• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Technology >  ఇప్పటికింకా నా వయసు నిండా...

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

| ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల వయసును గుర్తించేందుకు మెటా కొత్త ఏఐ టెక్నాలజీని తీసుకొస్తోంది. యూజర్లు పెట్టే పోస్టులు, కామెంట్లు, ఫొటోలను విశ్లేషించి 13-17 ఏళ్ల వారిని గుర్తించనుంది. వారి ఖాతాలను ఆటోమేటిక్‌గా ప్రైవేట్‌గా మార్చి, అపరిచితుల మెసేజ్‌లపై ఆంక్షలు విధించనుంది. అయితే ఏఐ తప్పుగా వయసును అంచనా వేస్తే ఇబ్బందులు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

By - A.N.Kumar
Update: 2026-11-11 09:38 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18 అంటూ ఇన్ స్టాగ్రామ్ లో వయసును పెంచి రెచ్చిపోదామంటే ఇన్ స్టాగ్రామ్ అస్సలు ఊరుకోదు.. "నా వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే" అని బిల్డప్ ఇచ్చే బాపతుకు మెటా ఏఐ పెద్ద షాకే ఇచ్చింది. ప్రొఫైల్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా పెట్టుకో.. నీ ప్రవర్తన చూసి నువ్వు టీనేజర్‌వో.. కాదో మేమే తేలుస్తామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లోకి కొత్త ఏఐ నిఘా టెక్నాలజీని రంగంలోకి దించుతోంది మెటా... మనం సోషల్ మీడియాలో పెట్టే ప్రతి ఫొటో.. రాసే ప్రతి కామెంట్ మన వ్యక్తిగత భావాలకు నిదర్శనం అనుకుంటే పొరపాటే. ఇకపై అవన్నీ మన వయసును బయటపెట్టే ఆధారాలుగా మారబోతున్నాయి..

ఇన్నాళ్లూ కుర్రకారు 18 ఏళ్లు నిండకపోయినా.. ఖాతా తెరిచేటప్పుడు *నేను పెద్దవాడినే‘ అని డేట్ ఆఫ్ బర్త్ మార్చేసి ఎంజాయ్ చేసేవారు. ఈ ఘనుల ఎత్తుగడలకు పైఎత్తు వేస్తూ మెటా కొత్త విశ్లేషణ పద్ధతిని తెచ్చింది. యూజర్లు రాసే పోస్టులు.. స్కూల్ గ్రేడ్ల మాటలు.. బర్త్‌డే వేడుకలు.. ఫొటోలలోని లక్షణాలు.. చివరికి రాసే పిచ్చిపిచ్చి క్యాప్షన్లు.. కామెంట్లను కూడా ఏఐ క్షుణ్ణంగా పరిశీలిస్తుందట.. అంటే ఇకపై మీరు పెట్టిన రీల్ లేదా కామెంట్ ఆధారంగా "బాబు.. నీ వయసు 16 మాత్రమే, వెళ్ళి చదువుకో" అని ఇన్‌స్టాగ్రామ్ పరోక్షంగా చెప్పేస్తుందన్నమాట... అయితే ఇదేదో ఫేషియల్ రికగ్నిషన్ కాదని.. మీ ముఖాలను గుచ్చి గుచ్చి చూడమని మెటా బాహాటంగానే చెప్తోంది. కానీ ఫొటోల్లో కనిపించే భౌతిక లక్షణాలను మాత్రం విశ్లేషిస్తారట. తేడా ఏంటో ఆ దేవుడికే తెలియాలి..

ఈ ప్రయోగం వల్ల 13 నుండి 17 ఏళ్ల పిల్లల అకౌంట్లు అటోమేటిక్‌గా ప్రైవేట్ అయిపోతాయి.. అపరిచిత మెసేజ్‌లపై ఆంక్షలు పడతాయి. ఇది పిల్లల భద్రతకు మంచిదే కాదనలేం... కానీ అసలు పంచాయితీ ఇక్కడే మొదలవుతుంది.. ఏఐ అల్గారిథమ్ ఏమాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు.

బాగా గడ్డం పెంచి.. డిఫరెంట్ లుక్‌లో ఫొటోలు పెట్టే 30 ఏళ్ల కుర్రాడిని.. స్కూల్ జ్ఞాపకాలు నెమరువేసుకునే ఒక 40 ఏళ్ల వ్యక్తిని ఏఐ గనుక తప్పుగా అర్థం చేసుకుని 'టీనేజర్' కింద వర్గీకరిస్తే.. వారి అకౌంట్లు కూడా ప్రైవేట్ అయిపోయి.. సెన్సిటివ్ కంటెంట్ రాకుండా ఫిల్టర్లు పడిపోతాయి.. ఆ తర్వాత అయ్యా.. నేను పెద్దవాడినే.. నాకు పెళ్లయింది.. పిల్లలు కూడా ఉన్నారని మెటాకి నిరూపించుకోవడానికి ఆ యూజర్ ఏ ఆఫీసు చుట్టూ తిరగాలో ఆలోచిస్తేనే నవ్వొస్తోంది.

పిల్లలను ఆన్‌లైన్ వేధింపుల నుంచి కాపాడటం స్వాగతించాల్సిన విషయమే. కానీ దానికోసం మనం రోజూ చేసే ప్రతి పోస్టు.. ఫ్రెండ్స్‌తో జరిపే ప్రైవేట్ ముచ్చట్లు.. చేసే కామెంట్లను నిరంతరం విశ్లేషించే హక్కును సోషల్ మీడియా సంస్థలకు ఇచ్చేస్తున్నామా? అనేది ఇక్కడ ప్రశ్న.

ప్రస్తుతానికి భారత్‌లో ఈ నిఘా పద్ధతి ఎప్పటి నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందో స్పష్టత లేదు. కానీ ఒక్కటైతే నిజం.. ఇప్పటివరకు మీ వయసెంత? అని ఇన్‌స్టాగ్రామ్ మనల్ని అడిగేది. ఇకపై ‘నీ వయసెంతో నాకు తెలుసులేవోయ్.. మూసుకుని కూర్చో’ అని మనల్ని కంట్రోల్ చేయబోతోంది. కాలం మారే కొద్దీ ఏఐ తెలివిమీరుతోంది.. యూజర్ల స్వేచ్ఛ మాత్రం మెటా చేతిలో నలిగిపోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    
  • instagram 
  • meta 
  • metaai 
  • instagramai 
  • agedetection 
  • teenaccounts 

Similar News

భార్యకు ద్రోహం చేశా.. NVIDIA ఉద్యోగులకు CEO జెన్సన్ హువాంగ్ క్షమాపణలు!

2026-11-09 09:20 GMT

ఇక మొబైల్ ఫోన్లకూ శాటిలైట్ సిగ్నల్.. ట్రాయ్ కీలక ప్రతిపాదనతో మారనున్న టెలికాం రంగం!

2026-11-07 02:11 GMT

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS