• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రణబ్ ప్రధాని...

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

| మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని అయ్యే అవకాశాలు పలుమార్లు వచ్చినా నెరవేరలేదు. 1991లో పీవీ నరసింహారావు, 2004, 2009లో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. 2010లో ప్రణబ్‌కు ప్రధాని కావాలనే ఆకాంక్ష ఉండేదని సోనియా గాంధీ ఆత్మకథలో పేర్కొనడంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది.

By - Satya P
Update: 2026-11-11 07:29 GMT

ప్రణబ్ ముఖర్జీ ఈ దేశానికి ప్రథమ పౌరుడిగా అయిదేళ్ల పాటు పనిచేసిన మాజీ రాష్ట్రపతి. ఆయన పదవీ కాలం 2012 నుంచి 2017 దాకా సాగింది. ఆయన ఆర్థిక నిపుణుడు. అపర మేధావి, అలాగే నాయకత్వ లక్షణాలు విశేషంగా ఉన్న వారు, కాంగ్రెస్ లో దశాబ్దాల పాటు పనిచేసిన వారు. ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలతో పాటు ఆర్థిక శాఖను సమర్ధంగా నిర్వహించిన నేత. అలాంటి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని ఎందుకు కాలేకపోయారు అన్నది ఒక చర్చగా నాటికీ నేటికీ ఉంది. 2020లో ప్రణబ్ ముఖర్జీ మరణించారు. ఇక ప్రణబ్ ముఖర్జీని మోడీ ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న తో సత్కరించింది.

అవకాశాలు చేజారాయి :

ప్రణబ్ ముఖర్జీ ప్రధానిగా ఈ దేశానికి అవాల్సిన సందర్భాలు ఎన్నో వచ్చాయి. అయితే ఆయనకు అదృష్టం కలసి రాలేదని అంటారు. ప్రణబ్ ముఖర్జీ ఇందిరాగాంధీకి ఇష్టమైన నాయకుడుగా ఉన్నారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వంలో ఆయన రెండవ అత్యంత కీలకమైన నాయకుడిగా ఎదిగారు. 1969లో ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో ప్రణబ్ ముఖర్జీ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె నమ్మకాన్ని చూరగొన్న ప్రణబ్ 1973లో కేంద్ర మంత్రివర్గంలో చేరారు. ఇలా చూస్తే ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు దక్కినా ప్రధాని మాత్రం దరి చేరలేదు అని అంటారు.

పీవీకి పోటీగా :

ఇక పీవీ నరసింహారావు 1991లో ప్రధాని అయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖరీ పేరు కూడా వినిపించింది. 1991 మే 21న జరిగిన రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. అప్పటికే కాంగ్రెస్ దిగ్గజ నేతలుగా ఉన్న శరద్ పవార్, అర్జున్ సింగ్, ఎన్.డి తివారీ వంటి సీనియర్ల పేర్లతో పాటు ప్రణబ్ ముఖర్జీ పేరు కూడా అప్పట్లో ప్రధాని పదవి కోసం చర్చకు వచ్చింది. అలా అంతర్గత అధికార పోరులో ప్రణబ్ ముఖర్జీ చివరికి తగ్గి పీవీ నరసింహారావుకు అండగా నిలిచారు. పీవీ మంత్రివర్గంలో తనకే మళ్లీ ఆర్థిక శాఖ దక్కుతుందని ప్రణబ్ ముఖర్జీ బలంగా ఆశించారు. మన్మోహన్ సింగ్‌ను పీవీ ఆర్థిక మంత్రిగా నియమించారు. అయితే పీవీ 1995లో ఆయనకు విదేశాంగ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు అప్పగించారు. అలా ప్రధానిగా ప్రణబ్ కి ఒక చాన్స్ పోయింది అని అంటారు.

యూపీఏ హయాంలో :

ఇక 2004 అలాగే 2009 ఎన్నికలల్లో గెలిచి రెండు సార్లు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. ఆ సమయంలో కూడా ప్రణబ్ ముఖర్జీ అనుభవం దృష్ట్యా ఆయన ప్రధాని అవుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడిచింది. కానీ అలా జరగలేదు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా రెండు టెర్ములూ ఉన్నారు. ఆయన సోనియాగాంధీ ఎంపిక అన్నది తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన సోనియా గాంధీ ఆత్మకథ "బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్" లో కూడా 2010లో ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని కావాలనే ఆకాంక్ష ఉండేదని పేర్కొన్నారు. దాంతోనే దీని మీద మరోసారి చర్చ సాగుతోంది. తన తండ్రికి ఉన్న అపారమైన అనుభవం వల్ల ప్రధాని పదవి కోరితే తప్పేముందని ప్రణబ్ ముఖర్జీ తనయ శర్మిష్టా ముఖర్జీ సోనియాగాంధీ ఆత్మ కధలో ప్రణబ్ మీద చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. తన తండ్రి ప్రధాని కాదగిన వారు అని ఆమె అన్నారు. మరి సోనియా గాంధీ పుస్తకంలో ప్రణబ్ మీద చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఆలోచనలు తెలిసి కూడా సోనియాగాంధీ అంతటి అనుభవం కలిగిన నేతకు ప్రధాని పదవికి ఎందుకు ఎంపిక చేయలేకపోయారు అన్నది ప్రశ్న. అయితే ఎంతో అనుభవం కలిగి స్వతంత్రంగా ప్రణబ్ వ్యవహరిస్తారు అన్న కారణంతోనే ఆమె ఆయనను పక్కన పెట్టారా అన్నది కూడా చర్చగా ఉందని అంటారు.

Tags:    
  • pranabmukherjee 
  • soniagandhi 
  • sharmisthamukherjee 
  • indianpolitics 
  • belonging 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS