• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  విజయసాయి తలుపులు...

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

| విజయసాయిరెడ్డి తన కొత్త ‘పరివర్తన రాజనీతి పార్టీ’లోకి వైసీపీ నేతలను ఆహ్వానిస్తూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. 2019లో 151 సీట్లు సాధించిన వైసీపీ 2024లో 11 స్థానాలకే పరిమితం కావడానికి జగన్ అహంకారమే కారణమని విమర్శించారు. దీంతో ఆయన వెంట ఎంతమంది వైసీపీ నేతలు చేరుతారన్న చర్చ మొదలైంది.

By - Satya P
Update: 2026-11-11 07:30 GMT

వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుతో పాటు చేసిన కీలక వ్యాఖ్యలు చూస్తే టార్గెట్ వైసీపీ అని అర్థం అవుతోంది. ఇక ఆయన వెంట ఉన్న వారిలో వైసీపీ ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు చూస్తే వైసీపీని ఆకట్టుకోవాలని చూస్తున్నట్లుగా అర్ధం అవుతోంది. సహజంగానే వైసీపీ నుంచి వచ్చిన నేత కాబట్టి ఆయనకు అక్కడ నుంచే నేతల రాక ఉండొచ్చు అని అంటున్నారు. వైసీపీలో కీలకంగా పనిచేసిన అనుభవం ఉన్న విజయసాయిరెడ్డి వెంట ఇపుడు ఎంత మంది నేతలు వెళ్తారు అన్నది మరో చర్చగా ఉంది. ఇక విజయసాయిరెడ్డి కూడా ఎటువంటి డౌట్లూ ఎవరూ పెట్టుకోకుండా వైసీపీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. తన చూపు అంతా వైసీపీ వైపే అని చెప్పకనే చెప్పారు.

వైసీపీ నేతలు రావచ్చు :

తన కొత్త పార్టీ పరివర్తన రాజనీతి లోకి వైసీపీని విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. వైసీపీ వారు ప్రజా సేవ చేయాలనుకుంటే తన పార్టీలోకి రావచ్చు అని ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. తమ పార్టీ తలుపులు ఎపుడూ వైసీపీ నేతల కోసం తెరచే ఉంటాయని కూడా ఆయన అంటున్నారు. ఇక వైసీపీ మీదనే ఆయన విమర్శలు ఎక్కువగా చేయడం విశేషం. వైసీపీని ఇటుక ఇటుక పేర్చి నిర్మించడంలో తన వంతు శ్రమ కృషి కూడా ఎంతగానో ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇంత చేసిన తనకు చివరికి దక్కిందేంటి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 2019 ఎన్నికలో వైసీపీ 151 సీట్లు సాధించింది అని ఆయన గుర్తు చేశారు. అదే వైసీపీ 2024 నాటికి కేవలం 11 స్థానాలకు ఎందుకు పడిపోయింది అని సూటిగానే ప్రశ్నించారు.

మీ అహంకారం అంటూ :

జగన్ మీద నేరుగానే విజయసాయిరెడ్డి విమర్శలు దట్టించారు. ప్రజలు మీరు ఇచ్చిన సంక్షేమాన్ని తిరస్కరించలేదు, అదే సమయంలో మీ అహంకారాన్ని తిరస్కరించారు అంటూ ఇప్పటిదాకా ఎవరూ చెప్పని విశ్లేషణ వినిపించారు. వైసీపీ ఎందుకు ఓటమి పాలు అయింది అంటే ఆ పార్టీ నుంచి ప్రత్యర్థుల నుంచి ఎన్నో రకాలైన వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ జగన్ అహంకారాన్ని జనాలు ఈ విధంగా ఓడించి గుణపాఠం చెప్పారు అన్నది అయితే ఎవరూ విశ్లేషించలేదు, ఒక్క విజయసాయిరెడ్డి మాత్రమే ఆ కోణంలో చూడగలిగారు, ఆయన ఓపెన్ గా దాని గురించి చెబుతున్నారు కూడా. ప్రజలకు నాయకులకు మధ్య హద్దులు పెట్టుకుని పరదాలు కట్టుకుని ఉంటే జనాలు ఎందుకు గెలిపిస్తారు అని కూడా విమర్శించారు. జగన్ కి నాయకత్వ లక్షణాలు లేనే లేవని కూడా ఘాటు విమర్శలను విజయసాయిరెడ్డి చేయడం విశేషం.

ఇంతకీ వెళ్ళేందెవరు :

ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ నిర్మాణంలో తానూ కీలకం అని చెబుతూ ఆ పార్టీ పునాదుల నుంచి ఉన్నాను అని అంటున్న విజయసాయిరెడ్డి ఇపుడు కొత్త పార్టీ పెట్టారు. ఆయన పీఆర్పీలో చేరేది ఎవరు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వైసీపీ వారు ఎవరైనా వచ్చి చేరవచ్చు అని విజయసాయిరెడ్డి అంటున్నారు. వైసీపీనే ఆయన టార్గెట్ చేశారు. దాంతో ఆ పార్టీని వదిలి విజయసాయిరెడ్డి వెంట పెద్ద సంఖ్యలో నేతలు క్యూ కడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీకి మరో కొత్త సవాల్ గా రాజకీయ ప్రత్యర్ధిగా విజయసాయిరెడ్డి ఆయన పార్టీ వచ్చాయన్నది గుర్తుంచుకోవాల్సిందే అంటున్నారు.

Tags:    
  • vijaysaireddy 
  • ysrcp 
  • parivarthanarajaneethi 
  • ysrcpnews 
  • andhrapradeshpolitics 

Similar News

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS