• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  జమిలితో బీజేపీ : ...

జమిలితో బీజేపీ : తెలంగాణాను ఎగరేసుకుపోతారా ?

| 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని కథనం పేర్కొంది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తే ప్రధాని మోదీ ఇమేజ్ తమకు కలిసివస్తుందని బీజేపీ అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యూహం అమలైతే కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

By - Satya P
Update: 2026-11-17 17:37 GMT

బీజేపీకి దక్షిణాదిన ఈ రోజున చూస్తే అయిదు రాష్ట్రాలలో ఎక్కడా రాజకీయంగా తగిన బలం కానీ అధికారం కానీ లేదు, ఏపీలో ఎన్డీయే కూటమిలో జూనియర్ పార్టనర్ గానే బీజేపీ ఉంది. కర్ణాటకలో 2023లో అధికారం పోయింది. తమిళనాడులో అన్నా డీఎంకే తో కలసి అధికారంలో వాటా పొందవచ్చు అని ఆశ పడ్డా ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ రివర్స్ అయింది. కేరళలో ఎంతో కొంత ఉనికి చాటుకోవాలని చూసినా పెద్దగా వర్కౌట్ కాలేదు, దాంతో బీజేపీ కొత్త ప్లాన్ తో ముందుకు వస్తోంది. అదే జమిలి ఎన్నికలు. 2029 లో జమిలి ఎన్నికలతో వెళ్ళాలని అనుకుంటోంది. ఈ దెబ్బతో ఏపీలో బలం పెంచుకుని తెలంగాణాలో అధికారం అందుకోవాలని పక్కా స్కెచ్ తో ముందుకు సాగుతోంది అంటున్నారు.

భారీ కసరత్తుతో :

ఎప్పటికీ తమకు సొంతం కాదనుకున్న పశ్చిమ బెంగాల్ నే బీజేపీ ఖాతాలో వేసుకున్నాక తెలంగాణా మీద కూడా ఆశలు పెరుగుతున్నాయని అంటున్నారు. చాలా నెలల నుంచే తెలంగాణలో అధికారం కోసం బీజేపీ రాజకీయంగా భారీ కసరత్తుని చేస్తోంది. తెలంగాణాను కొట్లాడి తెచ్చిన బీఆర్ఎస్ కి రెండు సార్లు జనాలు అధికారం ఇచ్చారు, కేంద్రంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చినందుకు 2023 లో గౌరవించి పట్టం కట్టారు. ఇక ఈ బిల్లుకి మద్దతు ఇచ్చినందుకు బీజేపీకి కూడా ఒక చాన్స్ ప్రజలు ఇస్తారని ఆ పార్టీ నమ్ముతోంది. అందుకే 2028 ఎన్నికలను కాస్తా 2029 దాకా పొడిగించి జమిలి పెట్టి మరీ తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని చూస్తోంది అంటున్నారు.

మూడింట రెండు వంతులు :

ఇక బీజేపీకి మరోసారి ఆదుకొవాల్సింది దక్షిణాది రాష్ట్రాలే అని అంటున్నారు. బీజేపీకి కూడా ఆ విషయం స్పష్టంగా తెలుసు అంటున్నారు. 2024 నుంచే ఉత్తరాదిన బీజేపీ రాజకీయ క్షీణత మొదలైంది అని అంటున్నారు. రాజకీయంగా పీక్స్ కి చేరిన కమలం గ్రాఫ్ కాస్తా ఇపుడు తగ్గుముఖం పడుతోంది అంటున్నారు. దానికి కారణం యాంటీ ఇంకెంబెన్సీ. అందుకే కొత్త చోట్ల తన ఆకర్షణ మంత్రంతో బీజేపీ అధికారాలను అందుకుంటే కేంద్రంలో మరోసారి గద్దెనెక్కడానికి మార్గం సుగమం అవుతుంది అని లెక్క వేసుకుంటోంది. ఈ క్రమంలో ఎన్నడూ అధికారం రుచి చూడని తెలంగాణాలో పాగా వేయాలని గట్టిగానే తీర్మానించుకుంది అని అంటున్నారు. అదే విధంగా కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ ఓటమి చెంది తమకు అధికారం దక్కుతుందని ఆశలు బీజేపీకి ఉన్నాయి. ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి తమ ఎంపీల బలాన్ని పెంచుకుంటే 2029 లో తమకు అధికార పీఠం కేంద్రంలో తప్పకుండా దక్కుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.

