టార్గెట్ జెన్ జీ : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

జెన్ జీ మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి ఇండియా కూటమి నుంచి రాష్ట్రాలలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీల దాకా అందరి దృష్టి జెన్ జీ మీదనే ఉంది.

Update: 2026-08-29 18:15 GMT

జెన్ జీ మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి ఇండియా కూటమి నుంచి రాష్ట్రాలలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీల దాకా అందరి దృష్టి జెన్ జీ మీదనే ఉంది. మొత్తం జనాభాలో అరవై శాతం దాకా ఉన్నారు. వంద కోట్ల దాకా ఓటర్లు ఉన్న ఈ దేశంలో 2029 నాటికి ఆ సంఖ్య మరింతగా పెరగనుంది. అదే సమయంలో జెన్ జీ యూత్ ఓట్లు కూడా మరో అయిదు శాతం పెరుగుతాయని అంటున్నారు. దాంతో జెన్ జీని మంచి చేసుకోవడానికి పార్టీల స్థాయిలో ప్రభుత్వాల స్థాయిలో ఎవరి మటుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెన్ జీల కోసం కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు.

వర్షాకాల సమావేశాల్లో :

తెలంగాణా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా జెన్ జీ యువతకు వరంగా ఒక సంచలన తీర్మానం చేసి తెలంగాణా అసెంబ్లీ పార్లమెంట్ కి పంపనుంది. 21 ఏళ్ళు నిండితే చాలు అసెంబ్లీకి పార్లమెంట్ కి పోటీ చేయడానికి వీలు కల్పిస్తూ ఈ తీర్మానం తెలంగాణా శాసనసభ ఆమోదిస్తుంది అని అంటున్నారు. దేశంలో ఎక్కడా ఈ తరహా తీర్మానం కానీ ప్రతిపాదన కానీ ఇప్పటిదాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, ఏ రాజకీయ పార్టీ చేయలేదు. తొలిసారి దక్షిణాది నుంచి అందునా తెలంగాణా నుంచి ఈ ప్రతిపాదన పెట్టడంతో కచ్చితంగా పొలిటికల్ అడ్వాంటేజ్ తమకే ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. అంతే కాదు సీఎం రేవంత్ రెడ్డి కూడా జెన్ జీ మీద ఫోకస్ పెట్టి మరీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారని అంటున్నారు.

అర్హత వయసు చూస్తే :

ఇదిలా ఉంటేలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస అర్హత వయసు 25 సంవత్సరాలుగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 84 (బి) ప్రకారం లోక్‌సభ సభ్యుడిగా లేదా ఎంపీగా పోటీ చేయడానికి కనీసం 25 ఏళ్లు నిండి ఉండాలి. ఇక దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన నాటికి అభ్యర్థికి కనీసం 25 నిండి ఉండాలి. లోక్‌సభకు పోటీ చేసేవారు ఏదైనా పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీకి పోటీ చేసేవారు ఆయా రాష్ట్రంలోని ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి..ఇతర ముఖ్యమైన అర్హతలు:భారత పౌరుడై ఉండాలి.భారతదేశంలోని ఏదైనా ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. ఇదీ నిబంధన. రాజ్యాంగం పొందుపరచిన రూల్ గా ఇప్పటిదాకా ఉంది.

ఒక అడుగు ముందుకేసి :

అయితే దీనిని మరో నాలుగేళ్ళు తగ్గించి 21 ఏళ్లుగా నిర్ధారించమని రేవంత్ రెడ్డి కోరుతున్నారు. జెన్ జీ ఇపుడు చాలా వివేకంగా ఆలోచిస్తున్నారని వారికి చట్ట సభలకు వెళ్ళే అర్హత హక్కు మరింత ముందుగా కల్పిస్తే యువ పార్లమెంటేరియన్లను దేశం చూస్తుందని అంటున్నారు. అలాగే యువ పరిపాలన కూడా మొదలవుతుందని చెబుతున్నారు. ఈసారి తెలంగాణా అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ఇదే హైలెట్ అని అంటున్నారు. మరి అసెంబ్లీ చేసిన తీర్మానం మీద కేంద్రం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి. ఏది అయినా తీర్మానం చేసి ఒక అడుగు ముందుకేసిన తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది కలిసి వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News