• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  'రాష్ట్ర పండుగ' గా...

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

| రామోజీరావు జయంతి నవంబర్ 16ను రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు జర్నలిజం, భాష, సినిమా రంగాలకు ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మద్దతుదారులు చెబుతున్నారు. అయితే రాజకీయ పక్షపాతం, రాష్ట్ర పండుగ హోదాకు ఉండాల్సిన ప్రమాణాలపై ప్రతిపక్షాలు, విశ్లేషకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

By - Satya P
Update: 2026-11-19 20:57 GMT

చెరుకూరి రామోజీరావు. ఆయన మీడియా మొఘల్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగారు. ఆయన ప్రతిభావంతుడు అనడంలో ఎవరికీ ఏ రకమైన సందేహాలు లేవు. అయితే ఆయన జయంతి నవంబర్ 16 వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘రాష్ట్ర పండుగ’ గా ప్రకటించడంపై వివిధ వర్గాల నుండి భిన్నమైన అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఇవి అనుకూలంగా ప్రతికూలంగానూ ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ మద్దతుదారులు ఇలా వివిధ వర్గాల నుంచి వేరు వేరుగా అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అలాగే టీవీ చానళ్ళు, వెబ్ పోర్టళ్ళ ద్వారా ఎవరి భావాలను ఈ అంశం మీద వారు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒక ప్రముఖుడు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపధ్యంలో తొలిసారి ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అని చెప్పాలి.

రాష్ట్ర పండుగ హోదా ప్రమాణాలు :

నిజానికి చూస్తే ఎవరికి రాష్ట్ర పండుగ చేయాలి ఆ హోదా ఎవరికి ఇవ్వాలి అన్నది అయితే ఇపుడు అంతా లోతుల్లోకి వెళ్ళి చర్చిస్తున్నారు. తమకు నచ్చిన వారికి ఈ హోదా ఇచ్చేయవచ్చా లేదా దానికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా అంటే దాని మీద కూడా చర్చ సాగుతోంది. సాధారణంగా దేశ స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తలు, ప్రజా కవులు ప్రజా జీవితంలో త్యాగాలు చేసిన మహనీయుల జయంతులను మాత్రమే ప్రభుత్వాలు ‘రాష్ట్ర పండుగ’లుగా నిర్వహిస్తాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ కోవలోకి రామోజీరావు వచ్చారా అన్నదే చాలా మంది తర్కిస్తున్నారు. రామోజీరావులో ఏ కోణం చూసి రాష్ట్ర పండుగ హోదా ఇచ్చారు అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్న వారు ఉన్నారు. ఆయన ఒక కార్పొరేట్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వారిగానే చూస్తున్న వారూ ఉన్నారు. అలాంటి ఆయన పుట్టిన రోజును ఆ జాబితాలో చేర్చడం వల్ల ‘రాష్ట్ర పండుగ’ అనే గౌరవం, విలువ, పవిత్రత తగ్గుతాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

నిష్పక్షపాతం మీదనే :

పాత్రికేయ కోణంలో కంటే మీడియా యజమానిగానే రామోజీరావుని చూస్తారు అని అంటున్నారు. ఇక ఆయన ఆధ్వర్యంలో నడిచిన మీడియా జర్నలిజం విలువలు పాదుకొల్పే విషయంలో కానీ రాజకీయ నిష్పక్షపాతం విషయంలో కానీ ఏ తీరున వ్యవహరించింది అన్నది కూడా చర్చకు ఎక్కువగా వస్తోంది. నిజానికి పత్రికా రంగంలో తటస్థత అనేది అత్యంత కీలకమని చెబుతారు. కానీ దశాబ్దాలుగా సాగిన ఆయన పత్రిక ప్రస్థానం చూస్తే ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించింది అన్నది కూడా నిశితమైన విమర్శలుగానే ఉంది. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా ఉండాల్సిన మీడియా అధినేతకు ఒక రాజకీయ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారిక గౌరవం ఇవ్వడం వల్ల కూడా అది ప్రజా సేవకు గుర్తింపు కంటే రాజకీయ మద్దతుకు ప్రతిఫలంగా కనిపిస్తోందని విపక్ష నేతలు గట్టిగానే వాదిస్తున్నారు. దీని మీదనే ఇపుడు అనేక మీడియా కథనాలు కూడా వెలువడుతున్నాయి.

