బెల్స్ లాంటి వార్తలే ఇన్నాళ్లు వింటున్నాం.. కానీ ఏఐతో కొన్ని కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. అవి భవిష్యత్తులో అద్భుతాలకు నాంది పలకబోతున్నాయి. ఇది నిజంగా ఒక అద్భుతమైన వార్తనే.. ఏఐతో ఉపద్రవాలే కాదు..కొన్ని మంచి పనులు కూడా జరుగబోతున్నాయన్న విషయం తాజాగా బయటపడింది.

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ దాకా.. పదేళ్లలో జబ్బులన్నీ మాయమట.. ఎంత హ్యాపీ న్యూస్.. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ గారి జోస్యం వింటుంటే.. రాబోయే కాలంలో డాక్టర్లు, హాస్పిటల్స్ కూడా బోర్డులు తిప్పేసి ఏకంగా మందుల షాపుల ముందు 'ఫ్రీ గాలి పీల్చుకోండి' బోర్డులు పెట్టుకోవాల్సి వస్తుందేమోననిపిస్తోంది. ఏఐ పుణ్యమా అని వచ్చే దశాబ్దంలో ప్రాణాంతక వ్యాధులన్నీ పరార్ అయిపోతాయట. మరి ఈ అంచనాల వెనుక అసలు కథేంటి? టెక్ గురూల మాటలు నమ్మి మనం మురిసిపోవచ్చా? లేదా మన హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్స్ ఆపేయాలా? అన్నది మీరు బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోండి సుమా..

మామూలుగా అయితే ఒక కొత్త బిళ్ల మార్కెట్లోకి రావాలంటే శాస్త్రవేత్తల తలప్రాణం తోకకొస్తుంది. వేల రసాయనాలను కలిపి ప్రయోగాలు చేసి ఏళ్ల తరబడి పరిశోధనలు చేయాలి. ఇదంతా ఒక పెద్ద మహాభారతం. కానీ మన ఏఐ మాత్రం ఈ కొండంత పనులను క్షణాల్లో చిటికెలో చేసేస్తుందట. వేలాది రిసెర్చ్ పేపర్లు.. జన్యు సమాచారాన్ని ఇట్టే జల్లెడపట్టి.. కొత్త మందుల డిజైన్లను టక్కున బయటపెడుతుంది. చూడబోతే రాబోయే రోజుల్లో ల్యాబ్‌లలో శాస్త్రవేత్తల కంటే కంప్యూటర్లే ఎక్కువ ముఖం మాడ్చుకుని కూర్చునేలా ఉన్నాయి..

క్యాన్సర్ లాంటి మహమ్మారిపై కూడా ఏఐ దండయాత్ర మొదలుపెట్టేసిందట. క్యాన్సర్‌కు ఒకటే మందు ఉండదు.. ఎందుకంటే దాని వేషాలు వంద రకాలు.. ఏ రోగికి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో ఏై చిటికెలో పసిగట్టేసి పర్సనలైజ్డ్ చికిత్స అందిస్తుందట.. ఇక మతిమరుపు తెచ్చే అల్జీమర్స్.. ప్రాణాలు తీసే గుండె జబ్బులను కూడా ముందుగానే పట్టుకుని 'బొగ్గు' చేసేస్తామని టెక్ నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలకైతే డేటా చదివి మరీ కౌన్సిలింగ్ ఇస్తుందట...

అయితే అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది.. ఏఐ ఎంత 'అల్లరి' చేసినా.. అది సూచించిన మందులు నిజంగా పనిచేస్తాయా లేదా అని తేలాలంటే క్లినికల్ ట్రయల్స్ తప్పవు. రోగి బాడీ దాన్ని అక్సెప్ట్ చేస్తుందా? సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అనేది కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించదుగా... పైగా మానసిక ఆరోగ్యం అనేది కేవలం డేటాతో ముడిపడిన సబ్జెక్ట్ కాదు.. మనుషుల భావోద్వేగాలు.. కష్టాలు అల్గారిథమ్‌లకు ఏపాటి అర్ధమవుతాయి? డాక్టర్ల స్థానాన్ని ఏ టెక్కీ సాఫ్ట్‌వేర్ కూడా పూర్తిగా భర్తీ చేయలేదు.

అందుకే ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ అద్భుతాల గారి అంచనాలు భవిష్యత్తుపై కాస్త ఆశలు రేపుతున్నా.. 2036 నాటికి ప్రపంచమంతా రోగ విముక్తి అయిపోతుందని మాత్రం నమ్మేయలేం. ఒకవేళ నిజంగానే ఇవన్నీ జరిగితే మంచిదే కానీ.. ఆ టెక్ ట్రీట్మెంట్లు సామాన్యుడికి అందుతాయా? లేక సంపన్నుల కోటలకే పరిమితమవుతాయా అనేది అసలు ప్రశ్న. రాబోయే పదేళ్లు వైద్య రంగానికి మాత్రమే కాదు.. మన 'అటెన్షన్ స్పాన్'కు కూడా బిగ్ టెస్ట్ లాంటివే..



Dario’s concluding pitch in the Anthropic IPO roadshow video that dropped today: “If today we look at things like cancer, Alzheimer’s, heart disease, mental illness. These will be relics of the past in. I think, less than a decade." I believe that the company which gets the risks right will also be the company that has the license to operate that society trusts and society believes can build the benefits in the right way. I think if we do this right, we can create an age of miracles where humanity is able to solve problems that have eluded us for millennia. We have to make sure that all the risks, all the ways that things can go wrong with this technology, we very carefully address those risks as we bring the benefits, and as we have a viable business at the same time. I invite you to join us on the next phase of this journey.”

— Bearly AI (@bearlyai) November 10, 2026


Tags:    
  • artificialintelligence 
  • aihealthcare 
  • darioamodei 
  • anthropic 
  • cancerresearch 

Similar News

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

2026-11-09 10:56 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

ప్రపంచంపైకి మరో వైరస్.. అప్రమత్తతే శ్రీరామరక్ష

2026-10-30 05:23 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

2026-10-27 11:22 GMT

పరుగుల జీవితంలో మానసిక కల్లోలం!

2026-10-15 13:12 GMT

హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా A !

2026-10-13 07:16 GMT

మాన‌వ మెద‌డు ర‌హ‌స్యాల‌ను డీకోడ్ చేసిన సంచ‌ల‌న ప‌రిశోధ‌న‌!

2026-10-10 17:27 GMT

దూరాలు పెరుగుతున్నాయి.. ఒంటరి అవుతున్న మనిషి

2026-10-10 16:58 GMT

Copyright @2026

Powered by Blink CMS