ఏపీ నేతల మాట: బయటికొస్తే.. ఖర్చయిపోతాం.. !
అయితే.. కొందరి విషయంలో ఇది కొంత వరకు నిజం ఉన్నా.. మిగిలిన వారి విషయంలో అసలు సమస్య .. వేరే ఉందని తెలుస్తోంది.;
పార్టీలతో సంబంధం లేదు.. జెండాలతోనూ సంబంధం లేదు. నాయకులు అందరిదీ ఒకే మాటగా వినిపి స్తోంది. బయటకు వస్తే.. ఖర్చయిపోతాం.. అనే మాటే తరచుగా నాయకులు చెబుతున్నారు. కానీ.. పార్టీల అధినేతలు... మాత్రం ప్రజల మధ్యకురావాలని చెబుతున్నారు. ప్రజలతో ఉండాలని.. వారిస మస్యలు తెలుసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అయినప్పటికీ నాయకులు మాత్రం ముందుకు రావడం లేదు. దీనికి ప్రధానంగా వారిని ఖర్చువెంటాడుతోందన్న రీజన్ వినిపిస్తోంది.
నిజమెంత.. ?
అయితే.. నాయకులు చెబుతున్న మాటల్లో నిజం ఉందా? అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ ప్రజల మధ్య కు వచ్చినా.. ఆ మాత్రం ఖర్చు చేయలేని పరిస్థితి ఉందా? అనేది కీలక ప్రశ్న. కొన్నాళ్ల కిందట.. సీఎం చంద్రబాబు సైతం పార్టీ నేతలను ఉద్దేశించి ఇదే ప్రశ్నించారు. కార్యకర్తలకు ఆమాత్రం టీ కూడా ఇప్పిం చలేని పరిస్థితిలో ఉన్నారా? అని ఆయన నిలదీశారు. ఏ పనిచెప్పినా.. ఖర్చు విషయాన్ని ప్రస్తావించడం తో సహజంగా నాయకులకు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అయితే.. కొందరి విషయంలో ఇది కొంత వరకు నిజం ఉన్నా.. మిగిలిన వారి విషయంలో అసలు సమస్య .. వేరే ఉందని తెలుస్తోంది. నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు.. గత ఎన్నికల సమయంలో ప్రజలను మచ్చిక చేసుకునేందుకు నియోజకవర్గంలో చేపడతామని చెప్పిన ప్రాజెక్టులు ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో ఇప్పుడు నియోజకవర్గాల్లో పర్యటిస్తే.. ఆయా సమస్యలపై ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇది టీడీపీ, జనసేన వర్గాలకు ఇబ్బందిగా మారింది.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. గత పాలన తాలూకు మరకలు ఇంకా పోలేదు. దీంతో వారు కూడా ప్రజల మధ్యకు రాలేక పోతున్నారన్నది వాస్తవం. మరి ఇలా ఎన్నాళ్లు? అనేది కీలక ప్రశ్న.. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చూపించి.. టీడీపీ, జనసేన నాయకులు ప్రజల మధ్యకురావాలని.. ప్రచారం చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, నాయకులు మొండికేస్తున్నారు. ఇక, వైసీపీ నేతలు కూడా.. ఇప్పుడు కాదు.. ఎన్నికలకు ముందు చూద్దాంలే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.