• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  చిరంజీవిది విలీనం.....

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

| వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ)ని ప్రకటించారు. 11-11-11 ముహూర్తంతో విజయవాడలో పార్టీని ప్రారంభించిన ఆయన, యువత, ఉద్యోగులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యమని తెలిపారు. జగన్‌తో అనుబంధం ముగిసిందని, ఆత్మగౌరవం కోసమే వైసీపీని వీడానని స్పష్టం చేశారు.

By - A.N.Kumar
Update: 2026-11-11 06:43 GMT

చిరంజీవి తిరుపతిలో సభ పెడితే ఏకంగా రాష్ట్రం నలుమూలల నుంచి 20 లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. దేశం దద్దరిల్లేలా సభను నిర్వహించి ప్రజారాజ్యం పార్టీ ఘనంగా లాంచ్ అయ్యింది. అంత జనసందోహంతో ఏ పార్టీ కూడా లాంచ్ అవ్వలేదు.. కానీ కట్ చేస్తే చిరంజీవిని రాజకీయంగా దెబ్బతీసి చాలా మంది నేతల విమర్శలు, సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలతో ప్రజారాజ్యం పార్టీ ఆ ఎన్నికల్లో ఏకంగా 18 శాతం ఓటు బ్యాంక్, సీట్లు వచ్చినా కూడా కాంగ్రెస్ లో విలీనం కాక తప్పని పరిస్థితి ఎదురైంది.

ఇప్పుడు ఏపీ తెరపైకి మరో కొత్త పార్టీ వచ్చింది. అదే వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించిన ‘పరివర్తన రాజనీతి పార్టీ’.. మరి అంచనాలు లేకుండా వస్తున్న ఈ పార్టీ ఏపీలో ఏ మేరకు ప్రభావితం చూపిస్తుంది. యువత, ఉద్యోగులు, బడుగు బలహీన వర్గాల వారిధిగా చెబుతున్న పార్టీని విజయసాయిరెడ్డి ఏ తీరాలకు చేరుస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో ఇన్నాళ్లు రెండు ప్రధాన పార్టీలుండేవి. ఒక రెడ్డి సామాజికవర్గానికి అంకితమైన వైసీపీ కాగా.. ఇంకొకటి బలమైన కమ్మ సామాజికవర్గం చేతుల్లోని టీడీపీ.. మధ్యలో కాపుల కోసం ప్రజారాజ్యం ఒకప్పుడు పుట్టి అంతర్థానమైంది. మళ్లీ జనసేనతో పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకొని సాగుతున్నారు. ఇక మధ్యలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు పొత్తులతో తమ సంసారాన్ని లాగిస్తున్నాయి.

అయితే తెలంగాణలోలాగా ఎక్కువ పార్టీలు ఏపీలో లేవు. అదైతే నిజం.. కానీ ఇప్పుడు ఏపీలోనూ కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఈ సంచలన అడుగు వేశారు. ఈరోజు తన కొత్త పార్టీని ప్రకటించారు. దాని పేరు ఏంటో తెలుసా? ‘పరివర్తన రాజనీతి పార్టీ’.. అంటే షార్ట్ గా ‘పీఆర్పీ’.. మన చిరంజీవి పెట్టిన ‘ప్రజారాజ్యం’ను పీఆర్పీ అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పీఆర్పీ మరో పేరుతో విజయసాయిరెడ్డి ప్రారంభించేశాడు.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పక్కా 11.11.11 లెక్క కుదిరేలా 11వ నెల 11 గంటల 11 నిమిషాల ముహూర్తం చూసుకొని విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటర్ వేదికగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. దశాబ్దాలుగా ఏపీలో నడుస్తున్న రెండు ప్రధాన పార్టీలు, రెండు కుటుంబాల ఆధిపత్య పోరుకు ముగింపు పలకడమే లక్ష్యంగా మూడో ప్రత్యామ్మాయంగా ఈ కొత్త పయనం ప్రారంభమవుతోంది. రాయలసీమ పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ పార్టీని స్థాపించబోతున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కుల, మత పిచ్చి రాజకీయాలను పూర్తిగా తిరస్కరిస్తూ అభివృద్ధి, ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండా.. యువత, బడుగు బలహీన వర్గాల కోసం ఈ పీఆర్పీ పెడుతున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించారు..

ఏపీలోని దుష్ట పాలకులకు, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ పార్టీని పెడుతున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్మాణంలో తాను భాగస్వామినని.. ఆ పార్టీని ఇటుక ఇటుక పేర్చి నిర్మించడంలో తన కృషి ఉందని విజయసాయి ప్రకటించారు. ఆ పార్టీ, నాయకుడు, కార్యకర్తల కోసం నిలబడ్డానని.. కానీ చివరకు తనకు దక్కింది ఏంటి? అని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. జగన్ గారితో అనుబంధం ముగిసిందని.. తాను ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చానని తెలిపారు. రాజకీయాల్లో విధేయత ఉండాలని.. కానీ అది బానిసత్వం కాదు అన్నది తన ఉద్దేశం అని తెలిపారు.

కరెంట్ కోతలు, తాగు సాగునీటి కష్టాలు లేని నవ ఏపీని నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రతీ ఎకరానికి రెండు పంటలు పండేలా సాగునీరు అందిస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతోపాటు చదువుల భారాన్ని తగ్గించి జెన్ జీ యువతకు 100 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్నారు. 80 ఏళ్లుగా నెరవేరని ప్రజల కలలను సాకారం చేస్తూ యువతనే రేపటి నాయకులుగా తీర్చిద్దడమే పార్టీ లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు రెండు బలమైన వ్యవస్థల మధ్య సాగిన పోరుకు.. విజయసాయిరెడ్డి తీసుకొస్తున్న ఈ 11-11-11 ముహూర్తం ఎలాంటి మలుపు తిప్పబోతోంది? జెన్ జీ తరాన్ని కలుపుకొని ఆయన వేస్తున్న ఈ అడుగులు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఎంతవరకు మారుస్తాయి అనేది ఇప్పుడు యావత్ ఏపీ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

చిరంజీవి రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కోలేక కాడి వదలేశాడు. మరి బలమైన శక్తుల మధ్య విజయసాయిరెడ్డి నిలబడగలరా? రెడ్డి, కమ్మ, కాపులంటూ విడిపోయిన ఏపీ సమాజంలో యువతను, జెన్ జీలను, బడుగు బలహీనవర్గాలు, జనాకర్షక పార్టీ మేనిఫెస్టోతో ముందుకొస్తున్న విజయసాయిరెడ్డి రాజకీయ ప్రయాణం ఏ తీరాలకు చేరుతుందన్నది వేచిచూడాలి.

Tags:    
  • vijaysaireddy 
  • prp 
  • parivarthanarajaneethiparty 
  • appolitics 
  • andhrapradesh 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

Copyright @2026

Powered by Blink CMS