జమిలితో ఝలక్ :

ఇక కర్ణాటక కానీ తెలంగాణా కానీ జమిలికి దూరంగా ఉన్నాయి. 2023 మేలో కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. 2028లో అక్కడ ఎన్నికలు జరగాలి. అలా చూసుకుంటే ఏడాది పాటు శాసన సభని పొడిగించడమో రాష్ట్రపతి పాలన పెట్టడమో చేయాలి. అది అంత సులువుగా కుదిరే వ్యవహారం కాదు, దాంతో ఆరు నెలల పాటు అసెంబ్లీని పొడిగించి 2028 చివరిలో కర్ణాటక తెలంగాణాలకు ఎన్నికలు జరిపిస్తే మేలు అన్నది కూడా ప్రతిపాదన ఉంది. అపుడు 2029 మేలో జరగాల్సిన లోక్ సభ ఎన్నికలు జమిలిలో భాగంగా ఆరు నెలలు ముందుకు తోసుకుని వస్తాయని అంటున్నారు. ఇక ఏపీలో కూడా ఆరు నెలల ముందే ఎన్నికలు జరిపి జమిలి చట్రంలోకి తీసుకుని వస్తే కనుక ఈ మూడు రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయాలు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విధంగా జమిలి ఎన్నికలు పెడితే మాత్రం రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఝలక్ తగిలినట్లే అంటున్నారు.

జాతీయ అంశాలే ముందుకు :

జమిలి ఎన్నికలు అంటే ప్రాంతీయ అంశాలు పక్కకు పోయి జాతీయ అంశాలే ముందుకు వస్తాయి. అలా మోడీ ఇమేజ్ తో తెలంగాణాలో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది అంటున్నారు. ఇది కచ్చితంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. అలాగే ఏపీలో ప్రాంతీయ పార్టీల మద్దతుతో బీజేపీ ఉంది కాబట్టి టీడీపీకి జనసేనకు మేలు చేస్తాయని అంటున్నారు. అదే సమయంలో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీకి కూడా ఇబ్బందికరం అవుతుందని అంటున్నారు.

Tags:    
  • bjp 
  • simultaneouselections 
  • telanganapolitics 
  • southindiapolitics 

Similar News

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

రేవంత్ ను పొడవడానికి ‘కోమటిరెడ్డి’ ఒక్కడు చాలు.. ‘రూ.5వేల’ మంటపెట్టాడు..

2026-11-18 07:05 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

విజయ్ కు అందలం.. సీఎంలు రేవంత్, డీకే, సతీషన్ కు మంగళం.. ఇలా చేస్తే కాంగ్రెస్ ను అనరా మరీ..

2026-11-17 04:40 GMT

తెలంగాణ‌లో మూడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ!

2026-11-15 20:29 GMT

‘‘అండాలు ఇస్తే రూ. 50 వేలు’’ హైదరాబాద్ లో దారుణం, తండ్రి చికిత్స కోసం వచ్చి ఇరుక్కుపోయిన యువతి

2026-11-15 20:24 GMT

నాగార్జునకు భారీ లబ్ది...ఈటల సంచలన వ్యాఖ్యలు!

2026-11-14 16:43 GMT

కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు

2026-11-14 10:44 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో బిగ్ ట్విస్ట్.. రేవంత్ హింట్

2026-11-14 03:20 GMT

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

హైడ్రా రంగనాథ్ మీద నాగ్ పొగడ్తల వర్షం...మ్యాటర్ ఇదే !

2026-11-12 02:22 GMT

Copyright @2026

Powered by Blink CMS