కూటమి ప్రభుత్వంలో పుత్ర రత్నాలు: నాయకుల తిప్పలు.. !
అయితే.. ఈ కేసులో మంత్రి తనయుడి ప్రమేయం లేదని.. ఏకంగా ఎస్పీ చెప్పుకొచ్చారు. కొంత వరకు ఆయన బయట పడ్డారు.;
కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులకు చెందిన కొందరు పుత్రులు చేస్తున్న ఘన కార్యాయా లు.. నాయకులకు ఇబ్బంది తెస్తున్నాయి. కొన్ని కొన్ని ఘటనల్లో ఇబ్బందుల నుంచి తప్పించుకుంటు న్నా.. మరికొన్ని ఘటనల్లో మాత్రం చిక్కుకుపోతున్నారు. దీంతో నాయకులకు ఇబ్బంది తప్పడం లేదు. తాజాగా కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి ఏకంగా డ్రగ్స్ తీసుకుంటూ అరెస్టయ్యారు.
ఇప్పటి వరకు.. తమ కుటుంబానికి మచ్చలేదని భావిస్తూ.. చెబుతూ కూడా వచ్చిన ఆదిని ఈ పరిణామం ఇరుకున పడేసింది. అంతేకాదు.. ప్రత్యర్థులపై విమర్శలు చేసే ఆయనకు ఈ వ్యవహారం తలనొప్పిగా పరిణమించింది. దీని నుంచి బయట పడతారో లేదో చూడాలి. మరోవైపు.. మంత్రి సంధ్యారాణి కుమారు డు కూడా కొన్నాళ్ల కిందట వివాదంలో చిక్కుకున్నారు. ఓ వివాహితను బెదిరించారన్న కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇది కూడా ఉత్తరాంధ్రలో తీవ్ర కలకలం రేపింది.
అయితే.. ఈ కేసులో మంత్రి తనయుడి ప్రమేయం లేదని.. ఏకంగా ఎస్పీ చెప్పుకొచ్చారు. కొంత వరకు ఆయన బయట పడ్డారు. అయితే.. బాధిత మహిళ న్యాయ పోరాటానికి రెడీ అయ్యారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇక, విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా భూకబ్జా కేసులో ఇరుక్కున్నారు. ఓ వ్యాపారిని బెదిరించారన్నది ఆయనపై వచ్చిన అభియోగం. దీనిపై చర్చలు చేసి.. మధ్యేమార్గంగా రాజీ కుదుర్చుకోవడం కొన్నాళ్ల కిందట.. విజయవాడలో సంచలనంగా మారింది.
ఇక, వైసీపీ నాయకులు కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. జోగి రమేష్ కుమారుడు అగ్రిభూముల కేసుల్లో ఉన్నారు. పేర్ని నాని కుమారుడు దూకుడుగా వ్యవహరించి.. పోలీసులపై దాడి చేయబోయారన్న కేసులు ఉన్నాయి. ఓ టీడీపీ కీలక నాయకుడి కుమారుడిపై.. లైంగిక వేధింపుల కేసు వెంటాడుతోంది. ఇలా.. నేతల కుమారులు.. తమ కుటుంబపెద్దల రాజకీయాలను అడ్డు పెట్టుకునిచేస్తున్న ఈ పరిణామా లతో నాయకులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇవి మారాలంటే.. నాయకులు కట్టడి చేయాల్సిందే.