మంత్రి పదవి...ఆయనకు మాత్రం నో ఎంజాయ్

రాక రాక మంత్రి పదవి ఆయనకు దక్కింది. పైగా కీలకమైన ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి. ఆయనే పయ్యావుల కేశవ్.;

Update: 2026-01-06 03:54 GMT

రాక రాక మంత్రి పదవి ఆయనకు దక్కింది. పైగా కీలకమైన ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి. ఆయనే పయ్యావుల కేశవ్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి బలమైన నాయకుడు. 1994లో తొలిసారి గెలిచిన ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పాలి. అయితే ఆయన విషయంలో విధి వింతాట ఆడుతూ వచ్చింది. ఆయన ఎపుడు గెలిచినా టీడీపీ విపక్షంలో ఉండేది, ఇక టీడీపీ గెలిస్తే ఆయన ఓటమి చెందేవారు. ఈ విధంగా జరిగి చివరికి ఆయనతో పాటు పార్టీ 2024 లో గెలిచాయి. దాంతో ఆయనకు చంద్రబాబు కేబినెట్ బెర్త్ ని కంఫర్మ్ చేసి కీలక బాధ్యతలే కట్టబెట్టారు.

ఆర్థికమే కానీ :

ఇక చేతిలో ఉన్నది ఆర్థిక మంత్రిత్వ శాఖ. మిగిలిన రాష్ట్రాలలో అయితే ఈ శాఖకు ఎంతో డిమాండ్ ఉంది. ఎందుకంటే అందరు మంత్రులు తిరిగేది ఈ శాఖ చుట్టూనే. లక్ష్మీ కటాక్షం ఉన్న శాఖ. కానీ ఏపీ లాంటి చోట్ల వేరే పరిస్థితి. ఏపీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టేట్. పైగా అప్పులు కుప్పలుగా పేరుకుని పోయాయి. వైసీపీ అయిదేళ్ళ కాలంలో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసింది. దాంతో 2024 లో కూటమి ప్రభుత్వం వచ్చేనాటికే ఆ అప్పులు పది లక్షల కోట్ల దాకా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక గడచిన ఇరవై నెలలలో కూడా అప్పులు చేయాల్సి వస్తోంది. పాత వాటికి వడ్డీలు కట్టాల్సి వస్తోంది. దాంతో ప్రతీ నెలాఖరు అయ్యేసరికి ఈ అప్పులూ వడ్డీల మీద భారాలు లెక్కలు అన్నీ ఆర్ధిక మంత్రిగా పయ్యావుల కేశవ్ చూడాల్సి వస్తోంది.

అప్పులు అనివార్యం :

ఏపీకి వచ్చే ఆదాయం సంగతి ఒక లెక్క. అయితే సూపర్ సిక్స్ హామీలు మరో వైపు అమరావతి రాజధాని పోలవరం ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చూసుకుంటే కనుక అప్పులు తప్పడం లేదు, ఇవి ఒక ఎత్తు అయితే బడ్జెట్ కి అవుతున్న ఖర్చుకు మధ్య పొంతన ఏ మాత్రం కుదరడం లేదు అని అంటున్నారు. దాంతో నెల తిరిగేసికల్లా అప్పులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతీ నెలా సామాజిక పెన్షన్లకే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్లు ఇవన్నీ ఖర్చులు కలిపి నెల మొదటివారంలోనే ఏకంగా పది వేల కోట్లకు పైగా ఖర్చు ఉంటుంది. వీటిలో సర్దుబాటు కోసం అప్పులు తెచ్చి పెట్టాల్సి వస్తోంది అని అంటున్నారు. ఒక విధంగా ఆర్ధిక వ్యవహారాలు అన్నీ తీవ్ర ఒత్తిడిగానే ఉన్నాయని పయ్యావుల కేశవ్ వైపు నుంచి వినిపిస్తున్న మాట అని అంటున్నారు.

బాబు పెట్టిన బాధ్యత :

అయితే అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పయ్యావుల కేశవ్ మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత పెట్టారు అని అంటున్నారు. గతంలో పయ్యావుల పీఏసీ ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు. ఆయనకు ఆర్థిక వ్యవహారాల మీద పూర్తి అవగాహన ఉందని అంటారు. దాంతో బాబు పెట్టిన బాధ్యతను పయ్యావుల సమర్ధంగా చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం ఎక్కడా తగ్గడం లేదు, సంక్షేమం ఒక వైపు అభివృద్ధి మరో వైపు రెండు కళ్ళుగా భావించి అమలు చేస్తోంది. దాంతో నిధుల కొరత ఉంది. ఇలా అన్నింటినీ నిభాయించుకుని రావడం అంటే కత్తి మీద సాము అని అంటున్నారు.

దూకుడు అంతా అటే :

నిజానికి చూస్తే పయ్యావుల కేశవ్ సబ్జెక్ట్ మీద గట్టిగా మాట్లాడుతారు, ప్రత్యర్ధులను విమర్శించడంలో ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది. కానీ ఇపుడు ఆయన పూర్తిగా మంత్రిత్వ శాఖకే పరిమితం అయ్యారని ఎక్కువ సార్లు ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తోంది అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద రావాల్సిన నిధుల గురించి మంత్రులతో భేటీలు వేయడం అలాగే అప్పుల విషయంలో కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడం అలా ఆయన గత ఇరవై నెలలలో తీరిక లేకుండా గడచిపోయింది అని అంటున్నారు. దాంతో ఆయన తన సొంత నియోజకవర్గానికే కాదు దైనందిన రాజకీయానికి కూడా కాస్తా దూరం అయ్యారని చెబుతున్నారు. మొత్తం మీద మంత్రి పదవి వచ్చింది అన్న ఆనందం కంటే టెన్షన్ ఎక్కువగా ఈ శాఖలో ఆయనకు ఉందని అంటున్నారు. సో నో ఎంజాయ్ అన్న మాట వినిపిస్తోంది. అంతే కాదు ఎవరు తన దగ్గరకు వచ్చినా ఎస్ అని నిధులు ఇవ్వాల్సిన శాఖలో ఉండి కూడా నో చెప్పాల్సి వస్తోందిట. మరి ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న వేళ ఏ ఆర్థిక మంత్రి అయినా కఠినంగా ఉండాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News