మంత్రి పీఠంపై 'గుత్తా' మనసు పడ్డారా?
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మంత్రి పదవిని చేపట్టాలని ఎవరికైనా ఉంటుంది.
గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు. గతంలో కాంగ్రెస్.. తర్వాత బీఆర్ ఎస్.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ఆయన మంత్రివర్గంలో చోటు కోసం మనసు పడుతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మె ల్సీగా ఉన్న గుత్తా.. శాసన మండలి చైర్మన్‌గా కీలక బాధ్యత వహిస్తున్నారు. అయితే.. ఆయన గతంలోనూ మంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, నెరవేరలేదు. ఆయన వరుసగా 2019, 2021లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలలో గుత్తా నల్గొండ నియోజకవర్గం నుండి 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
సుదీర్ఘరాజకీయ ప్రస్థానంలో మంత్రి పదవిని చేపట్టాలని ఎవరికైనా ఉంటుంది. కానీ, నల్గొండ రాజకీయాల్లో అందరికీ ఈ అవ కాశం లభించడం లేదు. ఈ క్రమంలో గుత్తా ఆశలు కూడా పెద్దగానెరవేరడం లేదు. ఈ క్రమంలో తరచుగా ఆయన మంత్రివర్గంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. చర్చకు దారి తీశాయి. మంత్రివర్గం బోర్ కొడుతోందని.. ముఖాలు మార్చాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికేరెండేళ్లుగా మంత్రులు ఉన్నారని.. వారిస్థానంలో ఆశావహులకు చోటు కల్పించాలని అన్నారు. అయితే.. తనకు ఇవ్వాలని ఆయన చెప్పలేదు.
కానీ, మనసులోమాత్రం తాను మంత్రి కావాలనికోరుకుంటున్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇక, ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు. ఆయనను యువకుడిగా అభివర్ణించారు. అంతేకాదు.. ఆయన రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు. రేవంత్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నా రు. అయితే.. కేబినెట్ సహా ప్రభుత్వంలోని వారిని మార్చాల్సిన అవసరం సీఎంకు ఉందన్నారు. సీఎం రేవంత్ ఇమేజ్ ను తక్కువ చేసే మాట్లాడేవారిని కూడా ఈ సందర్భంగా గుత్తా హెచ్చరించారు.
ముఖ్యంగా చిన్నారెడ్డి వ్యవహారాన్ని ప్రస్తావించిన గుత్తా.. ఆయన చేసిన వ్యాఖ్యలు.. పార్టీని డ్యామేజీ చేస్తాయన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప.. పార్టీ నాయకులకు సరైన సంకేతాలు పంపించనట్టు కాదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత లేదన్నారు. అయితే.. పింఛన్లు పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయని.. కనీసం 3 వేల రూపాయలైనా ఇవ్వాలని అన్నారు. రేవంత్ నాయకత్వాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని గుత్తా తేల్చి చెప్పారు.