• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  పిచ్చికుక్క కరిచిందా.....

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

| తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, సిద్దిపేట సభలో రేవంత్ ఘాటుగా స్పందించారు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయనే చర్చ జరుగుతోంది.

By - Tupaki Desk
Update: 2026-11-19 21:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు అసలైన వినోదం మొదలైంది. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం పాత చింతకాయ పచ్చడి అయిపోయిందేమో గానీ.. సొంత పార్టీ నేతలే మైకులు అందుకుని ఒకరిపై ఒకరు మాస్ కౌంటర్లు వేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంధిస్తున్న ప్రశ్నల బాణాలు.. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న పంచ్ డైలాగులు చూస్తుంటే.. అసలు ఇది అధికార పార్టీయా లేక ఏదైనా పొలిటికల్ డ్రామానా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ సొంత ఇంటి గుట్టును రచ్చకీడ్చడంలో కాంగ్రెస్ నేతలకు ఎవరూ సాటిరారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. సిద్దిపేట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నవ్వులతో పాటు చర్చకు దారితీశాయి. మంచి మైక్‌లో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలి అంటూ సీఎం హితబోధ చేశారు. అంతటితో ఆగకుండా "మా వాళ్లలో కొందరికి పిచ్చికుక్క కరిచినట్లుంది.. వారిని ఎర్రగడ్డకు మా కార్యకర్తలు తీసుకెళ్లిపోతారు.. వారు ఏదేదో మాట్లాడుతున్నారు" అంటూ తనదైన శైలిలో చురకలు అంటించారు. పేరు ప్రస్తావించకపోయినా ఈ ‘పిచ్చికుక్క’ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవో అర్థం చేసుకోవడానికి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల తనను విమర్శించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైనే రేవంత్ ఈ కౌంటర్ వ్యాఖ్యలు చేసినట్టుగా అర్తమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

ఈ వ్యవహారానికి అసలు బీజం వేసింది రాజగోపాల్ రెడ్డి అని పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్రంలో కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ నియోజకవర్గాలే కాకుండా మరో 116 నియోజకవర్గాలు కూడా ఉన్నాయని ఆయన ప్రభుత్వానికి గుర్తుచేశారు. కొడంగల్‌కు ఒకేసారి రూ. 1,000 కోట్లు ఇస్తే.. మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో తనను ఉద్దేశించి "పండబెట్టి తొక్కుతా" అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారంటూ రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఆశ లేదని కేవలం మునుగోడు అభివృద్ధి కోసమే తాను మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే మునుగోడులో మరో ‘కురుక్షేత్ర యుద్ధం’ ప్రారంభిస్తానని ఆయన హెచ్చరించడం గమనార్హం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులనే ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తోందని రాజగోపాల్ రెడ్డి విమర్శించడం కాంగ్రెస్ శ్రేణులను ఇరకాటంలో పడేసింది. అసలు హైదరాబాద్ నగరానికే సరైన దిక్కులేదని.. అలాంటప్పుడు ‘ఫ్యూచర్ సిటీ’ ఎందుకంటూ ఆయన ప్రభుత్వ ప్రాధాన్యతలపైనే ప్రశ్నలు సంధించారు. దివంగత వైఎస్సార్ తరహా పాలన కావాలని కోరుతూనే సొంత ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఇది కేవలం నిధుల కేటాయింపు సమస్య కాదని.. పార్టీలో పెరుగుతున్న ఆధిపత్య పోరుకు నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఒకరు అభివృద్ధి పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే.. మరొకరు క్రమశిక్షణ పేరుతో ఘాటుగా స్పందిస్తున్నారు.

ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమం పక్కన పెడితే.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ ‘మైక్ వర్సెస్ చెవి’ పోరాటం మాత్రం మంచి కాలక్షేపాన్ని ఇస్తోంది. ఈ అంతర్గత కురుక్షేత్రానికి పార్టీ అధిష్ఠానం ఎప్పుడు బ్రేకులు వేస్తుందో వేచి చూడాలి.

Tags:    
  • revanthreddy 
  • komatireddyrajgopalreddy 
  • telanganacongress 
  • telanganapolitics 
  • congress 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

రేవంత్ ను పొడవడానికి ‘కోమటిరెడ్డి’ ఒక్కడు చాలు.. ‘రూ.5వేల’ మంటపెట్టాడు..

2026-11-18 07:05 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

జమిలితో బీజేపీ : తెలంగాణాను ఎగరేసుకుపోతారా ?

2026-11-17 17:37 GMT

విజయ్ కు అందలం.. సీఎంలు రేవంత్, డీకే, సతీషన్ కు మంగళం.. ఇలా చేస్తే కాంగ్రెస్ ను అనరా మరీ..

2026-11-17 04:40 GMT

తెలంగాణ‌లో మూడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ!

2026-11-15 20:29 GMT

‘‘అండాలు ఇస్తే రూ. 50 వేలు’’ హైదరాబాద్ లో దారుణం, తండ్రి చికిత్స కోసం వచ్చి ఇరుక్కుపోయిన యువతి

2026-11-15 20:24 GMT

నాగార్జునకు భారీ లబ్ది...ఈటల సంచలన వ్యాఖ్యలు!

2026-11-14 16:43 GMT

కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు

2026-11-14 10:44 GMT

Copyright @2026

Powered by Blink CMS