• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  సీనియర్లను రంగంలోకి...

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

| ఏపీలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలను జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్ల మేయర్ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ రెండు సమన్వయ కమిటీలను నియమించారు. పార్టీ సీనియర్లతో కూడిన ఈ కమిటీలు జనసేన శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు టీడీపీ, బీజేపీ నేతలతో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల గెలుపునకు పనిచేయనున్నాయి.

By - Satya P
Update: 2026-11-19 21:15 GMT

ఏపీలో రెండో విడతలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల కోసం జనసేన తన పార్టీ పరంగా పటిష్టమైన వ్యూహ రచన చేస్తోంది. పార్టీలో ఉన్న సీనియర్లను రంగంలోకి దించింది. మలి విడత జనసేనకు ప్రతిష్టగా మారింది. ఎందుకంటే నాలుగు కార్పోరేషన్లలో రెండు ఆ పార్టీవే ఉన్నాయి. కూటమి తరఫున బరిలో ఉన్నా ప్రధాన పోటీదారుగా ఫోర్ ఫ్రంట్ లో నిలిచి పోరాడాల్సిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది అని అంటున్నారు. అందుకే జనసేన కో ఆర్డినేషన్ కమిటీలను నియమించింది.

ఆ రెండు చోట్ల ఫోకస్ :

ఇదిలా ఉంటే రెండో దశలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూస్తే జనసేన కాకినాడ, శ్రీకాకుళం నగర పాలక సంస్థల మేయర్ స్థానాలకు పోటీ పడుతోంది. ఈ రెండూ కూడా గెలుచుకోవడం ఆ పార్టీకి చాలా కీలకం అన్నది తెలిసిందే. ఇప్పటికి అయితే తమకు కేటాయించిన సీట్లు అన్నింటిలోనూ సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నమోదు చేసిన జనసేన ఈ రెండు కార్పోరేషన్లను తన ఖాతాలో వేసుకుని తనకు ఉన్న బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. కాకినాడ అంటే గోదావరి జిల్లాలలో ఉంది, అక్కడ గ్రాఫ్ మరింతగా పెంచుకోవడం ముఖ్యం. అలాగే తొలిసారి ఉత్తరాంధ్రాలో చివరిన ఉన్న శ్రీకాకుళం నుంచి బరిలోకి దిగుతోంది. ఇక్కడ గెలిచి వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కూడా తన రాజకీయ పట్టు బిగించాలని జనసేన చూస్తోంది. ఇప్పటికే విశాఖలో నాలుగు ఎమ్మెల్యేలు విజయనగరంలో రెండు ఎమ్మెల్యేలు గెలుచుకున్న జనసేన మేయర్ సీటుతో సిక్కోలులో బోణీ కొట్టాలనుకుంటోంది.

గెలుపు వ్యూహాలతో :

ఈ క్రమంలో కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ సీనియర్లతో కో ఆర్డినేషన్ కమిటీలను రెండు నియమించారు అధినేత పవన్ కళ్యాణ్. మేయర్ ఎన్నికల్లో స్థానికంగా జనసేన పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి అలాగే కూటమి పార్టీలతో నిరంతర సమన్వయం చేసుకునేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోటా కూటమి ప్లస్ జనసేన గెలుపు సాధించేలా ఆయా ప్రాంత నాయకుల సమన్వయంతో కమిటీలు కృషి చేస్తాయని చెబుతున్నారు.

కాకినాడ సమన్వయకర్తలుగా :

ఇక కాకినాడ కార్పోరేషన్ లో జనసేన గెలుపు కోసం సమన్వయకర్తలుగా మంత్రి కందుల దుర్గేష్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను,రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, వడ్డీల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి పవన్ కళ్యాణ్ నియమించారు.

శ్రీకాకుళం కార్పొరేషన్ కోసం

అదే విధంగా విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ,ఏపీ ఎంఎస్ఎంఈ, చైర్మన్ టి. శివశంకర్, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, ఏలూరు మేయర్ రెడ్డి అప్పలనాయుడు,రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి, పార్టీ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, దుగ్గిశెట్టి సుజయ్ బాబు సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు అని పార్టీ పేర్కొంది.

Tags:    
  • janasena 
  • pawankalyan 
  • kakinada 
  • srikakulam 
  • apmunicipalelections 
  • mayorelections 

Similar News

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS