• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Technology >  సోషల్ మీడియా స్వేచ్ఛకు...

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

| సోషల్ మీడియా సంస్థలకు ఇప్పటివరకు ఉన్న ‘సేఫ్ హార్బర్’ చట్టపరమైన రక్షణ పరిధిని మార్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్‌ను ఆల్గారిథమ్‌ల ద్వారా వైరల్ చేసి ఆదాయం పొందుతున్న ప్లాట్‌ఫామ్‌లు కూడా తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల వ్యాప్తికి బాధ్యత వహించాలన్నది ప్రధాన చర్చ. అయితే ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉంది. సోషల్ మీడియా జవాబుదారీతనంతో పాటు ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు రక్షణ కల్పించడం కీలకం కానుంది.

By - A.N.Kumar
Update: 2026-11-06 05:47 GMT

చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయి. అన్నీ ఫోన్లో జరిగిపోతున్నాయి. పనుల నుంచి వివిధ అంశాలపై స్పందనలు.. ఆఖరుకు వైరల్ చేసే అంశాలన్నీ ఫోన్లోనే చకచకా సాగుతున్నాయి. ఇప్పుడు ఫోన్ నే ప్రపంచం.. అది లేనేదే మనిషికి ఏ పని జరగదు. అంతలా మనిషి జీవితంలో ఫోన్ ఒక భాగమైంది. అయితే ఫోన్ తో సోషల్ మీడియాలో విశృంఖలత్వం కూడా ఎక్కువైపోయింది. అది వివిధ దేశాల్లో జెన్ జీ ఆందోళనలకు, విధ్వంసాలకు కారణమవుతోంది. మన దేశాలోనూ కాక్రోచ్ ల ఉద్యమాలు చూశాం. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఒ పెను బాంబ్ అని చెప్పొచ్చు. సద్వినియోగం చేస్తే అందరికీ ఉపయోగం.. దుర్వినియోగం చేస్తే దానంత డేంజర్ మరొకటి ఉండదు.

ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తప్పుడు వీడియో పోస్ట్ చేశాడనుకోండి. అది క్షణాల్లో లక్షల మందికి చేరింది. ఆ వీడియోను ఎవరు సృష్టించారు? ఎవరు అప్‌లోడ్ చేశారు? అన్నది ఒక ఎత్తయితే.. దాన్ని కోట్లాది మందికి చేరేలా చేసిన సోషల్ మీడియా సంస్థల బాధ్యత ఎంత? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారుతోంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న ప్రతిపాదన డిజిటల్ ప్రపంచంలో కొత్త చర్చకు తెరలేపింది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలకు ఇప్పటివరకు ఉన్న చట్టపరమైన రక్షణను తొలగించే అంశాన్ని కేంద్రంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇది ఇంకా పరిశీలన దశలోనే ఉంది. తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే మాత్రం సోషల్ మీడియా సంస్థల పనితీరుతో పాటు వినియోగదారుల ఆన్‌లైన్ స్వేచ్ఛపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కంటెంట్ ను సృష్టించేది సామాన్య యూజర్లు.. దాన్ని వైరల్ చేసేది ఫ్లాట్ ఫామ్స్.. దాని ద్వారా ఆదాయం పొందేది కూడా ఆయా సోషల్ మీడియా సంస్థలే. ఒక వీడియోకు ఎక్కువ వ్యూస్ వస్తే.. దానికి మరింత ప్రాధాన్యత ఇచ్చి లక్షలాది మందికి చేరుస్తున్నాయి. అలా అల్గారిథమ్ ను మార్చేసి కంటెంట్ ను వైరల్ చేసి అంతిమంగా పెద్ద ఉద్యమంగా.. హాట్ టాపిక్ గా.. ఆందోళనకు దారితీసేలా చేసి దేశాల్లో శాంతి భద్రతల సమస్యలకు సంస్థలు కారణమవుతున్నాయన్న చర్చ సాగుతోంది.

ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000లోని సెక్షన్ 79 ప్రకారం సోషల్ మీడియా సంస్థలకు 'సేఫ్ హార్బర్' రక్షణ ఉంది. అంటే యూజర్లు అప్‌లోడ్ చేసే ప్రతి కంటెంట్‌కు ప్లాట్‌ఫామ్‌లను ఆటోమేటిక్‌గా బాధ్యులుగా చేయలేరు. అయితే ఈ రక్షణకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. చట్టబద్ధమైన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం.. నిర్దేశించిన జాగ్రత్తలు పాటించడం వంటి బాధ్యతలను సంస్థలు నెరవేర్చాలి. ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదనలో ఈ రక్షణ పరిధిని మార్చే అంశం కీలకంగా మారింది. ముఖ్యంగా ఆల్గారిథమ్‌ల ద్వారా కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేసిన సందర్భాల్లో ప్లాట్‌ఫామ్‌లను బాధ్యులుగా చేసేలా కేంద్రం తాజాగా సవరణలు చేయడానికి రెడీ అయ్యింది.

తప్పుడు సమాచారం.. డీప్ ఫేక్ లు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆందోళనకు పురిగొల్పే కంటెంట్ ను ఖచ్చితంగా ఆయా సంస్థలు నిరోదించాలి. లేదంటే దేశం అల్లోకల్లోలం అవుతుంది. ఈ విషయంలో సోషల్ మీడియా సంస్థలకు బాధ్యత ఉండాలి. సోషల్ మీడియాకు జవాబుదారీతనం అవసరమే.. అదే సమయంలో ప్రజల గొంతుకు రక్షణ ఉండాలి.. సోషల్ మీడియాలో ప్రజల వాయిస్ వినిపించేలా చేయాలి. అప్పుడే ఇది సమన్వయంతో సాగుతుంది. ఈ విషయంలో కేంద్రం నిబంధనలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి రేపుతోంది.

Tags:    
  • socialmedia 
  • safeharbour 
  • itact 
  • digitalindia 
  • socialmediaregulation 

Similar News

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS