వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియన్ నగరాలు!

భారతదేశం ఆర్థికంగా దూసుకుపోవడమే కాదు, ఆకాశమే హద్దుగా మన నగరాలు రూపురేఖలు మార్చుకుంటున్నాయి.;

Update: 2026-03-07 08:30 GMT

భారతదేశం ఆర్థికంగా దూసుకుపోవడమే కాదు, ఆకాశమే హద్దుగా మన నగరాలు రూపురేఖలు మార్చుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్కైస్క్రాపర్స్ నిర్మాణంలో మన భారతీయ నగరాలు అగ్రస్థానంలో నిలవడం విశేషం. దుబాయ్, షెంజెన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ నగరాలను వెనక్కి నెట్టి ముంబై, హైదరాబాద్ వంటి నగరాలు టాప్ లిస్టులో చోటు సంపాదించాయి. అసలు ఏ నగరాల్లో ఈ భవనాల నిర్మాణం జోరుగా సాగుతోంది? మన దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ముంబై, హైదరాబాద్:

నిర్మాణ రంగంలో ప్రస్తుతం భారత్ ఒక సునామీలా దూసుకుపోతోంది. తాజా గ్లోబల్ లెక్కల ప్రకారం, ప్రపంచంలోనే అత్యధికంగా ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్న నగరాల్లో ముంబై మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇక్కడ ఏకంగా 200కు పైగా భారీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక మన భాగ్యనగరం హైదరాబాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 181 హైరైజ్ బిల్డింగ్స్‌తో ముంబై తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. అంటే దుబాయ్ 38, షెంజెన్ 73 వంటి నగరాల కంటే మన హైదరాబాద్‌లోనే ఎక్కువ నిర్మాణాలు సాగుతుండటం మనందరికీ గర్వకారణం.

టాప్ 5లో మూడు భారతీయ నగరాలే:

ఈ జాబితాలో కేవలం ముంబై, హైదరాబాద్ మాత్రమే కాదు, మరికొన్ని భారతీయ నగరాలు కూడా సత్తా చాటుతున్నాయి. మూడో స్థానంలో 170 నిర్మాణాలతో గురుగ్రామ్ నిలవగా, ఐదో స్థానంలో 79 నిర్మాణాలతో థానే చోటు దక్కించుకుంది. ఇక అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 5 నగరాల్లో నాలుగు మన దేశానివే కావడం విశేషం. చైనాలోని షెంజెన్, గ్వాంగ్జౌ, ఉహాన్ వంటి నగరాల కంటే మన నగరాల్లోనే రియల్ ఎస్టేట్ మరియు మౌలిక సదుపాయాల కల్పన అత్యంత వేగంగా జరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మారుతున్న నగరాల స్వరూపం.. పెరగనున్న ఉపాధి:

ఈ భారీ నిర్మాణాల వల్ల కేవలం భవనాలు మాత్రమే పెరగడం లేదు, వీటితో పాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. నవీ ముంబై 27 నిర్మాణాలు కూడా ఈ రేసులో గట్టి పోటీనిస్తోంది. ఇక టోక్యో, టొరంటో వంటి అంతర్జాతీయ నగరాలను కూడా మన నగరాలు దాటేయడం చూస్తుంటే, రాబోయే ఐదేళ్లలో మన నగరాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ భవనాలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవడమే కాకుండా, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించే కేంద్రాలుగా మారుతున్నాయి..

Tags:    

Similar News