వ్యాపార ప్రయోజనాలే అధికమని :

ఎవరైనా ఏదైనా సంస్థను ప్రారంభించినప్పుడు సహజంగానే ఉపాధి అందులో చాలా మందికి వస్తుంది. దానిని ప్రజా సేవ అనగలరా అన్నది మౌలికమైన ప్రశ్న. అంతే కాదు రామోజీరావు లాంటి వ్యక్తులు మీడియా సహా తమ సంస్థల ద్వారా లాభార్జన కంటే అధికంగా ప్రజా సేవ చేసింది ఏముంది అని అంటున్న వారూ ఉన్నారు. ఒక వేళ రామోజీరావు చేసినది ప్రజా సేవ అనుకున్నా దానికి ఇప్పటికే జాతీయ స్థాయిలో 'పద్మవిభూషణ్' వంటి పురస్కారాలు దక్కాయని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం వల్ల ప్రతి ఏటా ప్రభుత్వ ఖజానా నుండి నిధులు వెచ్చించి అధికారికంగా వేడుకలు నిర్వహించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇది ఒక విధంగా చూస్తే తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతుందని అంటున్నారు. రేపటి రోజున మరో పార్టీ అధికారంలోకి వస్తే తమకు నచ్చిన వారికో తమకు అనుకూలంగా ఉన్న వారిలో ఈ తరహా రాష్ట్ర పండుగ హోదాతో జయంతులు జరిపితే అపుడు వీటికి ఉన్న గౌరవాల సంగతి ఏమవుతుందని కూడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ఇవ్వాల్సిందే అంటూ :

మరో వైపు చూస్తే ప్రభుత్వం తరఫున దీనిని సమర్ధించేవారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర మంత్రులు, టీడీపీ నేతలు పలువురు సీనియర్ పాత్రికేయులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. రామోజీరావు తెలుగు భాషకు, సాహిత్య రంగాలకు చేసిన కృషిని వారు గుర్తు చేస్తున్నారు. తన దినపత్రిక ద్వారా తెలుగు జర్నలిజంలో ఆధునికతను తీసుకురావడమే కాకుండా గ్రామీణ స్థాయి వరకు వార్తలను చేరవేసి తెలుగు భాషా వికాసానికి విశేష సేవ చేశారని అనుకూలంగా విశ్లేషించేవారూ ఉన్నారు. అంతే కాకుండా ఎన్నో పరిశ్రమల స్థాపన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పాటు పడ్డారని, ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని నిర్మించడం ద్వారా తెలుగు సినిమా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారని గుర్తు చేస్తున్నారు. ఇలా ప్రజా హితం కోసం పనిచేసిన తీరుని చూసినపుడు ఆయన జయంతిని కచ్చితంగా రాష్ట్ర పండుగగా చేయాల్సిందే అని వాదిస్తున్న వారూ ఉన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో తన సంస్థల ద్వారా ఆయన అందించిన సహాయం తీసుకున్నా ఏపీ రాజధానికి ‘అమరావతి’ అనే పేరును సూచించడం వంటి వాటిని చూసినా గానీ ఆయనకు ఈ గౌరవం ఇవ్వడం భేష్ అయిన నిర్ణయం అంటున్నారు. ఇలా భిన్న వాదనలు ఈ విషయం మీద ఉన్నప్పుడు జనాలే ఏది సబబో తేల్చుకుంటారని కూడా అంటున్నారు. అంతే కాదు కాల పరీక్ష అని ఒకటి ఉంటుంది. అది ఈ నిర్ణయం కరెక్ట్ అవునో కాదో తెలుస్తుందని కూడా విశ్లేషిస్తున్నారు.

Tags:    
  • ramojirao 
  • ramojiraobirthanniversary 
  • andhrapradesh 
  • apgovernment 
  • statefestival 

Similar News

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS