• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  బాబు విజనరీ కారు...జగన్...

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

| కొత్త పార్టీ పీఆర్పీ ప్రారంభించిన విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇద్దరికీ నాయకత్వ లక్షణాలు, ప్రజలతో భావోద్వేగ అనుబంధం లేవని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదని స్పష్టం చేస్తూ, యువతకు 66 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

By - Satya P
Update: 2026-11-11 07:31 GMT

అవును కొత్త పార్టీ పెట్టారు, కొత్త ఉత్సాహం కూడా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చూపించారు. ఏపీలో రెండు ప్రధాన పార్టీల అధినేతలను విమర్శించకపోతే ఆయన పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది. తమ పార్టీ ఆల్టర్నేషన్ అని ఎలా జనాలకు చెప్పుకోగలరు. అందుకే ఆయన పార్టీ పుట్టిన చోటు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబుని విపక్ష నేత వైఎస్ జగన్ ని గట్టిగానే విమర్శించారు. ఒక విధంగా ఇద్దరి మీద తన ప్రసంగంలో విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు నేతల నాయకత్వం మీద వారి పని తీరు మీద కూడా విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విశ్లేషించారు.

ఇద్దరూ ఇద్దరే అంటూ :

ముఖ్యమంత్రి చంద్రబాబు తనను విజనరీ అని చెప్పుకుంటారని కానీ ఆయన అది కానే కాదని విజయసాయిరెడ్డి అన్నారు. అలాగే జగన్ ప్రజా నాయకుడిని అని డప్పు కొట్టుకుంటారు కానీ ఆయన ఎప్పటికీ కాలేరని కూడా విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అసలు ఈ ఇద్దరు నాయకులకూ నాయకత్వ లక్షణాలు లేవు అని విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజా నాయకుడు ఎలా ఉండకూడదో ఈ ఇద్దరిని చూస్తే అర్ధం అవుతుందని అన్నారు. నాయకుడు అంటే ప్రజల బాధలను తెలుసుకునే వారు అని ఆయన చెప్పారు. జనాలతో ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి కానీ బాబు జగన్ లలో అది శూన్యం అని విజయసాయిరెడ్డి తేల్చేశారు. నాయకత్వ లక్షణాలతో పాటు ఏదీ లేకున్నా అన్నీ ఉన్నట్లు ప్రచారం చేసుకోవడంలో బాబు జగన్ ఇద్దరూ దిట్టలని విజయసాయిరెడ్డి గట్టిగానే విమర్శించారు.

పీఆర్పీ బీ టీం కాదు :

పీఆర్పీ అన్నది తాను ప్రజల కోసం సొంతంగా ఏర్పాటు చేసిన పార్టీగా విజయసాయి రెడ్డి చెప్పారు. అది ఏ పార్టీకీ బీ టీం కానే కాదని అన్నారు. ఈ విషయంలో తాను దేవుడిపై ప్రమాణం చేస్తున్నానని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. తాను పెట్టిన పార్టీ ప్రజల కోసం వారి శ్రేయస్సు కోసం మాత్రమే అని ఆయన అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి పార్టీ రంగు కాషాయంగా ఉంది. అందులో ధర్మ చక్రం మధ్యలో ఉంది. దాంతో బీజేపీ కాషాయాన్ని ఈ పార్టీ జెండాను పోలిక పెట్టి చూస్తున్నారు. అందుకే విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు అని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి బీజేపీని జనసేనను విమర్శించకపోవడం మీద కూడా చర్చ సాగుతోంది. ఈ కారణంగా కూడా ఆయన పార్టీ బీ టీం కాదని చెప్పాల్సి వచ్చింది అని కూడా అంటున్నారు.

యువతకు 66 శాతం :

ఇక విజయసాయిరెడ్డి తన పార్టీలో యువతకు ఏకంగా 66 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే కుల, మతాలకు అతీతంగా మా పార్టీలో అందరికీ చోటు ఉంటుందని స్పష్టం చేశారు. స్వచ్చంగా రాజకీయాలు చేయాలనుకునే వారికి పీఆర్పీ ఒక వేదిక అన్నారు. ఇక పార్టీ జెండాలు ఎన్నికల వేళ పట్టుకోవడానికో కటౌట్ లు కట్టడానికో యువత లేదని వారిని చట్టసభల్లో కూర్చోపెట్టి ప్రజల తరుపున మాట్లాడటానికి యువతను పీఆర్పీ తయారు చేస్తుంది అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

Tags:    
  • vijaysaireddy 
  • prp 
  • andhrapradesh 
  • appolitics 
  • chandrababu 
  • ysjagan 
  • tdp 
  • ysrcp 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

Copyright @2026

Powered by Blink CMS