ట్రిప్ అంటే టూరిజం కాదు.. వెల్నెస్ డెస్టినేషన్.. ఇండియాలో అలాంటి ప్రదేశాలు ఎక్కడున్నాయో తెలుసా?

ఇకపోతే పక్క దేశాలకు వెళ్లి ఖర్చుతో కూడుకున్న ప్రయాణాలు అందరికీ భారమే. కానీ ఇప్పుడు ట్రిప్ అంటే టూరిజం కాకుండా వెల్నెస్ డెస్టినేషన్ గా మారిపోయింది.

Update: 2026-08-29 14:30 GMT

నిత్యం గజిబిజి లైఫ్ స్టైల్ లో వీకెండ్స్ వచ్చినా లేదా లాంగ్ హాలిడేస్ వచ్చిన సరే ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటారు.. ఒకప్పుడు పెద్దవాళ్లు ట్రిప్ అంటే.. రామేశ్వరం, కాశీ , మధుర మీనాక్షి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు. కాలం మారుతున్న కొద్దీ ట్రిప్ లలో చేంజెస్ వచ్చేసాయి. చాలామంది దుబాయ్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ అంటూ పక్క దేశాలపై దృష్టి సారిస్తున్నారు. ఇకపోతే పక్క దేశాలకు వెళ్లి ఖర్చుతో కూడుకున్న ప్రయాణాలు అందరికీ భారమే. కానీ ఇప్పుడు ట్రిప్ అంటే టూరిజం కాకుండా వెల్నెస్ డెస్టినేషన్ గా మారిపోయింది.

వెల్నెస్ డెస్టినేషన్ కే ఎక్కువ ప్రాధాన్యత..

ముఖ్యంగా పర్యాటకులను ఈ వెల్నెస్ డెస్టినేషన్ బాగా ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల అభిరుచులు వేగంగా మారిపోతున్న నేపథ్యంలోనే కేవలం విహారయాత్రలకే పరిమితం కాకుండా మానసిక ప్రశాంతత , శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక స్వస్థత కలిగించే అనుభవాల వైపు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. అందుకే ఆయుర్వేదం , ధ్యానం, యోగ, ఆధ్యాత్మిక సాధనలో మన ఇండియాకి ఉన్న దశాబ్దాల సాంప్రదాయం.. ఈ ట్రెండింగ్ కి ప్రధాన బలంగా నిలిచింది . అప్పటికప్పుడు రిలాక్సేషన్ ఇచ్చే ట్రిప్ కంటే దీర్ఘకాలిక ఆరోగ్యం, జీవనశైలి మార్పుపై ఇండియా దృష్టి సారించడమే ప్రపంచ ప్రయాణికులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

ప్రయాణికులను ఆకర్షిస్తున్న ప్రాంతాలు..

మరి వెల్నెస్ డెస్టినేషన్ గా మారిన ఇండియాలో ఏ ఏ ప్రాంతాలు పర్యాటకులను ఏ ఏ ట్రీట్మెంట్ కోసం ఆకర్షిస్తున్నాయి అనే విషయానికి వస్తే.. ఆయుర్వేదం, యోగ రీట్రీట్ లు, ఆధ్యాత్మిక పర్యాటకం, విలాసవంతమైన రిసార్ట్లు పెరుగుదలతో అంతర్జాతీయ ప్రయాణికులను ఇండియా ఆకర్షిస్తోంది. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, డిజిటల్ అలసట కారణంగా ప్రజలు ఇప్పుడు హీలింగ్ ట్రావెల్ వైపు మొగ్గు చూపుతున్నారు.

కేరళ: భారతదేశంలో మనకు ముందుగా గుర్తొచ్చేది కేరళ. ఆయుర్వేద చికిత్సలు, పంచకర్మ , బ్యాక్ వాటర్ రీ ట్రీట్, ప్రకృతి వైద్యం కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

ఉత్తరాఖండ్లో ఉన్న రిషికేష్.. ప్రపంచ యోగ రాజధానిగా పేరుగాంచిన రిషికేశ్ యోగా శిబిరాలు, గంగా తీర ధ్యానం, ఆశ్రమ జీవనానికి ప్రసిద్ధి పొందింది.

గోవా: లగ్జరీ రిసార్ట్ లకు కేంద్రంగా నిలుస్తున్న గోవా.. బీచ్ యోగా కి కూడా ప్రసిద్ధి పొందింది. అలాగే సముద్ర తీరం మైండ్ ఫుల్ నెస్ రీట్రీట్లకు కూడా గోవా ప్రసిద్ధి పొందింది.

మైసూరు: శాస్త్రీయ యోగ, ప్రాణాయామం ,సంపూర్ణ జీవనశైలికే అంతర్జాతీయ హబ్ గా గుర్తింపు పొందింది మైసూరు.

వారణాసి: వారణాసి విషయానికి వస్తే ఆధ్యాత్మిక శక్తి , గంగా హారతి, ధ్యాన అనుభవాలతో ప్రపంచ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక హిమాలయాల మధ్య యోగ ట్రెక్కింగ్ , వెల్నెస్ ప్రోగ్రాములకు మనాలి ధర్మశాల ప్రసిద్ధి చెందాయి. ఇలా మొత్తానికి అయితే మన భారతదేశంలోనే ఇలా కొన్ని వెల్నెస్ డెస్టినేషన్స్ పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News