ప్యాకేజ్డ్ ఫుడ్ ప్యాకెట్స్ పై రెడ్ వార్నింగ్? అసలు దీని అర్థం ఏంటో తెలుసా?

ఒకప్పటితో పోల్చుకుంటే తినే ఆహారం మొదలుకొని జీవించే లైఫ్ స్టైల్ వరకు ప్రతిదీ కూడా కాలంతో పాటు మారుతూ వస్తోంది.

Update: 2026-08-30 00:30 GMT

ఒకప్పటితో పోల్చుకుంటే తినే ఆహారం మొదలుకొని జీవించే లైఫ్ స్టైల్ వరకు ప్రతిదీ కూడా కాలంతో పాటు మారుతూ వస్తోంది. ఇకపోతే ఒకప్పుడు పిల్లల్ని మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇంట్లో చేసే ఆహారం తినడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ప్యాకేజ్డ్ ఫుడ్ , శీతల పానీయాలు పైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.. ముఖ్యంగా చాక్లెట్లు, బిస్కెట్లు మొదలుకొని పిజ్జా, బర్గర్, లేస్ అంటూ రోజుకో వెరైటీ చొప్పున మార్కెట్లో అందుబాటులో వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో ఉపయోగించే కొన్ని రకాల కలర్స్, స్వీట్ , స్పైసీ ఐటమ్స్ ఆహార పదార్థాల రుచిని పెంచేస్తున్న నేపథ్యంలో వీటిని తినే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో భారత్లో ప్యాకేజ్డ్ ఫుడ్, శీతల పానీయాలపై ముందు భాగంలో స్పష్టమైన పోషకాహార హెచ్చరికలు ముద్రించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ఉత్పత్తులపై వినియోగదారులను అప్రమత్తం చేసే రంగుల ఆధారిత లేబుల్ లను తీసుకురావాలన్న ప్రతిపాదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచంలో పలు దేశాలలో ఇప్పటికే ఇలాంటి రంగుల కోడింగ్ విధానాలు అమల్లో ఉండగా.. మన భారతదేశంలో కూడా ఇలాంటి స్పష్టమైన పోషకాహార హెచ్చరికలు చేస్తూ.. కోడింగ్ విధానాలు అమలులోకి రావాలి అంటూ భారత ఆహార భద్రత నియంత్రణ సంస్థ గతంలో చెప్పుకొచ్చింది. అయితే ప్రజారోగ్య కార్యకర్తలు ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుల్ అంశాన్ని పరిశీలించాలని అటు నియంత్రణ సంస్థలను ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి రెడ్ లేబుల్.. ముఖ్యంగా ప్యాకెట్లపై చూపించే కలర్ కోడింగ్ దేనికి సంకేతం అంటూ నెటిజన్స్ నచర్చిస్తున్నారు. మరి ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ పై ఉపయోగించే కలర్ కోడ్స్ దేనికి సంకేతం అనే విషయం ఇప్పుడు చూద్దాం..

మారుతున్న జీవనశైలిలో ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారానికి ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే మనం ఏం తింటున్నామో దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. అటువంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, మీరు తీసుకొనే ప్రతి ఆహార వస్తువు ప్యాకెట్ పై ఒక చిన్న రంగు గుర్తు కనిపిస్తుంది. ఆకుపచ్చ , ఎరుపు , నీలం, పసుపు, నలుపు ఇలా కొన్ని రకాల గుర్తులను మనం గమనించవచ్చు మరి ఆ గుర్తు రంగు దేనికి సంకేతం అనే విషయానికి వస్తే..

ఆకుపచ్చ.. ఇది పూర్తిగా శాఖాహారమని సూచిస్తుంది. అంటే ఇందులో మాంసం, గుడ్డు లేదా మరే ఇతర జంతు ప్రొడక్ట్స్ కలిపి ఉండరు..

నీలం.. వైద్యుడి సలహా లేకుండా వీటిని ఉపయోగించకూడదు. ముఖ్యంగా దీనిని వైద్యంలో ఉపయోగిస్తారు అని సంకేతం.

ఎరుపు.. ఈ ఉత్పత్తులను మాంసాహారంతో తయారుచేస్తారు. అంటే మీరు శాకాహారులైతే వీటిని తీసుకోకపోవడం మంచిది.

పసుపు.. ఈ ఆహారంలో గుడ్లు ఉపయోగించి ఈ ఉత్పత్తులను తయారు చేసినట్లు సంకేతం.

నలుపు.. ఆహార ప్యాకెట్ పై నల్లటి రంగు గుర్తు ఉంటే ఆ ప్యాకెట్ లో పెద్ద మొత్తంలో కెమికల్స్ ఉన్నాయని సూచిస్తుంది. వీటిని రుచి పెంచడానికి అలాగే రంగు ఇవ్వడానికి, ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండడానికి కెమికల్స్ కలుపుతారు. అయితే పెద్ద పరిమాణంలో వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం . ముఖ్యంగా నలుపు రంగు గుర్తు ఉన్న ఉత్పత్తులను తీసుకోకపోవడం మంచిది. వీటి వల్ల జీర్ణ వ్యవస్థ , కాలేయం, మూత్రపిండాలు ప్రభావితం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇలాంటి రంగులు ఇప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ పై తీసుకువస్తే ప్రజలు అవగాహనతో వేటిని తినాలో.. తినకూడదో అర్థమవుతుంది అంటూ..FSSAI ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలిస్తున్న నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News