• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.....

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

| ఏపీలో ఈ నెల 29 నుంచి జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు టీడీపీలో అంతర్గత విభేదాలకు కారణమవుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు సూచించినప్పటికీ, పలుచోట్ల మంత్రులు తమ కుటుంబ సభ్యులు, అనుచరులకు సర్పంచ్ అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భార్య నామినేషన్ వేయడం వివాదాన్ని మరింత పెంచింది.

By - Garuda Media
Update: 2026-11-19 21:12 GMT

ఈ నెల 29 నుంచి వ‌రుస‌గా జ‌ర‌గ‌నున్న గ్రామ‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. సాధార‌ణంగా గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేవారు.. ఏపార్టీ గుర్తుపైనా..జెండాపైనా పోటీకి దిగ‌రు. కేవ‌లం ఆయా పార్టీల మ‌ద్ద‌తుతో ముందుకు సాగుతారు. దీంతో స్థానికంగా పార్టీ కోసం క‌ష్టించిన వారు..జెండాలు మోసిన వారికి పార్టీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ముఖ్యంగా చంద్ర‌బాబు జైల్లో ఉన్న‌ప్పుడు.. గ్రామీణ స్థాయిలో ఉద్య‌మాలుచేసి.. ఆయ‌న కోసం త‌పించిన వారికి ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. వారికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని.. పార్టీ కార్య‌క‌ర్త‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

కానీ, క్షేత్ర‌ స్థాయికి వ‌చ్చే స‌రికి.. మంత్రుల హ‌వా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక్క‌డ పార్టీకి ప‌నిచేసిన వారికంటే కూడా.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌వారిని.. ఎంపిక చేస్తున్న తీరు ప‌లు గ్రామాల్లో టీడీపీపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తోంది. నిజానికి గ్రామ స‌ర్పంచ్ ప‌ద‌వి పేరుకు పెద్ద‌ద‌ని అంటారు కానీ.. కేంద్ర‌, రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో వారు డీలా ప‌డుతున్నారు. అయితే.. ఇలాంటి ప‌ద‌వులు కూడా మంత్రులు త‌మ వారికి కేటాయించ‌డంతో పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారు డీలా ప‌డుతున్నారు. అంతేకాదు.. కొన్ని కొన్ని గ్రామాల్లో మంత్రులు త‌మ కుటుంబ స‌భ్యుల‌కే స‌ర్పంచ్ ప‌ద‌వులు ఇచ్చేలా చ‌క్రం తిప్ప‌డం కూడా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌ను తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తోంది.

రాష్ట్రస్థాయి బాధ్యతల్లో ఉన్నప్పటికీ, మంత్రులు తమ స్వస్థలాల్లోని కీలక గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే..ఇది పార్టీకి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా ఉంటే ఎవ‌రికీ ఇబ్బందులు ఉండ‌వు. పార్టీ కోసం ప‌ని చేసిన‌ వారిని ఎంపిక చేస్తే.. ఎలాంటి ర‌గ‌డా ఉండ‌దు. కానీ, మంత్రులు త‌మ కుటుంబ స‌భ్యుల‌ను రంగంలోకి దింప‌డం వివాదానికి దారితీస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీకి మంత్రి బీసీ జ‌నార్ద‌న్‌ రెడ్డి స‌తీమ‌ణి ఇందిర నామినేషన్ దాఖలు చేయడం ద్వారా స్థానికంగా రాజకీయ వేడి పెరిగేలా చేసింది. సొంత పార్టీ నాయ‌కులే ఆమెను వ్య‌తిరేకిస్తున్నారు.

అలానే విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, అనంత‌పురం జిల్లాల్లో మంత్రుల స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు స‌ర్పంచ్ ప‌ద‌వుల‌కు నామినేష‌న్ వేశారు. ఇవ‌న్నీ.. పార్టీలో ఐక్య‌త‌కు.. ముఖ్యంగా కార్య‌క‌ర్త‌ల ఆశ‌ల‌కు కూడా గండి కొడుతున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు కూడా మౌనంగా ఉన్నారు. ఇటు మంత్రుల‌ను కాద‌న‌లేని ప‌రిస్థితి.. అటు కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఏం జ‌రిగిన మంచిదే అన్న‌ట్టుగా చంద్ర‌బాబు మౌనంగా ఉండిపోయార‌ని పార్టీ సీనియ‌ర్ నేత ఒక‌రు ఆఫ్ దిరికార్డుగా వ్యాఖ్యానించారు.

Tags:    
  • tdp 
  • chandrababu 
  • andhrapradesh 
  • panchayatelections 
  • gramapanchayat 

Similar News

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS