• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  Nalgonda >  ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం...

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

| తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, కొడంగల్‌, మధిరకే నిధులు పరిమితం చేయొద్దని సూచించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే యుద్ధం మొదలవుతుందని హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి.

By - A.N.Kumar
Update: 2026-11-18 10:06 GMT

‘‘రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా యుద్ధం స్టార్ట్ అవుతది..’’ ఇది అన్నది ఎవరో కేసీఆర్ నో.. కేటీఆర్ నో కాదు.. స్వయంగా కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ సీఎంపైనే తిరుగుబాటు జెండా ఎగరవేశాడు.. కాంగ్రెస్ లో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఎంతగా తమ పార్టీ నాయకుడిని తిట్టవచ్చో ఈ సంఘటన మనకు కళ్లకు కడుతోంది. అప్పట్లో కూతురు తిడితేనే మంత్రి కొండా సురేఖ గమ్మున ఉందని సస్పెండ్ చేశారు. మరి ఇంతలా రెచ్చిపోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారో కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేయాలి..

కాంగ్రెస్ లో నేతలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. ఏకంగా సొంత సీఎంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు చేయాల్సిన విమర్శలను అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిపడేశాడు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నే టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి పనితీరు, నిధుల కేటాయింపు, పాలనా తీరుపై రాజగోపాల్‌రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా లేరని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పాలన సాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఆశించిన స్థాయిలో సంతృప్తి కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం కొడంగల్, మధిర నియోజకవర్గాలు మాత్రమే కాదని.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు బాధ్యతాయుతంగా పనిచేయాలని.. కొందరి ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తే సహించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.

రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టు టెండర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ కమీషన్లు ఇవ్వనని.. ఎవరి దగ్గరా కమీషన్లు తీసుకోనని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని ఆదా చేయడమే తన లక్ష్యమని చెబుతూ.. ప్రభుత్వ పనులకు సంబంధించిన టెండర్ విలువ ఎంత ఉందో చెబితే.. దానికంటే 20 శాతం తక్కువకే టెండర్ వేసి పని పూర్తి చేస్తానని ఆయన సవాల్ విసిరారు.

రాజగోపాల్‌రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో సంచలనమయ్యాయి.. అధికారం చేతిలో ఉందని ఏది చేసినా చెల్లుతుందని భావించవద్దని ఆయన హెచ్చరించారు. "అధికారం ఉంది కదా అని ఏం చేసినా నడుస్తుందని అనుకుంటే ఖబర్దార్.. యుద్ధం మొదలవుతుంది" అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యావని.. ఆంధ్రా కనుసన్నల్లో పాలన సాగుతోందని కూడా కోమటిరెడ్డి ఆరోపించారు. వాస్తవాలు మాట్లాడితే పదవులు రావని కొందరు చెబుతున్నప్పటికీ తాను ప్రజల తరఫున గొంతు విప్పడానికి వెనుకాడబోనని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

సాధారణంగా ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం.. ముఖ్యమంత్రి పనితీరుపై ఇలాంటి విమర్శలు చేస్తుంటారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే స్వయంగా ముఖ్యమంత్రిపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గానీ.. ఇతర కాంగ్రెస్ అగ్రనాయకత్వం గానీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.




రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి ఫైర్. “అదృష్టంతో సీఎం అయ్యావు.. మూడేళ్లలో ఎవరూ సంతోషంగా లేరు. TG అంటే కొడంగల్, మధిరేనా?” అంటూ ప్రశ్నించారు. “కమీషన్లు ఇవ్వను, తీసుకోను. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే యుద్ధం చేస్తాం.. వదిలిపెట్టేది లేదు” అంటూ హెచ్చరించారు. #RevanthReddy #KomatireddyRajGopalReddy #Congress #Telangana #TelanganaPolitics #TeluguNews #Tupaki Follow👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 18, 2026


Tags:    
  • komatireddyrajagopalreddy 
  • revanthreddy 
  • telanganapolitics 
  • congress 

Similar News

రేవంత్ ను పొడవడానికి ‘కోమటిరెడ్డి’ ఒక్కడు చాలు.. ‘రూ.5వేల’ మంటపెట్టాడు..

2026-11-18 07:05 GMT

అయ్యో: గణపతి పూజ కోసం పంతం.. మనస్తాపంతో పురోహితుడి మృతి

2026-09-16 04:10 GMT

మంత్రి పీఠంపై 'గుత్తా' మ‌న‌సు ప‌డ్డారా?

2026-08-30 02:30 GMT

చివరి మాటతోనే నిందితులను పట్టేశారు.. రూపారెడ్డి హత్య కేసులో కీలక ఆధారం!

2026-08-20 06:48 GMT

తాటిచెట్టుపై సీసీ కెమెరా ఏంది సామీ.. ఐడియా అదిరింది గౌడన్నా..

2026-08-07 17:16 GMT

బీఆర్ ఎస్‌.. త్వ‌ర‌లోనే హెచ్ ఆర్ ఎస్‌!: కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్‌!

2026-06-29 10:35 GMT

మినిస్ట‌ర్ పోస్ట్ ప్లీజ్‌: రాహుల్‌కు కోమ‌టిరెడ్డి విన‌తి

2026-06-07 01:30 GMT

రెడ్డి గారి మీద డౌట్లు ?

2026-05-02 02:30 GMT

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని గుర్తు చేస్తున్న రేవంత్ రెడ్డి.. రీజ‌నేంటి?

2026-01-19 04:20 GMT

డబ్బు వివాదం ముందు పేగు బంధం చిన్నదైంది.. ఇంతలా కొట్టుకోవటమా?

2025-11-24 04:22 GMT

చిట్యాల వద్ద దగ్ధమైన బస్సు.. ప్రయాణికుల పరిస్థితి ఏంటంటే?

2025-11-11 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS